పెదపారుపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెదపారుపూడి
—  రెవిన్యూ గ్రామం  —
పెదపారుపూడి is located in Andhra Pradesh
పెదపారుపూడి
పెదపారుపూడి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°25′34″N 80°57′17″E / 16.4260°N 80.9548°E / 16.4260; 80.9548
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 2,835
 - పురుషులు 1,435
 - స్త్రీలు 1,413
 - గృహాల సంఖ్య 737
పిన్ కోడ్ 521263
ఎస్.టి.డి కోడ్ 08674


పెదపారుపూడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండల కేంద్రం.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భొగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

ఈ ఊరు గుడివాడ నుండి 5 కి.మీ. దూరంలో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, విజయవాడ

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, నందివాడ, పామర్రు, ఉంగుటూరు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వే స్టేషన్: 40 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

గీతాంజలి జూనియర్ కాలేజి, జిల్లాపరిషత్ హైస్కూల్, ఎస్.నవజీవన్ ఉన్నత పాఠశాల, పెదపారుపూడి.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్లాస్టిక్ వ్యర్ధాల కొనుగోలు కేంద్రం[మార్చు]

ఈ గ్రామములో 2017,జులై-6న ఈ కొనుగోలు కేంద్రాన్ని, ప్రారంభించారు. ఈ కేంద్రంలో ప్లాస్టిక్ వ్యర్ధాలను కిలో 20 రూపాయల చొప్పున కొనుగోలు చేసెదరు. [9]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామ పంచాయతీ నవంబరు-5,1951 నాడు ఆవిర్భవించింది. [4]

2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గారపాటి లక్ష్మి, సర్పంచ్‌గా ఎన్నికైనారు. [10]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి మందిరం[మార్చు]

  1. ఈ ఆలయంలో 2015,అక్టోబరు-27వ తేదీ మంగళవారం నాడు, పంచలోహ విగ్రహ ఆవిష్కరణ ప్రతిష్ఠాపన ఉత్సవం, శాస్త్రోక్తంగా నిర్వహించారు. 108 కలశాలతో, పంచమృతాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ విగ్రహ తయారీకి అయిన 2.4 లక్షల రూపాయల వ్యయాన్ని, గ్రామస్తులంతా సమష్టిగా విరాళంగా అందజేసినారు. [4]
  2. ఈ ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని, 2016,ఫిబ్రవరి-13వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే విఘ్నేశ్వరపూజ, ఆకుపూజ, నాగావళి అర్చన, విశేష పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. [6]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు,,అపరాలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామం వ్యవసాయకంగా బాగా అభివృద్ధి చెందింది. వ్యవసాయంలో నూతన వరవడి రూపొందించిన వరి కోత మిషను వర్కు షాపు ఉంది.

ప్రముఖులు[మార్చు]

  • చెరుకూరి రామోజీరావు: పారిశ్రామికవేత్త, ఈనాడు సంస్థల వ్యవస్థాపకుడు. ఈనాడు పత్రిక సంపాదకులు . వీరు ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దడానికై దత్తత తెసికొన్నారు.[3]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. మతే బాలశౌరి రావు ఈ ఊరిలో పనిచేసిన విద్యావేత్త. ఈయన విద్యాశాఖలో వివిధ స్థాయిలలో 36 సంవత్సరముల పాటు పనిచేశారు.
  2. ఈ మండలములో సుమారుగా 7 సంవత్సరములు వ్యవసాయాధికారిగా పనిచేసిన సూరపనేని శ్యామల మంచి పేరు తెచ్చుకున్నారు.
  3. ఘనవ్యర్ధాల నిర్వహణ కేంద్రం:- చెత్త,ఘనవ్యర్ధాల నుండి, సంపద తయారుచేసే విధంగా వినూత్న ఘనవ్యర్ధాల కేంద్రంలో, 2016,ఫిబ్రవరి-17వ తేదీనాడు, తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి, వర్మీ కంపోస్టు ఎరువు తయారుచేసే విధానానికి, వానపాములు వేసి శ్రీకారం చుట్టినారు. ఈ కేంద్రం వర్మీ కంపోస్ట్ ఎరువు తయారుచేయడంతో అభివృద్ధిలో మొదటి అడుగు వేసింది. ఈ కేంద్రంలో సేంద్రియ ఎరువు విక్రయానికి 2016,ఏప్రిల్-7వ తేదీనాడు శ్రీకారం చుట్టినారు. ఈ విధంగా చెత్త నుండి సంపద తయారుచేఉకొనడం ద్వారా, పంచాయతీ ఆదాయం గణనీయంగా పెంచుకొనవచ్చునని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వనరులు[మార్చు]

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedaparupudi/Pedaparupudi". Archived from the original on 4 నవంబర్ 2019. Retrieved 30 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  3. ఈనాడు కృష్ణా; 2015,మే నెల,3వతేదీ; 9వపేజీ.

వెలుపలి లింకులు[మార్చు]

[4] ఈనాడు అమరావతి; 2015,అక్టోబరు-28; 23వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-5; 24వపేజీ. [6] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-14; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-18; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఏప్రిల్-8; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-7; 2వపేజీ.