భూషణగుళ్ళ

వికీపీడియా నుండి
(భూషనగుల్ల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భూషణగుళ్ళl గ్రామీణ
—  రెవిన్యూ గ్రామం  —
భూషణగుళ్ళl గ్రామీణ is located in Andhra Pradesh
భూషణగుళ్ళl గ్రామీణ
భూషణగుళ్ళl గ్రామీణ
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°26′05″N 80°58′07″E / 16.434767°N 80.968594°E / 16.434767; 80.968594
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 2,029
 - పురుషులు 1,018
 - స్త్రీలు 1,032
 - గృహాల సంఖ్య 552
పిన్ కోడ్ 521263
ఎస్.టి.డి కోడ్ 08674

భూషణగుళ్ళl (Bhushanagulla), కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 521 263. ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరులపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పెదపారుపూడి మండలం[మార్చు]

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[3] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, నందివాడ, ఉంగుటూరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 42 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

ఎ.ఎన్.ఆర్.కాలేజి, మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, భూషణగుళ్ళ

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

రక్షిత మంచినీటి పథకం.

ఆంధ్రా బ్యాంక్:- గ్రామములో ఈ బ్యాంక్ శాఖను 1977, మే-8న ప్రారంభించారు. [4]

పశువైద్యశాల:- గ్రామములో గ్రామస్తుల, రైతుల విరాళాలతో నూతనంగా నిర్మించిన ఈ పశువైద్యశాల భవనాన్న్ని 2016,నవంబరు-16వతేదీ బుధవారంనాడు ప్రారంభించినారు. ఈ భవన నిర్మానానికి కీ.శే.గుళ్ళపల్లి బాపయ్యచౌదరి జ్ఞాపకార్ధం, వారి కుమారుడు స్వర్గీయ గుళ్ళపల్లి అత్రిమహాముని, 14 సెంట్ల స్థలాన్నివిరాళంగా అందజేసినారు. [5]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గోగుల వరలక్ష్మి సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ గంగా పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ ధ్వజ, శిఖర (సంప్రోక్షణ) పునఃప్రతిష్ఠా కార్యక్రమం, 2015, నవంబరు-22వ తేదీ ఆదివారంనాడు, వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్యహోమాలు, పూర్ణాహుతి, శ్రీ సీతారాముల శాంతికళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. మూడు రోజులు నిర్వహించిన ఈ కార్యక్రమాలలో భాగంగా, అఖరిరోజున అన్నసంతర్పణగావించారు. [1]
  3. శ్రీ షిర్డీ సాయి మందిరం:- ఈ ఆలయ 13వ వార్షికోత్సవం, 2016, ఫిబ్రవరి-6వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. [2]
  4. శ్రీ వీరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో, 2016, ఫిబ్రవరి-22వ తేదీ, మాఘశుద్ధ పౌర్ణమినాడు, అమ్మవారి వార్షిక ఉత్సవాలను నయనానందకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు చెన్ను వంశీకులు అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమపూజలు, అభిషేకాలు నిర్వహించి, అమ్మవారికి పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు సమర్పించారు. అమ్మవారు కొలువుదీరి ఉన్న పుట్ట వద్ద, క్షీరం, నైవేద్యాలు సమర్పించారు. వేపచెట్లు, శివాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. వీరమ్మతల్లి, చింతయ్యస్వామివారల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి, ఊయలసేవ, గ్రామోత్సవం యువత, నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ కన్నులపండువగా నిర్వహించారు. చివరగా భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2050.[4] ఇందులో పురుషుల సంఖ్య 1018, స్త్రీల సంఖ్య 1032, గ్రామంలో నివాస గృహాలు 552 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016. Cite web requires |website= (help)
  2. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedaparupudi/Bhushanagulla". Retrieved 30 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  4. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

బయటి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-23; 23వపేజీ. [2] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-7; 1వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-23; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,మే-8; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016,నవంబరు-17; 1వపేజీ.