ఎలమర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యలమర్రు
—  రెవిన్యూ గ్రామం  —
యలమర్రు is located in Andhra Pradesh
యలమర్రు
యలమర్రు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°24′22″N 80°55′33″E / 16.406248°N 80.925934°E / 16.406248; 80.925934
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,025
 - పురుషులు 1,968
 - స్త్రీలు 2,057
 - గృహాల సంఖ్య 1,246
పిన్ కోడ్ 521148
ఎస్.టి.డి కోడ్ 08674

యలమర్రు, కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 521 148., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పెదపారుపూడి మండలం[మార్చు]

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[3] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, నందివాడ, ఉంగుటూరు, పామర్రు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 13 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల-1.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

ఈ కేంద్రానికి, నూతనంగా నిర్మించిన భవనాన్ని, 2016,అక్టోబరు-23న ప్రారంభించారు. [9]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ సూరపనేని వెంకటసత్యనారాయణ సర్పంచ్‌గా ఎన్నికైనారు. [11]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

(1)శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం:- ఈ ఆలయంలో, కార్తీకమాసంలో మాసశివరాత్రి రోజున, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, చక్రం, స్వస్తిక్, ఓం, శివలింగం ఆకారంలో దీపాలు వెలిగించి ప్రత్యేకపూజలు చేస్తారు. [2]

(2)శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం. ఈ పై రెండు ఆలయాలలోనూ వార్షిక మహోత్సవాలను 2016,మే-17వ తేదీ మంగళవారం నుండి 21వ తెదీ శనివారం వరకు వైభవంగా నిర్వహించెదరు. [8]

(3)శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయ అభివృద్ధి నిమిత్తం, మాజీ ఛైర్మన్ కీ.శే.కొడాలి రంగారావు ఙాపకార్ధం, ఆయన కుమారుడు, మనుమడు జయరాం, వెంకటనాగఫణీంద్రబాబు దంపతులు, ఉగాది కానుకగా ఒక లక్ష రూపాయల విలువైన గ్రానైట్ రాళ్ళతో, స్వామివారి సన్నిధిలో అలంకరించారు. [6]

(4)శ్రీ అంకమ్మ అమ్మవారి ఆలయం:- యలమర్రు శివారు యలమర్రుపాలెంలో వేసేసియున్న ఈ ఆలయంలో, 2015,మే-31వ తేదీ ఆదివారంనాడు, అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనుమూరి వంశీయులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, అమ్మవారికి ఉదయాన్నే జల, క్షీరాభిషేకాలు, కుంకుమపూజలు, కుంభాభిషేకం, బలిదానాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి, మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం సందర్భంగా, భక్తులకు భారీగా అన్నదానం ఏర్పాటుచేసారు. [7]

(5)శ్రీ షిర్డీసాయిబాబా మందిరం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

  • శ్రీహరి (నటుడు)
  • వడ్డే రమేష్
  • కగ్గా శిరోమణి ఈమె వెయిట్ లిఫ్టింగులో శిక్షణ పొంది, ఆ క్రీడలో అద్భుత ప్రతిభ కనబరచుచున్నది. శిక్షణ మొదలుపెట్టిన మూడు నెలలలోనే, జిల్లా స్థాయిలో పసిడిపతకం సాధించిన ఈమె, ఆ తరువాత రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలోనూ పాల్గొని పలు పతకాలు సాధించింది. ఈమె ప్రస్తుత లక్ష్యం ఒలింపిక్ పోటీలలో పాల్గొనటమేనని చెబుచున్నది. [3].ఈమె ఇంతవరకు, జాతీయస్థాయిలో 42 పతకాలు, రాష్ట్రస్థాయిలో 55 పతకాలు సాధించింది. ఇటీవల న్యూజిలాండు దేశంలో నిర్వహించిన జూనియర్ కామన్ వెల్త్ పోటీలలో కాంస్యపతకం సాధించింది. తాజాగా ఈమె 2014,డిసెంబరు-18 నుండి 21 వరకు జెంషెడ్ పూరులో నిర్వహించు అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో పాల్గొంటుంది. ఈ పోటీలకు రాష్ట్రం నుండి ఎంపికైన ముగ్గురు క్రీడాకారులలో మహిళా విభాగం నుండి ఎంపికైనది ఈమె ఒక్కరే కావటం విశేషం. [4].ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్ పూరులో, ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన, సుభ్రత క్లాసిక్ ఓపెన్ ఇంటర్ నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో, ఈమె 87 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది. పవర్ లిఫ్ట్, డెడ్ లిఫ్ట్, బెంచ్ ప్రెస్ విభాగాలలో మొత్తం 395 కిలోల బరువు ఎత్తి, ఈమె ఈ ఘనత సాధించింది. [4].2015,ఫిబ్రవరి-1వ తేదీ నుండి 5వ తేదీ వరకు, కేరళ రాష్ట్రంలోని త్రిచూరు పట్టణంలోని వి.కె.ఎన్.మీనన్ ఇండోరు స్టేడియంలో నిర్వించిన జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో, ఈమెకు రజత పతకం లభించింది. ఈ పతకం సాధించినందువలన, ఈమెకు రు. 5 లక్షల వరకు నగదు బహుమతి లభించే అవకాశం ఉంది. [5].ఈమె 2020లో నిర్వహించు ఒలింపిక్స్ పోటీలలో పాల్గొనుటకు అధికంగా శ్రమించుచున్నది. [10]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,025 - పురుషుల సంఖ్య 1,968 - స్త్రీల సంఖ్య 2,057 - గృహాల సంఖ్య 1,246

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4433.[4] ఇందులో పురుషుల సంఖ్య 2266, స్త్రీల సంఖ్య 2167, గ్రామంలో నివాసగృహాలు 1227 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-20.
  3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedaparupudi/Yalamarru". Retrieved 30 June 2016. External link in |title= (help)
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-3; 16వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2014,ఆగస్టు-12; 9వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014,డిసెంబరు-20; 3వపేజీ. [5] [6] ఈనాడు అమరావతి; 2015,జూన్-1; 37వపేజీ. [7] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఏప్రిల్-8; 1వపేజీ. [8] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-17; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,అక్టోబరు-24; 2వపేజీ. [10] ఈనాడు గుంటూరు సిటీ; 2017,మార్చి-19; 5వపేజీ. [11] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జులై-9; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఎలమర్రు&oldid=3319809" నుండి వెలికితీశారు