వడ్డే రమేష్
వడ్డే రమేశ్ | |
---|---|
జననం | వడ్డే రమేశ్ అక్టోబరు 11, 1947 కృష్ణా జిల్లా, యలమర్రు |
మరణం | నవంబరు 21, 2013 |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
ప్రసిద్ధి | ప్రముఖ సినీ నిర్మాత |
మతం | హిందూ |
పిల్లలు | వడ్డే నవీన్ |
Notes ఉత్తమాభిరుచి గల నిర్మాతగా వడ్డే రమేశ్ ప్రేక్షకుల మనసులలో చోటు సంపాదించాడు |
వడ్డే రమేశ్ (అక్టోబరు 11, 1947 - నవంబరు 21, 2013) ప్రముఖ తెలుగు సినీ నిర్మాత.
జననం
[మార్చు]1947, అక్టోబరు 11 న కృష్ణా జిల్లా, యలమర్రులో జన్మించారు.
నేపధ్యము
[మార్చు]విజయమాధవి పిక్చర్స్ అధినేతగా ప్రసిద్ధి గాంచిన ఆయన తెలుగులో నిర్మించిన తొలి చిత్రం పాడవోయి భారతీయుడా. అలాగే హిందీలో తొలి చిత్రం 'సున్హేరా సంసార్' నిర్మించారు.ఆయన నిర్మించిన బొబ్బిలిపులి చిత్రం తెలుగు నాట ఘన విజయం సాధించింది. విజయమాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే రమేశ్ నిర్మించిన అనేక చిత్రాలు విశేషాదరణను చూరగొన్నాయి... 'బొబ్బిలిపులి' స్వర్ణోత్సవ చిత్రంగా రికార్డ్ సృష్టించగా, రమేశ్ నిర్మించిన కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ వంటి చిత్రాలు రజతోత్సవాలు జరుపుకున్నాయి.
1947 అక్టోబరు 11న కృష్ణాజిల్లా యలమర్రు గ్రామంలో జన్మించారు. సినిమారంగంపై మక్కువతో చిత్రసీమలో అడుగు పెట్టిన రమేశ్ మొదట 'సున్హేరా సంసార్' అనే హిందీచిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఘనవిజయం సాధించిన పండంటి కాపురం ఆధారంగా ఆదుర్తి సుబ్బారావు దర్శత్వంలో ఈ హిందీ చిత్రం రూపొందింది. తెలుగులో ఆయన నిర్మించిన తొలిచిత్రంపాడవోయి భారతీయుడా. తరువాత అక్కినేని హీరోగా ఆత్మీయుడు నిర్మించారు. దాసరి దర్శకత్వంలో కృష్ణంరాజు హీరోగా రమేశ్ నిర్మించిన 'కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ' చిత్రాలు అద్భుత విజయం సాధించాయి. ఈ చిత్రాల విజయంతో తన ప్రస్థానాన్ని అప్రహతిహతంగా కొనసాగించారు.
ఘట్టమనేని కృష్ణతో "విశ్వనాథ కథానాయకుడు", చిరంజీవితో "లంకేశ్వరుడు" వంటి భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించారు. వడ్డే రమేశ్ తనయుడు వడ్డే నవీన్ కూడా కథానాయకునిగా తెలుగువారికి సుపరిచితమే.! నవీన్ హీరోగా నటించిన "లవ్ స్టోరీ99" చిత్రానికి వడ్డే రమేశ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. "కలహాల కాపురం", "తిరుగుబాటు", "దుర్గాదేవి", "ఏడుకొండల స్వామి" వంటి చిత్రాలనూ ఆయన నిర్మించారు. దాసరి నారాయణరావుతో రమేశ్ బంధం విడదీయలేనిది. దాసరి దర్శకత్వంలోనే అద్భుతమైన చిత్రాలను నిర్మించారు రమేశ్.. దాసరి నూరవ చిత్రం 'లంకేశ్వరుడు'ను కూడా రమేశ్ నిర్మించడం విశేషం. రమేశ్ ఎన్ని చిత్రాలు నిర్మించినా, 'బొబ్బిలిపులి' నిర్మాతగా జనం మదిలో ముద్రవేశారాయన.
ప్రముఖ నటుడు వడ్డే నవీన్ ఈయన పుత్రుడే.
మరణం
[మార్చు]ఇతను 2013, నవంబరు 21 న క్యాన్సర్ వ్యాధితో మరణించారు.