కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా | |
---|---|
![]() . | |
![]() | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
ప్రాంతం | కోస్తా |
ప్రధాన కార్యాలయం | మచిలీపట్నం |
విస్తీర్ణం | |
• మొత్తం | 8,727 కి.మీ2 (3,370 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 45,29,009 |
• సాంద్రత | 519/కి.మీ2 (1,340/చ. మై.) |
భాషలు | |
• అధికార భాష | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0( ) |
అక్షరాస్యత | 74.37 (2001) |
పురుషుల అక్షరాస్యత | 79.13 |
స్త్రీల అక్షరాస్యత | 69.62 |
లోకసభ నియోజక వర్గం | మచిలీపట్నం లోకసభ నియోజకవర్గం |
జాలస్థలి | http://krishna.ap.nic.in/ |
కృష్ణా జిల్లా కు ఆ పేరు జిల్లాలో ప్రవహించే కృష్ణా నది వల్ల వచ్చింది. జిల్లా అధికారిక కేంద్రం మచిలీపట్నం కాగా, వాణిజ్య కేంద్రంగా విజయవాడ ఉంది. ఈ జిల్లా సరిహద్దులలో ఉత్తరాన ఖమ్మం జిల్లా, తూర్పున పశ్చిమ గోదావరి, దక్షిణాన బంగాళాఖాతము, నైరుతిలో గుంటూరు జిల్లా, వాయవ్యంలో సూర్యాపేట జిల్లా ఉన్నాయి. [1] Map
జిల్లా చరిత్ర[మార్చు]
కృష్ణా పరీవాహక ప్రాంతం కనుక ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ జిల్లాలో ఉన్న ఇంద్రకీలాద్రి మీద అర్జునుడు పాశుపతాస్త్రం కొరకు పరమశివుని ఉద్దేశించి తపమాచరించాడని, దుర్గాదేవి ఇక్కడ మహిశాసురుడిని సంహారం చేసిందని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కృష్ణా నది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనక దుర్గాదేవి భక్తజన పూజలను అందుకొంటూ ఉంది. చరిత్రలో వివిధ కాలాల్లో శాతవాహనులు, చోళులు, రెడ్డిరాజులు, గోల్కొండ నవాబులు మొదలైనవారు ఈ ప్రాంతాన్ని పాలించారు. మొవ్వ గ్రామం లోని కృష్ణుని దేవాలయము చాలా పురాతనమైనది. ఈ ఊరి స్థల పురాణము ప్రకారం మౌద్గల్య మహర్షి చేత ఇసుకతో ఇచటి మువ్వ గోపాల స్వామి విగ్రహం తయారుచేయబడెను. ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అంతే కాక చదువు రాని వరదయ్య తరువాతి కాలంలో క్షేత్రయ్యగా స్వామి కృపతో గొప్ప కవి అయ్యాడని ప్రతీతి. క్షేత్రయ్య రాసిన శృంగార కవిత్వం ఎంతో ప్రసిద్ధి. కృష్ణా జిల్లాను ఇంతకు ముందు "మచిలీపట్నం జిల్లా" అని పిలిచేవారు. 1859లో గుంటూరు జిల్లాలోని కొన్ని తాలూకాలను ఈ జిల్లాలో కలిపి కృష్ణాజిల్లాగా పేరు మార్చారు. 1925లో కృష్ణాజిల్లాను కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలుగా విభజించారు.
శాతవాహనుల కాలం[మార్చు]
శ్రీకాకుళం రాజధానిగా శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహన రాజులు నాలుగు శతాబ్దాల కాలం పాటూ ఈ ప్రదేశాన్ని పాలించారు.
పల్లవులు[మార్చు]
గుంటూరు జిల్లా మైదవోలులో లభించిన తామ్ర శాసనాలననుసరించి పల్లవులు ఈ ప్రాంతాన్ని 250 నుండి 340 క్రీ.శ॥ వరకూ పాలించారు.
బృహత్పలాయనులు[మార్చు]
వీరు కోడూరు రాజధానిగా ఈ జిల్లా ప్రాంతాన్ని పల్లవుల తదుపరి పాలించారు.
విష్ణు కుండినులు[మార్చు]
వీరు క్రీ.శ॥5వ శతాబ్దంలో పాలించారు. వీరి కాలంలోనే మొగల్రాజపురం ఇంకా ఉండవల్లిలోని గుహలు తవ్వించి తీర్చిదిద్దబడ్డాయి.
తూర్పు ఉండవల్లి లోతూర్పుచాళుక్యులు[మార్చు]
వీరుని గుహామందిరాలు ఇంకా శివాలయాలు కట్టించారు.
కాకతీయులు[మార్చు]
క్రీ.శ॥1323 వరకు వీరి పాలన జరిగింది. వీరి కాలంలో జిల్లాలోని ఎన్నో దేవాలయాలు పోషించబడ్డాయి.
రెడ్డిరాజులు[మార్చు]
కొండపల్లిలోని కోట శిథిలాలు వీరి పాలనకు తార్కాణంగా నిలుస్తాయి.
గజపతులు[మార్చు]
రెడ్డిరాజుల అనంతరం గజపతుల పాలనలో కృష్ణా జిల్లా ప్రాంతం వచ్చింది. ప్రస్తుత పమిడిముక్కల మండలంలోని కపిలేశ్వరపురం గజపతి రాజయిన కపిలేశ్వర గజపతి పేరున నామకరణం చేయబడింది. కపిలేశ్వర గజపతి తదుపరి వచ్చిన విద్యాధర గజపతి విజయవాడలోని విద్యాధరపురాన్ని ఇంకా కొండపల్లి సరస్సుని నిర్మించాడు.
విజయనగర సామ్రాజ్యం[మార్చు]
విజయనగర సామ్రాజ్య కాలంలో జిల్లాలో ఎన్నో దేవాలయాలు, కోటలు వెలిశాయి. జీర్ణ దేవాలయాలు ఉద్ధరింపబడ్డాయి. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు సన్నిధిలోనే కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను రచించి అంకితమిచ్చాడు.
కుతుబ్ షాహీలు[మార్చు]
క్రీ.శ॥1512 లో గోల్కొండ వద్ద సుల్తాన్ కులీ కుతుబ్ షా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ సామ్రజ్యంలో జిల్లా కూడా ఒక భాగమే. మచిలీపట్నం ఓడ రేవుగా ఎగుమతి-దిగుమతులు జరిగేవి. తానీషాగా ప్రసిద్ధి చెందిన అబూ హుసేన్ షా మంత్రులయిన అక్కన్న ఇంకా మాదన్న వారి కార్యాలయాన్ని విజయవాడలో స్థాపించారు. వీరిరువురు కనక దుర్గ అమ్మవారిని ఆరాధించేవారు. నేటికీ ఇంద్రకీలాద్రి కొండ దిగువన వీరు ఆరాధించిన గుహలు మనకు దర్శనమిస్తాయి.
నిజాములు[మార్చు]
ఔరంగజేబు సామ్రాజ్యంలో భాగమయిన గోల్కొండను 5 నవాబులకు విభజించి ఆసఫ్ ఝా సుబేదారుగా పాలించాడు. ఆర్కాటు, కడప, కర్నూలు, రాజమండ్రి, చీకకోల్ (శ్రీకాకుళం) నవాబుల కింద పాలించబడ్డాయి. రాజమండ్రి నవాబు కృష్ణా జిల్లాను పాలించేవాడు.
ఆంగ్లేయులు[మార్చు]
క్రీ.శ॥1611 లో ఆంగ్లేయులు మచిలీపట్నంలో బస చేసారు. 1641 లో మద్రాసుకు తరిలి వెళ్ళే వరకూ ఇది వారికి ముఖ్యపట్నం (హెడ్‌క్వార్టర్)గా కొనసాగింది. ఆంగ్లేయుల తరువాత డచ్చి, ఫ్రెంచి వారు మచిలీపట్నాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. 1748 లో నిజాం-ఉల్-ముల్క్ మరణంతో జిల్లా ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి హస్తగతమయింది. 1761 లో నిజాం అలీ ఖాన్ తిరిగి గోల్కొండ నవాబు అయినపుడు మచిలీపట్నం నిజాం పట్నం ఇంకా కొండవీడులో కొంత భాగం బ్రిటిష్ వారికి కానుక ఇచ్చాడు. మెల్లిగా సర్కారు ప్రాంతం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది.
భౌగోళిక స్వరూపం[మార్చు]
- కృష్ణా జిల్లా పీఠభూమి, తీర ప్రాంతాలుగా విభజించబడింది. భారతదేశ అత్యంత పర్యావరణ సంబంధిత ముఖ్యమైన చిత్తడినేలలో కొల్లేరు సరస్సు ఒకటి ఈజిల్లా లోనే పాక్షికంగా ఉంది.[2]
కొండలు[మార్చు]
- జిల్లాలో ప్రధాన కొండ ఒకే పొడవుతో నందిగామ, విజయవాడ పట్టణముల మధ్య 24 కిలోమీటర్ల పరిధిలో ఉంది. దానిని కొండపల్లి అని పిలుస్తారు. జమ్మలవాయిదుర్గం, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి జిల్లాలోని ఇతర ప్రముఖ కొండలు.
- భారతదేశములో అత్యంత ప్రసిద్ధమైన కనకదుర్గదేవాలయం, విజయవాడ వద్ద ఇంద్రకీలాద్రి కొండ మీదనే ఉంది.
నీటివనరులు[మార్చు]
కృష్ణా నది (పొడవు 1280 కి.మీ.) జిల్లాలో ప్రవహించే ముఖ్యమయిన నది. బుడమేరు, మున్నేరు, తమ్మిలేరు ఇతర నదులు. కృష్ణా నది బంగాళా ఖాతంలోకి హంసలదీవి, నాచుగుంట వద్ద కలుస్తుంది. ఇవి కాక జిల్లాలో చిన్న కొండవాగులు కూడా ప్రవహిస్తాయి. ఇవి జయంతి, కట్టలేరు, ఇప్పలవాగు, ఉప్పుటేరు, తెల్లేరు, బళ్ళలేరు, ఇంకా నడిమేరు.ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొల్లేరు సరస్సులో కొంత భాగం కృష్ణా జిల్లాలో ఉంది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు, కృష్ణా డెల్టా, చింతలపూడి ఎత్తిపోతల పథకం, తమ్మిలేరు, పోలవరం ముఖ్యమైన పెద్ద, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు.
భూమి, భూగర్భ వనరులు[మార్చు]
- జిల్లాలో నల్లమట్టి (57.6%), ఇసుక బంకమట్టి (22.3%) ఎర్ర బంకమట్టి (19.4%) అను మూడు రకాల నేలలు ఉన్నాయి.
ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
---|---|---|---|
మైనింగ్ & గనుల త్రవ్వకం | % | 0.45 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
- విస్తృతంగా సహజ వాయువు, ముడి పెట్రోల్ నిక్షేపాలు తీరం వెంబడి సముద్రం, జిల్లా యొక్క తీర ప్రాంతములో ఉన్నాయి.
- కొద్దిపాటి వజ్రాల చిన్న చిన్న నిక్షేపాలు లభిస్తాయి.
- సున్నపురాయి ప్రధాన ఖనిజముగా ఈ జిల్లా నుండి సేకరిస్తారు.
- భవన నిర్మాణం కోసం వాడబడే ఇసుకను కృష్ణ, మున్నేరు నదుల నుండి త్రవ్వకాలు జరిపి సేకరిస్తారు.
- ఖనిజాలు దొరుకు ప్రాంతములు:
- క్రోమైటు : కొడపల్లి కొండలు, దగ్గర ప్రాంతాలలో
- వజ్రాలు : పరిటాల, ఉస్తేపల్లి, కొండవీటికల్లు, రామన్నపేట, సూర్యవరం, కొత్తపేట, నెమలిపురం, మాగులూరు, పుట్రేల (రాజస్థాన్ లో ముఖ్యమైనవి) మొదలైన ప్రాంతాలు.
- ఇనుము ధాతువు : జగ్గయ్యపేట ప్రాంతం.
- సున్నపురాయి : జగ్గయ్యపేట ప్రాంతం.
- మైకా : తిరువూరు ప్రాంతం.
ఆటవీ ప్రదేశం[మార్చు]
ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
---|---|---|---|
అటవీ ప్రాతం | % | 7.5 | 1997-98 లెక్కల ప్రకారం (సుమారు 9% ఉజ్జాయింపుగా ఉండవచ్చును.) |
వాతావరణం[మార్చు]
- జిల్లా వాతావరణ పరిస్థితులు వేసవికాలం చాలా వేడిగా, శీతాకాలం తేలికపాటిగా ఉంటాయి. అంతేకాక ఇక్కడి వాతావరణం పరిస్థితులు ఉష్ణ ప్రాంతములుగా వర్గీకరింపబడ్డాయి. ఏప్రిల్ ప్రారంభ కాలం నుండి జూన్ వరకు చాలా వేడిగా ఉంది. ఈ ప్రాంతంనకు నైరుతి రుతుపవనాల ద్వారా వర్షపాతం 1028 మి.మీ. అందించబడుతుంది.
ఆర్ధిక స్థితి గతులు[మార్చు]
వ్యవసాయం[మార్చు]
వ్యవసాయం గురించిన సమగ్రసమాచారం [3] కంప్యూటర్ ద్వారా అందుబాటులో ఉంది. దీనిని ఎక్కడికైనా తీసుకెళ్లగల కంప్యూటర్, ప్రొజెక్టర్ ద్వారా రైతులకు అందుబాటులోనికి తెస్తున్నారు.
వ్యాపారం[మార్చు]
- కృష్ణా జిల్లా పట్టణ ప్రాంతాలలో ఎక్కువ మంది వ్యక్తులు వ్యాపారము, వాణిజ్యం లతో నిమగ్నమై ఉన్నారు. వ్యవసాయం జిల్లా ప్రజల యొక్క అతి ముఖ్యమైన వృత్తిగా ఉంది.
ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
---|---|---|---|
వ్యవసాయం & అనుబంధ కార్యకలాపాలు | % | 66.18 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
స్థూల సాగునీటి ప్రాంతం | % | 62.00 | 1997-98 లెక్కల ప్రకారం |
తలసరి ఆహార ధాన్యాల ఉత్పత్తి | కి.గ్రా. | 321 | 1997-98 లెక్కల ప్రకారం |
- కృష్ణా జిల్లాలో ఎన్నో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లా అనేక పరిశ్రమలకు ఆతెధ్యము ఇస్తున్నది. వాటిలో కెసీపి చక్కెర కర్మాగారం చెప్పుకోతగ్గది. ఉయ్యూరు వద్ద ఉన్న KCP షుగర్ ఫ్యాక్టరీ భారతదేశంలోని అతిపెద్ద చక్కెర కర్మాగారములలో ఒకటి. ఇబ్రహీంపట్నం సమీపంలో, విజయవాడ థర్మల్ పవర్ స్టేషను (VTPS) దాని పనితీరునకు భారతదేశంలో నం .1 అధిక పవర్ ఉత్పత్తి యూనిట్‌గా స్థానం పొందింది. ఇది కాక, అనేక మీడియం స్కేల్ సిమెంట్ కర్మాగారాలు జిల్లా అంతటా ఉన్నాయి. మచిలీపట్నం వద్ద బంగారం-లేపనం ఆభరణాలు, కొండపల్లి వద్ద బొమ్మలు, జగ్గయ్యపేట వద్ద సంగీత సాధన తయారీ పరికరాలు వంటి పలు చిన్న తరహా పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి.
ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
---|---|---|---|
మాన్యుఫాక్చరింగ్ (గృహేతర) పరిశ్రమలు | % | 6.18 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
గృహ పరిశ్రమలు | % | 2.39 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
నిర్మాణము | % | 1.61 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
సేవలు | % | 23.09 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
- విజయవాడ వద్ద సిరీస్ (SIRIS) ఫార్మాస్యూటికల్ కంపెనీ, అలోపతిక్ మందులు తయారీ దిగ్గజాలలో ఇది మరొక సంస్థ. ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన పోర్ట్ మచిలీపట్నంలో ఉంది. ఇదికాక ఎన్నో సిమెంటు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. విజయవాడ దగ్గర ఇబ్రహీమ్ పట్నం వద్ద ఉన్న తాప విద్యుత్కేంద్రం చాలా పేరెన్నికగన్నది. ఇవికాక మచిలీపట్నంలో గిల్టునగల తయారీ, కొండపల్లి చెక్కబొమ్మలు, జగ్గయ్యపేటలో సంగీత సాధనముల తయారీ మొదలయిన చేతి వృత్తి పనులు కూడా ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన సాంప్రదాయిక నృత్య రీతి యైన కూచిపూడి నృత్యం జిల్లాలోని కూచిపూడి గ్రామంలో పుట్టింది.
జీవనస్థాయి[మార్చు]
- ఈ జిల్లాలో ఉన్న 4.187.841 (2001 నాటికి) జనాభాలో 32,08% శాతం పట్టణ జనాభా. జిల్లా పరిపాలన ప్రధాన కార్యాలయం మచిలీపట్నంలో ఉంది. విజయవాడకార్పొరేషన్ జిల్లా వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉంది.
ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
---|---|---|---|
పట్టణీకరణం | % | 35.82 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
మొత్తం జనాభాలో పనివారి శాతం | % | 43.3 | 1991 జనాభా లెక్కల ప్రకారం |
ఆర్థిక గణాంకాలు[మార్చు]
ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
---|---|---|---|
తపాలా కార్యాలయములు (ప్రతి 100,000 మంది జనాభా) | నిష్పత్తి | 22.04 | 1996-97 లెక్కల ప్రకారం |
బ్యాంకులు (ప్రతి 100,000 మంది జనాభా) | నిష్పత్తి | 9.33 | 1994-95 లెక్కల ప్రకారం |
తలసరి బ్యాంకు డిపాజిట్లు | రూ. | 3386.42 | 1994-95 లెక్కల ప్రకారం |
తలసరి బ్యాంకు ఋణాలు | రూ. | 2250.49 | 1994-95 లెక్కల ప్రకారం |
వ్యవసాయానికి తలసరి బ్యాంకు ఋణాలు | రూ. | 604.49 | 1994-95 లెక్కల ప్రకారం |
ఎస్.ఎస్.ఐ. (SSI)లకి తలసరి బ్యాంకు ఋణాలు | రూ. | 168.67 | 1994-95 లెక్కల ప్రకారం |
పరిశ్రమలకు తలసరి బ్యాంకు ఋణాలు | రూ. | 490.86 | 1994-95 లెక్కల ప్రకారం |
ముఖ్యమయిన పట్టణాలు[మార్చు]
విజయవాడ, గుడివాడ, ఉయ్యూరు,మచిలీపట్నం,చల్లపల్లి, కొండపల్లి, తిరువూరు, కైకలూరు, నందిగామ, నూజివీడు, జగ్గయ్యపేట, మొవ్వ మొ॥ ఈ జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలు. జిల్లాలోని హనుమాన్ జంక్షన్ కు ప్రత్యేకత ఉంది. ఇక్కడ కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలు కలిసి నూజివీడు-మచిలీపట్నం రహదారికిరువైపులా ఉంటాయి. అలాగే మూడు మండలాలు కలిసి ఉంటాయి. ఇక్కడ ఉన్న హనుమంతుని ఆలయము చాలా విశిష్టమైనది. పట్టణానికి ఆ పేరు ఈ ఆలయము వలన వచ్చినదే.
డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు[మార్చు]
భౌగోళికంగా కృష్ణా జిల్లాను 50 రెవిన్యూ మండలాలుగా విభజించారు.[4].
- కృష్ణా జిల్లాలో విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నూజివీడు, పెడన మున్సిపాలిటీలుగా ఉన్నాయి. 2011 సం. నుండి నందిగామ, తిరువూరు, ఉయ్యూరులను మున్సిపాలిటీలు (పురపాలక సంఘాలు)గా ప్రభుత్వము ప్రకటించింది.
1 జగ్గయ్యపేట మండలం | 18 పెనమలూరు మండలం | 35 నాగాయలంక మండలం |
2 వత్సవాయి మండలం | 19 తోట్లవల్లూరు మండలం | 36 కోడూరు |
3 పెనుగంచిప్రోలు మండలం | 20 కంకిపాడు మండలం | 37 మచిలీపట్నం మండలం |
4 నందిగామ మండలం | 21 గన్నవరం | 38 గూడూరు |
5 చందర్లపాడు మండలం | 22 అగిరిపల్లి మండలం | 39 పామర్రు మండలం |
6 కంచికచెర్ల మండలం | 23 నూజివీడు మండలం | 40 పెదపారుపూడి మండలం |
7 వీరులపాడు మండలం | 24 చాట్రాయి మండలం | 41 నందివాడ మండలం |
8 ఇబ్రహీంపట్నం | 25 ముసునూరు మండలం | 42 గుడివాడ మండలం |
9 జి.కొండూరు మండలం | 26 బాపులపాడు మండలం | 43 గుడ్లవల్లేరు మండలం |
10 మైలవరం | 27 ఉంగుటూరు | 44 పెడన మండలం |
11 ఏ.కొండూరు మండలం | 28 ఉయ్యూరు మండలం | 45 బంటుమిల్లి మండలం |
12 గంపలగూడెం మండలం | 29 పమిడిముక్కల మండలం | 46 ముదినేపల్లి మండలం |
13 తిరువూరు మండలం | 30 మొవ్వ మండలం | 47 మండవల్లి మండలం |
14 విస్సన్నపేట మండలం | 31 ఘంటసాల | 48 కైకలూరు మండలం |
15 రెడ్డిగూడెం మండలం | 32 చల్లపల్లి మండలం | 49 కలిదిండి మండలం |
16 విజయవాడ గ్రామీణ మండలం | 33 మోపిదేవి మండలం | 50 కృత్తివెన్ను మండలం |
17 విజయవాడ పట్టణం మండలం | 34 అవనిగడ్డ |
లోకసభ నియోజకవర్గాలు[మార్చు]
- కృష్ణా జిల్లా పరిధిలో విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు (కొద్ది భాగము) పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.
- ఈ జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం అను రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.
అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]
- ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లాలో 16 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.
క్ర.సంఖ్య | అసెంబ్లీ నియోజకవర్గం | విజేత | పార్టీ | |
---|---|---|---|---|
188 | తిరువూరు | కెఆర్ నిధి | వై.కా.పా | |
189 | నూజివీడు | మేకా వెంకట ప్రతాప్ అప్పారావు | వై.కా.పా | |
190 | గన్నవరం | వల్లభనేని వంశీ | తె.దే.పా | |
191 | గుడివాడ | కొడాలి నాని | వై.కా.పా | |
192 | కైకలూరు | కామినేని శ్రీనివాసరావు | భాజపా | |
193 | పెడన | కాగిత వెంకట్రావు | తె.దే.పా | |
194 | మచిలీపట్నం | కొల్లు రవీంద్ర | తె.దే.పా | |
195 | అవనిగడ్డ | మండలి బుద్ధప్రసాద్ | తె.దే.పా | |
196 | పామర్రు | ఉప్పులేటి కల్పన | వై.కా.పా | |
197 | పెనమలూరు | బోడె ప్రసాద్ | తె.దే.పా | |
198 | విజయవాడ పశ్చిమ | జలీల్ ఖాన్ | వై.కా.పా | |
199 | విజయవాడ సెంట్రల్ | బొండా ఉమామహేశ్వరరావు | తె.దే.పా | |
200 | విజయవాడ తూర్పు | గద్దె రామ్మోహన్ రావు | తె.దే.పా | |
201 | మైలవరం | దేవినేని ఉమామహేశ్వరరావు | తె.దే.పా | |
202 | నందిగామ | తంగిరాల ప్రభాకరరావు | తె.దే.పా | |
203 | జగ్గయ్యపేట | శ్రీ రామ రాజగోపాల్ (తాతయ్య) | తె.దే.పా |
పార్టీలు[మార్చు]
- తెలుగు దేశం, కాంగ్రెస్ (ఐ), వై.యస్.ఆర్ కాంగ్రెస్ జిల్లాలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) పార్టీలు, భారతీయ జనతా పార్టీ, లోక్ సత్తా పార్టీ, ఇతర పార్టీలు కూడా ముఖ్య పాత్రను పోషిస్తున్నాయి.
రవాణా వ్వవస్థ[మార్చు]
- విజయవాడ వద్ద పండిట్ నెహ్రూ బస్ స్టేషను ఆసియాలోని అతి పెద్ద బస్ కాంప్లెక్స్‌లలో ఒకటి.
- విజయవాడ వద్ద రైల్వే స్టేషను భారతదేశంలో 2 వ రద్దీగా ఉండే జంక్షన్ ఉంది. 200 కంటే ఎక్కువ రైళ్లు ఈ రైల్వే స్టేషను ద్వారా (పాస్) ప్రయాణించడము, రైల్వే స్టేషను వద్ద రైలు ఆగిపోవడము లేదా (ప్రారంభము) బయలుదేరడము కాని జరుగుతుంది.
- విజయవాడకు ఈశాన్యదిశలో 16 కి.మీ. దూరములో గన్నవరము వద్ద ఉన్న విమానాశ్రయం నుండి హైదరాబాద్, చెన్నై, బెంగుళూర్, రాజమండ్రి నగరములకు అనుసంధానముతో విమాన ప్రయాణమునకు వీలు ఉంది.
ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
---|---|---|---|
రహదారి పొడవు ప్రతి 100 చ.కి.మీ. | కి.మీ. | 78.76 | 1996-97 లెక్కల ప్రకారం |
రైలు మార్గము పొడవు ప్రతి 100 చ.కి.మీ. | కి.మీ. | 2.14 | 1996-97 లెక్కల ప్రకారం |
- నాలుగు జాతీయ రహదారులు ఈ జిల్లా నుండి కలుపుతున్నాయి.
- కోల్‌కత నుండి చెన్నై = NH-5
- మచిలీపట్నం నుండి పూనే = NH-9
- జగదల్పూర్ నుండి విజయవాడ = NH-221
- ఒంగోలు నుండి కత్తిపూడి = NH-214
జనాభా లెక్కలు[మార్చు]
- జనసాంద్రత అనేది ఒక జనాభా కొలమాన విధానము. ఒక చదరపు కిలోమీటరు ప్రాంతంలో నివసించే జనాభాను జనసాంద్రతగా పరిగణిస్తారు.
- కృష్ణా జిల్లా 8.727 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఆక్రమించింది (3,370 sq mi),[5] ఈ జిల్లా సుమారు, తులనాత్మకంగా కోరిస్కాతో [6] సమానం.
ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
---|---|---|---|
ప్రదేశం | చ.కి.మీ | 8727 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
జనాభా | వేలల్లో | 4218.41 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
పురుషులు | వేలల్లో | 2151.18 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
స్తీలు | వేలల్లో | 2067.22 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
పట్టణ | వేలల్లో | 1365.64 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
గ్రామీణ | వేలల్లో | 2852.76 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
జనాభా పెరుగుదల (దశసంఖ్యతో సం.) | % | +14.05 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
జనసాంద్రత (మనిషి/చ.కి.మీ.) | నిష్పత్తి | 483 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
విభాగాలు[మార్చు]
- ఈ జిల్లా ప్రతి ఆదాయం విభాగానికి ఉప కలెక్టర్ నేతృత్వంలో విజయవాడ, నూజివీడు, మచిలీపట్నం, గుడివాడ అను నాలుగు ఆదాయం విభాగాలుగా విభజించబడింది.
గృహోపకరణ సూచికలు[మార్చు]
- 2007–2008 సంవత్సరములో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ సంస్థ వారు జిల్లా అంతటా 1229 గృహాలు 34 గ్రామాలలో ఇంటర్వ్యూ జరిపారు.[7] వారు 94.7% విద్యుత్, 93,4% నీటి సరఫరా, పారిశుద్ధ్యం, 60.3% టాయిలెట్ సౌకర్యాలు, 45.5 (శాశ్వత) నివాస గృహాసౌకర్యాలు ఉన్నట్లు కనుగొన్నారు.[7] 20.6% మంది స్త్రీలు అధికారక వయస్సు 18 సం.లు నిండక ముందే వివాహము చేసుకున్నారు.[8]
- ఇంటర్వ్యూ నిర్వహించిన వారిలో 76,9% ఒక దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఉన్నారు.
సంస్కృతి[మార్చు]
- ప్రపంచ ప్రసిద్ధ కూచిపూడి నృత్య రూపం ఈ జిల్లాలో నుండి ఉద్భవించింది.
- ఈ జిల్లా వాసులు మాట్లాడే తెలుగు యాసను తెలుగు భాషయొక్క సహజరూపమని భావించబడుతుంది.
పశుపక్ష్యాదులు[మార్చు]
వృక్షజాలం, జంతుజాలం[మార్చు]
- జిల్లాలో చెప్పుకోదగ్గ అటవీప్రాంతం లేదు. అడవి మొత్తం జిల్లా వైశాల్యంలో 9% మాత్రమే ఉంది. అయితే నందిగామ, విజయవాడ,నూజివీడు, తిరువూరు,గన్నవరము, మచిలీపట్నం ప్రాంతాలలో, దివి తాలూకాలలో రిజర్వు ఫారెస్ట్ కలిగి ఉంది. ఒక రకం అయిన పొనుకు (గైరోకాపస్ జాక్విని) అని పిలువబడే తేలికపాటి రకమయిన చెక్కకొండపల్లి కొండలు ప్రాంతములో కనిపిస్తుంది. ఈ చెక్కను ఎక్కువగా బాగా అందరికీ తెలిసిన కొండపల్లి బొమ్మలు తయారీకి ఉపయోగిస్తారు. చాలా గుర్తించదగ్గ చెట్లు అయిన టెరోకార్‌పస్, టెర్‌మినాలియా, ఎనోజీస్సస్, లోగస్ట్రోయినయ్, కాజురినా లాంటివి కూడా ఉన్నాయి.
- పాంథర్స్ పులులు, దుమ్ములగొండులు, అడవి పిల్లులు, నక్కలు, ఎలుగుబంట్లు, ఇతర మాంసాహార క్షీరదాల జంతుజాలం ఇక్కడ కనిపిస్తాయి. జింక, మచ్చల లేడి సాంబార్, కృష్ణ జింక, ఇతర శాకాహార జంతువులు ఈ భూభాగ అడవులలో గుర్తించవచ్చు.
- కృష్ణ జిల్లా సరిహద్దు కొల్లేరుసరస్సులో ఒక వలస బూడిద రంగు గల పెలికాన్ బిల్డ్ అనే ఒక రక్షిత పక్షి ఉంది.
- ఈ జిల్లా అనేక ముర్రా జాతి గేదెలు, ఆవులు పెద్ద సంఖ్యలో కలిగి ఉంది.
విద్యాసంస్థలు[మార్చు]
- విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రధాన విద్యా కేంద్రాలలో ఒకటి.
- కృష్ణా జిల్లాలోని కొన్ని విశ్వవిద్యాలయాలు:
- ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ.
- కృష్ణ విశ్వవిద్యాలయం మచిలీపట్నం.
- రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూజివీడు.
- దక్షిణ భారత శాఖ యొక్క స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయం
- ఆంధ్ర జాతీయ కళాశాల, మచిలీపట్నం
- భారతదేశం లోనే కార్పొరేట్ విద్యా సంస్థలు అతిపెద్ద / పెద్ద /మధ్య రకములు అయిన, అనేక నివాస కళాశాలలు, పాఠశాలలు కలిగి ఉన్న సంస్థలలో పేరెన్నికగన్న శ్రీ చైతన్య, నలందా, గౌతమ్, శ్రీ కృష్ణవేణి సంస్థలు, అమెరికన్ మెడికల్ విద్య (USMLE) శిక్షణ సంస్థల ప్రధాన కార్యాలయములు
- జిల్లాలో అనేకం ఇంజనీరింగ్ కాలేజ్‌లు ఉన్నాయి. వాటిలో వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, కె.ఎల్.సి.ఈ., ఏ.ఏ.ఎన్.ఎమ్. & వి.వి.ఎస్.ఆర్ (గుడ్లవల్లేరు) పాలిటెక్నిక్ కళాశాల, మేరీ స్టెల్లా కళాశాల, సిద్ధార్థ డిగ్రీ కళాశాల సహా అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలో అనేక ప్రసిద్ధ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలు కూడా ఉన్నాయి.
ఆంశం | కొలమానం | సంఖ్య | మూలం |
---|---|---|---|
అక్షరాస్యత | % | 69.91 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
అక్షరాస్యత (పురుషులు ) | % | 74.57 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
అక్షరాస్యత (స్తీలు ) | % | 65.05 | 2001 జనాభా లెక్కల ప్రకారం |
కళాశాలలు[మార్చు]
- డా.ఎన్.టి.ఆర్. యూనివర్సిటి ఆఫ్ హెల్త్ సైన్సెస్. విజయవాడ
- శ్రీమతి.వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ లా కాలేజ్, విజయవాడ.
- జెస్తో కలినరి అండ్ హాస్పిటాలిటి ఎకాడమి, గవర్నర్ పేట, విజయవాడ
- ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. గర్నమెంట్ కాలేజ్, విజయవాడ.
- కె.బీ.న్.కాలేజ్,విజయవాడ.
- సయ్యద్ అప్పల స్వామి కాలెజ్, విజయవాడ.
- శాతవాహన కాలెజ్, విజయవాడ.
- ఆంధ్ర లయెల కళాశాల, విజయవాడ.
ఆకర్షణలు[మార్చు]
జిల్లాలో చారిత్రక స్థలాలు[మార్చు]
- మచిలీపట్నంపోర్ట్
- చింతలపాడు
- గుడివాడ
- కొండపల్లిఖిల్లా
- మహాత్మా గాంధీ హిల్, విజయవాడ
- ఘంటసాల
మతపరంగా ముఖ్యమైన స్థలాలు[మార్చు]
- కనకదుర్గ ఆలయం
- బ్రహ్మముగారి జెండా, ఈడుపుగల్లు
- పాండురంగస్వామి గుడి, చిలకలపూడి
- మోపిదేవి గుడి
- కొండాలమ్మ ఆలయం, గుడ్లవల్లేరు
- పెనుగంచిప్రోలు గుడి
- మొవ్వ గోపాల స్వామి ఆలయం
- సింగరాయపాలెం గుడి
- హనుమాన్ గుడి, హనుమాన్ జంక్షన్
- అయ్యప్పస్వామి గుడి, గొల్లపూడి
- పెనుగంచిప్రోలు ఆలయం
- మారెమ్మ గుడి, పుట్రేల
- సరస్వతి గుడి, నూజివీడు
- మేరీమాత గుడి, గుణదల. విజయవాడ
- వేణుగోపాల స్వామి దేవాలయం, నెమలి
- లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం, పెనుగంచిప్రోలు
- మోపిదేవి ఆలయం
- జగన్నాధ స్వామి ఆలయం, వడాలి (చిన్నపురి), ముదినేపల్లి మండలం
- రామాలయం గండేవారిగూడెం
- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, సింగరాయపాలెం
- రామాలయం గుడి, గాడెవారిగూడెం
- శ్రీ లక్ష్మి గాయత్రీ దేవి ఆలయం (105 సంవత్సరాలు), తేలప్రోలు
- బుద్ధ స్థూపం, జగ్గయ్యపేట
- రామలింగేశ్వర స్వామి ఆలయం, భలివె
- శోభనాచలం ఆలయం, ఆగిరిపల్లి
- రామలింగేశ్వర స్వామి ఆలయం, యనమలకుదురు
క్రీడలు[మార్చు]
- ఈ జిల్లాలో కబాడీ ఆట అత్యంత ప్రజాదరణ ఉన్న క్రీడతో పాటు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్ ఆటలు ప్రాముఖ్యమైనవి. విజయవాడ లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నందు, భారతదేశం యొక్క అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్లు జరుగుతాయి. హాకీ క్రీడాకారుడు బలరాం ఈ జిల్లాకు చెందినవారు.
ప్రముఖ వ్యక్తులు[మార్చు]
కృష్ణా జిల్లా ఎందరో ప్రఖ్యాత వ్యక్తులకు, నిపుణులకు ఆలవాలం. వీరిలో కొందరికి ఇది పుట్టినిల్లు కాగా, మరికొందరికి కార్యస్థానం. తమ తమ రంగాల్లో చిరస్మరణీయమైన సేవలందించిన ఎంతో మంది కృష్ణా జిల్లాతో ప్రత్యక్ష/పరోక్ష సాంగత్యాన్ని కలిగి ఉన్నారు. అంశాల వారీగా వారిలో కొందఱు...
లలిత కళలు, సాహిత్యం:[మార్చు]
రచయితలు[మార్చు]
సంస్కరణ, అభ్యుదయం:[మార్చు]
- పింగళి వెంకయ్య భారత జాతీయ పతాక రూపశిల్పి
- కాశీనాథుని నాగేశ్వరరావు ఆంధ్ర పత్రిక
- పుచ్చలపల్లి సుందరయ్య
- భోగరాజు పట్టాభి సీతారామయ్య - ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు
- డా. జయప్రకాశ్ నారాయణ - ప్రస్తుత లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు
- గోపరాజు రామచంద్రరావు (గోరాగా ప్రసిద్ధి )
- వాసిరెడ్డి బలరామకృష్ణ మహేశ్వర ప్రసాద్ - నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణ కార్యకర్త
- ముట్నూరి కృష్ణారావు పంతులు - కృష్ణ పత్రిక
- అయ్యదేవర కాళేశ్వరరావు
- దుగ్గిరాల గోపాలకృష్ణ
- అన్నాప్రగడ లక్ష్మీనారాయణ - విద్యావేత్త
- డా. ఘట్టమనేని బాబూరావు
- అన్నే అంజయ్య
శాస్త్ర సాంకేతిక రంగాలు :[మార్చు]
- ఆచార్య సూరి భగవంతం - ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త
- డా. కానూరి లక్ష్మణరావు - ప్రఖ్యాత ఇంజనీర్
- డా. నోరి దత్తాత్రేయుడు - కాన్సర్ వైద్య నిపుణులు
- వేలూరి వేంకట కృష్ణ శాస్త్రి - పురావస్తు నిపుణులు, చరిత్ర కారులు
- డా. సమరం
క్రీడలు:[మార్చు]
- సి. కె. నాయుడు
- కోనేరు హంపి
- చేతన్ ఆనంద్
రంగస్థలం, సినిమా:[మార్చు]
- రఘుపతి వెంకయ్య నాయుడు
- దండమూడి రాజగోపాలరావు
- ఎస్. వి. రంగారావు
- మహానటి సావిత్రి
- నందమూరి తారకరామారావు
- అక్కినేని నాగేశ్వరరావు
- నిర్మలమ్మ
- ఘంటసాల వేంకటేశ్వరరావు
- కోవెలమూడి సూర్యప్రకాశరావు
- కాశీనాథుని విశ్వనాధ్
- చెరుకూరి రామోజీరావు
- కైకాల సత్యనారాయణ
- కోట శ్రీనివాసరావు
- జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి
- శాయినాథ్ తోటపల్లి
- రాజేంద్రప్రసాద్
- శోభన్ బాబు
- చంద్రమోహన్
- సుత్తివేలు
- సుత్తి వీరభద్రరావు / మామిడిపల్లి వీరభద్రరావు
- చంద్రమోహన్
- మణిశర్మ
- నూతన్ ప్రసాద్
- నందమూరి హరికృష్ణ
- కోడూరి అచ్చయ్య చౌదరి
రాజకీయం[మార్చు]
సంగీతం, సాహిత్యం[మార్చు]
- కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
- పొట్లూరి వీరరాఘవయ్య చౌదరి
- గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు
ప్రముఖులు[మార్చు]
సరిహద్దు జిల్లాలు, ప్రాంతాలు[మార్చు]
![]() |
ఖమ్మం జిల్లా | ![]() | ||
గుంటూరు జిల్లా నల్గొండ జిల్లా |
![]() |
బంగాళాఖాతం పశ్చిమ గోదావరి జిల్లా | ||
| ||||
![]() | ||||
బంగాళాఖాతం |
మూలాలు[మార్చు]
- ↑ "The official Web Portal of Krishna District -Welcome to Krishna District". Archived from the original on 2014-12-20. CS1 maint: discouraged parameter (link)
- ↑ "District Resource Atlas-Krishna District" (PDF). 2018. Archived from the original (PDF) on 2019-07-18. Retrieved 2019-07-18.
- ↑ సస్యశ్రీ జాలస్థలం
- ↑ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్సైటులో కృష్ణా జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 26, 2007న సేకరించారు.
- ↑ Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Andhra Pradesh: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1111–1112. ISBN 978-81-230-1617-7.CS1 maint: extra text: authors list (link)
- ↑ "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 11 Oct 2011.
Corsica 8,741
CS1 maint: discouraged parameter (link) - ↑ 7.0 7.1 District Level Household and Facility Survey (DLHS-3), 2007-08: India. Andhra Prades (PDF). International Institute for Population Sciences and Ministry of Health and Family Welfare (India). 2010. Retrieved 2011-10-03. CS1 maint: discouraged parameter (link)
- ↑ "How Do I? : Obtain Marriage Certificate". National Portal Content Management Team, National Informatics Centre. 2005. Retrieved 2011-10-03.
To be eligible for marriage, the minimum age limit is 21 for males and 18 for females.
CS1 maint: discouraged parameter (link)
బయటి లింకులు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to Krishna district. |
- "Welcome to Zilla parishad Krishna". Archived from the original on 2011-03-01. CS1 maint: discouraged parameter (link)
- CS1 maint: discouraged parameter
- CS1 maint: extra text: authors list
- వ్యాసంs with short description
- Short description is different from Wikidata
- Pages using infobox settlement with unknown parameters
- Pages using div col with unknown parameters
- కృష్ణా జిల్లా శాసనసభ నియోజకవర్గాలు
- దక్షిణ మధ్య రైల్వే జోన్
- కృష్ణా జిల్లా రైల్వేస్టేషన్లు
- ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
- కృష్ణా జిల్లా కవులు
- కోస్తా
- ఆంధ్రప్రదేశ్ జిల్లాలు
- కృష్ణా జిల్లా
- Pages with maps