ఘంటసాల (కృష్ణా జిల్లా)
ఘంటసాల (కృష్ణా జిల్లా) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | ఘంటసాల |
ప్రభుత్వము | |
- సర్పంచి | కౌతరపు నాగరత్నం |
జనాభా (2001) | |
- మొత్తం | 9,248 |
- పురుషులు | 5,127 |
- స్త్రీలు | 5,294 |
- గృహాల సంఖ్య | 2,949 |
పిన్ కోడ్ | 521133 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
ఘంటసాల | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో ఘంటసాల మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో ఘంటసాల స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°10′38″N 80°56′51″E / 16.177089°N 80.947552°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | ఘంటసాల |
గ్రామాలు | 21 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 43,869 |
- పురుషులు | 21,761 |
- స్త్రీలు | 22,108 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 69.79% |
- పురుషులు | 74.00% |
- స్త్రీలు | 65.68% |
పిన్కోడ్ | 521133 |
ఘంటసాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం. పిన్ కోడ్ 521133., ఎస్.టి.డి. కోడ్ = 08671.
గ్రామ చరిత్ర[మార్చు]
ఈ గ్రామంలో అరుదైన బౌద్ధ స్తూపాలు 1919-20 సంవత్సరాల మధ్య త్రవ్వకాలలో దొరికాయి. ఈ గ్రామం ఒకప్పటి కాలములో భారత-రోమనుల మధ్య వర్తకములో ప్రధాన పాత్ర వహించింది. బౌద్ధ స్తూపాలు, హిందు శిల్పా శిథిలాలు అప్పటి శిల్ప కళను తెలుపుతున్నాయి. క్రీ.పూ. 2-3 శతాబ్దమునకు చెందిన పాలరాతి శిల్పాలు, ఒక రాతి ఇటుక మీద 12 నక్షత్ర మండలాలు చెక్కబడిన శిల్పము మొదలుగు కొన్ని స్తూపాలు ఫ్రాన్సు వంటి దేశాల సంగ్రహాలయాలలో ఉన్నాయి. ఘంటసాల గ్రామంలోని బౌద్ధమహా స్థూపం వద్ద, 2014,ఏప్రిల్ -15వ తేదీ, మంగళవారం నాడు, మహాచైత్రపౌర్ణమి సందర్భంగా, బౌద్ధభిక్షువు దమ్మతేజ బంతీజీ ఆధ్వర్యంలో, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌతమబుద్ధుని చిత్రపటానికి ధూప, దీప, ప్రత్యేక పూజలు నిర్వహించారు. [9]
ఈ గ్రామంలో ఇటీవల మట్టి త్రవ్వకాలలో ఒక బుద్ధుడి ముఖ ప్రతిమ లభించింది. దానిని పురావస్తుశాఖ వారికి అందజేసినారు. [13]
సీ ఆర్ డీ ఏ[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]
విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరులపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
ఘంటసాల మండలం[మార్చు]
ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట,దాలిపర్రు, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
బుద్ధుని గుర్రం "కంఠక" పేరు మీదుగా ఈ ప్రాంతానికి ఘంటసాల అని వచ్చింది.
గ్రామ భౌగోళికం[మార్చు]
[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
ఈ గ్రామం మచిలీపట్టణానికి 21 కి.మీ. దూరములో ఉంది.
సమీప గ్రామాలు[మార్చు]
కొత్తపల్లి 1 కి.మీ, చిలకలపూడి 2 కి.మీ, దేవరకోట 3 కి.మీ, చిట్టూర్పు 4 కి.మీ, మల్లంపల్లి 4 కి.మీ
సమీప మండలాలు[మార్చు]
మొవ్వ, చల్లపల్లి, పమిడిముక్కల, గూడూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
కొడాలి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 54 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
గ్రంథాలయం[మార్చు]
ఘంటసాలలో 1920ల నాటికి రామమోహన గ్రంథాలయం అనే ప్రైవేటు గ్రంథాలయం స్థాపించి చిరకాలం పాటు కొనసాగింది. 1928 నాటికి ధనలేమితో గ్రంథాలయం అసంతృప్తికరంగా పనిచేస్తూండడంతో స్థానిక సహకార పరపతి సంఘం వారు నిర్వహణ బాధ్యతలు స్వీకరించారు.[3]
వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల[మార్చు]
వ్యవసాయాధారితమైన ఈ ప్రాంతంలోని ఈ గ్రామంలో నూతనంగా మంజూరయిన ఈ కళాశాలను, 2016,నవంబరు-3వతేదీ మద్యాహ్నం 3-30 కి ప్రారంభించెదరు. ఈ కేంద్రం ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహింపబడును. [21]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ఈ పాఠశాల పూర్వవిద్యార్థిని శ్రీమతి వేమూరి ఉషారాణి, ఇపుడు హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో కేంద్రప్రభుత్వ వ్యవసాయధికారిణిగా పనిచేస్తున్నారు. [15]
పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన శ్రీమతి మత్తి అరుణ ప్రస్తుతం, ఘంటసాలలోని ఎం.జి. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పి.యి.టి.గా పనిచేస్తున్నారు. ఈమె పాఠశాలలో విద్యనేర్చుకుంటున్నప్పటి నుండియే కబడ్డీ, పరుగు పందేలలో శిక్షణ తీసికొన్నారు. అప్పటి నుండి ఈమె పలు రాష్ట్ర, జాతీయస్థాయి పరుగుపందేలలో రాణించుచూ అనేక పతకాలు సాధించారు. ఒక ప్రక్కన ఆమె చిన్నారులకు కబడ్డీ, అథ్లెటిక్స్లో నైపుణ్యాలను పెంపొందించుటకు విశేషకృషి చేయుచునే, మరియొక ప్రక్కన తన వ్యక్తిగత పతకాల సాధన దిశగా కృషిచేస్తున్నారు. ఈమె శిక్షణలో విద్యార్థులు, పలు జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం. ఈమె క్రీడలలో ప్రదర్శించిన ప్రతిభకుగాను, మన రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ చేతుల మీదుగా ప్రసంసాపత్రాలను పొందినారు. ఇంకా మన రాష్ట్రమంత్రులు, జిల్లా కలెక్టర్లూ, డి.యి.ఓ ల చేతులమీదుగా గూడా ప్రశంసాపత్రాలూ, గౌరవ సత్కారాలూ పొందినారు. [23]
సమైక్యతానగర్ పాఠశాల[మార్చు]
గురు విద్యా నికేతన్[మార్చు]
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
వ్యవసాయ పరిశోధనా కేంద్రం[మార్చు]
కృషి విఙాన కేంద్రం[మార్చు]
కృషి విఙాన కేంద్రం వద్ద, మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం, 2020,అక్టోబరు-28న నిర్వహించినారు. [24]
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]
బ్యాంకులు[మార్చు]
- ది కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్. ఫోన్ నం. 08671/223530., సెల్ = 9949556336.
- భారతీయ స్టేట్ బ్యాంక్. ఫోన్ నం. 08671/254670., సెల్ = 9652552929.
- Andhra Bank.
దాసరివారి కళ్యాణ వేదిక[మార్చు]
ఈ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ దాసరి వెంకటేశ్వర్లు, తన భార్య, దివంగత ఉపాధ్యాయురాలు కీ.శే.దాసరి వెంకటకుమారి ఙాపకార్ధం స్థానిక విశ్వేశ్వరస్వామి కళ్యాణ మండపం ప్రాంగణంలో, మూడు లక్షల రూపాయల నిధులతో, దీనిని నిర్మాణం చేసారు. ఈ వివాహ వేదిక కుల, మతరహితంగా అందరికీ ఆహ్వానం పలుకుచున్నది. [18]
ఏ.ఎస్.ఎం.సామాజిక భవనం[మార్చు]
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
ఈ గ్రామ పంచాయతీ 1918,ఏప్రిల్-14న ఏర్పడినది. [22]
ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో కౌతరపు నాగరత్నం సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ గొర్రెపాటి సురేష్ ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ స్థలాలు/దేవాలయాలు[మార్చు]
శ్రీ బాల పార్వతీ సమేత శ్రీ జలధీశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
హెచ్చు కన్ను, దిగంబరుడైన అంబరకేశుడు, త్రికాల సంధ్యాస్నానాలకు అనువుగా బంగాళాఖాతం జలధి తీరంలోని ఈ గ్రామంలో, బాలపార్వతీ సమేతంగా జలదీశ్వరునిగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి, 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. చాళుక్యులు, శాతవాహనులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించెదరు. పురాతనమైన ఈ ఆలయంలో గర్భాలయం శిథిలావస్థకు చేరడంతో, దేవాదాయశాఖ రు. 4.8 లక్షలు, దాత స్వాతి వారపత్రిక యజమాని శ్రీ వేమూరి బలరాం, రు. 2.4 లక్షల వితరణతో, మూడు నెలలపాటు ఈ ఆలయంలో మరమ్మత్తు పనులను, అభివృద్ధిపనులను నిర్వహించారు. ఈ పనులు పూర్తి అవగానే, 2014, ఆగష్టు-22, శ్రావణ శుక్రవారం నాడు, ఈ ఆలయంలో, ఆలయ ముఖ మంటపం వద్ద, వాస్తుహోమం, నవగ్రహహోమం, ప్రత్యేకపూజల అనంతరం, నిత్య పూజలను పునఃప్రారంభించారు. [2]&[11]
ఈ ఆలయానికి దాత సహకారంతో, ఒకటిన్నర లక్షల రూపాయల విలువైన ఒక స్టీలు రథాన్ని తయారుచేయించారు. [14]
శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయo[మార్చు]
ఘంటసాల, దేవరకోట పరిసర ప్రాంతాల గ్రామాల వారి ఇలవేలుపు అయిన శ్రీ ముతాలమ్మ అమ్మవారి ఆలయ ముఖద్వారా ప్రారంభోత్సవం, అక్టోబరు 18, 2013,శుక్రవారం మధాహ్నం 3-30 గం.కు జరిగింది. దీనికి అయిన వ్యయం రు.4 లక్షలు. ఇదే సమయంలో రు. 2 లక్షలతో నిర్మాణమయిన ఆలయప్రాంగణంలోని సిమెంటు రహదారుల ప్రారంభోత్సవం గూడా జరిగింది. ఈ ఆలయంలో 2014, ఆగష్టు-15, శుక్రవారం నాడు, అమ్మవారి గ్రామోత్సవం, డప్పు వాయిద్యాలతో, శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయం వద్ద, మొక్కుబడులు తీర్చుకున్నారు. [3] & [10]
శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయo[మార్చు]
ఈ గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 200వ కళ్యాణోత్సవాలు 2013,డిసెంబరు 6 నుండి ప్రారంభమైనవి. ఈ ఉత్సవాలు 4రోజులపాటు జరుగును. [4]
శ్రీరామమందిరం[మార్చు]
ఈ గ్రామంలో పది లక్షల రూపాయలతో, గ్రామస్థులు, దాతల సహకారంతో, నూతనంగా నిర్మించిన రామమందిరంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2014,మార్చ్-15 నుండి 17 వరకూ నిర్వహించారు. 15న విఘ్నేశ్వర పూజ, దీక్షా బంధన పూజ, జలాధివాసం, క్షీరాధివాసం పూజలు జరిగినవి. 16న లక్షణోధారణ, వాస్తుహోమం, పంచసూక్తిహోమం, పుష్పాధివాసం, శాంతిహోమం, యాగశాల పూజ జరిగినవి. 17న ఉదయం, 07-15 మంటలకు శ్రీ గణపతి పూజ, శ్రీ సీతారామలక్ష్మణ, భక్తాంజనేయస్వామి వారల నూతన విగ్రహ ప్రతిష్ఠాపన పూజాకార్యక్రమాలు, మహాకుంభాభిషేకం, మహా పూర్ణాహుతి, విశేషపూజలు నిర్వహించారు. అదేరోజు భక్తులకు సామూహిక అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. [6]
శ్రీరామాలయం[మార్చు]
ఘంటసాల పడమర వీధి శ్రీరామాలయంలో, 2014,ఏప్రిల్-8న శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ, విఘ్నేశ్వర స్వామివార్ల నూతన విగ్రహాలను భక్తులు ప్రతిష్ఠించారు. వేదపండితులు విశేషపూజలు జరిపినారు. గ్రామానికి చెందిన శ్రీ కె.నారాయణరావు, ఒక లక్ష రూపాయలతో ఆలయ పునర్నిర్మాణం జరిపించారు. విగ్రహదాతలు శ్రీ వేమూరి శ్రీనివాసరావు, వసుంధరాదేవి దంపతులు, ఒక లక్ష రూపాయలతో నూతన నల్లరాతి దేవతా మూర్తుల విగ్రహాలను బహుకరించారు. తరువాత, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [8]
శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
స్థానిక బాలాజీనగరులో ఉన్న ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో, 3 రోజులపాటు, వైభవంగా నిర్వహించెదరు.
శ్రీ పెన్నేరమ్మ తల్లి ఆలయం[మార్చు]
ఈ గ్రామంలో గత 130 సంవయ్స్తరాలుగా కొలువైయున్న ఈ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో పూజాకార్యక్రమాలు నిర్వహించేటందుకు అనివార్యకారణాలవలన, ఐదు దశాబ్దాలుగా అమలుచేయలేదు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందువలన, ఈ ఆలయంలో 2015,ఆగష్టు-30వ తేదీ ఆదివారంనాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, గ్రామోత్సవాన్ని భారీ యెత్తున నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదం పొందినారు. [16]
బుద్ధ విగ్రహం[మార్చు]
ఈ గ్రామంలో 18 అడుగుల ఎత్తయిన బుద్ధ విగ్రహ నిర్మాణానికి, 2016,మే-21వ తేదీ శనివారం, బుద్ధ (వైశాఖ) పౌర్ణమి రోజున భూమిపూజ చేసారు. ఈ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు, ఈ విగ్రహ నిర్మాణానికై రెండున్నర లక్షల రూపాయలను వితరణ చేసారు. ఘంటసాలలోని ప్యాలెస్ మ్యూజియంలో ఉన్న నమూనా ఆధారంగా దీనిని తయారుచేసెదరు. [20]
గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
ఈ గ్రామం నుండి ఎందరో రాజకీయవేత్తలు స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు.
శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య[మార్చు]
వీరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు.
పండిత గొర్రెపాటి వెంకటసుబ్బయ్య[మార్చు]
వీరు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, చరిత్రకారులు. వీరు ఆనాటి కాలంలోనే ఘంటసాల చరిత్రను వ్రాసిన ఘనులు. వీరు అనేక ఇతర గ్రంథాలను గూడా రచించారు. వీరి రచనలు తెలుగు భాషా సమితి, అంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాలు పొందినవి. వీరు వ్రాసిన గ్రంథాలను వెలుగులోనికి తీసికొనివచ్చే ప్రయత్నాలు జరుగుచున్నవి. గ్రామంలో వీరి విగ్రహాన్ని, 2016,జనవరి-13న, ప్రవాసాంధ్రులు శ్రీ గొర్రెపాటి రంగనాథబాబు, తానా (Telugu Association of North America) మాజీ అధ్యక్షులు శ్రీ గొర్రెపాటి నవనీత కృష్ణలు సంయుక్తంగా అవిష్కరించారు. [19]
- యు.వి.వర్లుగా ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర్లు గారు.
ఉప్పలపాటి వెంకటేశ్వర్లు[మార్చు]
వీరు యు.వి.వర్లుగా ప్రసిద్ధి చెందినారు.
కొండపల్లి రామకృష్ణ ప్రసాద్[మార్చు]
వీరు ఉదయం దినపత్రికకు సంపాదకులుగా పనిచేసినారు. ఈయన స్నేహ పత్రికకు గూడా సంపాదకులుగా వ్యవహరించినారు. కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, పద్మభూషణ్ బిరుదాంకితులు అయిన శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారికి వీరు మనుమలు. [25]
గ్రామ విశేషాలు[మార్చు]
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రముగా తీర్చిదిద్దవలెనని ప్రణాళిక జరుపుతున్నది.
- ఈ గ్రామంలో ఒక సంగ్రహాలయము ఉంది. కాని ప్రభుత్వ అలసత్వ ధోరణి వల్ల ఇది పర్యాటకులను ఆకర్షించలేకపోతోంది.
- ఘంటసాల గ్రామంలో, ఎన్నారైలు, గ్రామస్థులు, దాతల సహకారంతో "మన ఊరు పార్కు"ను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పార్కులో, కమ్యూనిటీ భవనం, పూజల భవనం, శాంతిభవనాలను నూతనంగా నిర్మాణం చేసి అభివృద్ధి చేశారు. మన ఊరి పార్కును 2014,జనవరి-26 ప్రారంభించారు. ఈ పార్కు సమీపంలో, మరో శాంతివనం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించెదరు. [5]
- అపరాల పరిశోధనలో విశేషకృషి చేయుచున్న, ఘంటసాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా.ఎం.వి.రమణ కు, ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం వారిచే, రాష్ట్రస్థాయిలో ప్రదానం చేసే, "డా.బి.నాగరాజారావు " బంగారు పతకాన్ని అందజేశారు. వీరికి ఈ పురస్కారాన్ని, 2014,మార్చ్-20న హైదరాబాదులో జరిగిన ఆచార్య ఎన్.జి.రంగా విశ్వ విద్యాలయ 44వ స్నాతకోత్సవం సందర్భంగా అందజేశారు. [7]
- ఈ గ్రామానికి చెందిన, రైతుకుటుంబం నుండి వచ్చిన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు, చాలా రోజులక్రితం ఇంజనీరింగ్ విద్యనభ్యసించి, ఉపాధి కొరకు అమెరికా వెళ్ళినారు. కాలక్రమేణా అక్కడ పారిశ్రామికవేత్తగా ఎదిగినారు. అయినా గానీ తన జన్మభూమిపై మమకారంతో తన తల్లిదండ్రుల పేరుమీద, "గొర్రెపాటి వెంకట్రాయులు, ఉదయభాస్కరమ్మ విద్యా ట్రస్ట్"ను స్థాపించి గ్రామాభివృద్ధికై తనవంతు తోడ్పాటునందించుచున్నారు. అంతేగాక, తాను చేయుచున్న అభివృద్ధిపనులలో గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులను గూడా భాగస్వాములను చేస్తున్నారు. [12]
- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, ఘంటశాలకు చెందిన శ్రీ మూల్పూరి చెన్నారావు, గ్రామాభివృద్ధిలో అవిరళ కృషి చేస్తున్నారు. [17]
గ్రామాలు[4][మార్చు]
- అచ్చెంపాలెం
- ఎండకుదురు
- ఎలికల కోడూరు
- బిరుదుగడ్డ
- బొల్లపాడు
- చిలకలపూడి (ఘంటసాల)
- చినకళ్ళేపల్లి
- చిట్టూర్పు
- చిట్టూరు
- మల్లాయిచిట్టూరు
- దాలిపర్రు
- దేవరకోట
- ఘంటసాల
- కొడాలి
- కొత్తపల్లి
- లంకపల్లి
- మల్లంపల్లి
- పుషాదం
- శ్రీకాకుళం
- శీలంవారి పాలెం
- తాడేపల్లి
- తెలుగురావుపాలెం
- వి.రుద్రవరం
- వేములపల్లి
- కోసూరు
- ఘంటసాలపాలెం
- పాపవినాశనం
- గోగినేనివారిపాలెం(ఘంటసాల)
- సూరపనేనివారిపాలెం
జనాభా[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[5]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | బిరుదుగడ్డ | 31 | 100 | 51 | 49 |
2. | బొల్లపాడు | 84 | 329 | 169 | 160 |
3. | చిలకలపూడి | 256 | 913 | 455 | 458 |
4. | చినకళ్ళేపల్లి | 387 | 1,378 | 673 | 705 |
5. | చిట్టూర్పు | 777 | 2,730 | 1,355 | 1,375 |
6. | చిట్టూరు | 318 | 1,132 | 582 | 550 |
7. | దాలిపర్రు | 445 | 1,451 | 698 | 753 |
8. | దేవరకోట | 415 | 1,537 | 763 | 774 |
9. | ఎండకుదురు | 355 | 1,344 | 671 | 673 |
10. | ఘంటసాల | 2,949 | 10,421 | 5,127 | 5,294 |
11. | కొడాలి | 959 | 3,407 | 1,695 | 1,712 |
12. | కొత్తపల్లి | 322 | 1,021 | 495 | 526 |
13. | లంకపల్లి | 726 | 2,454 | 1,244 | 1,210 |
14. | మల్లంపల్లి | 619 | 1,999 | 998 | 1,001 |
15. | పుషాదం | 285 | 1,087 | 547 | 540 |
16. | శ్రీకాకుళం | 1,976 | 7,835 | 3,877 | 3,958 |
17. | తాడేపల్లి | 446 | 1,646 | 794 | 852 |
18. | తెలుగురావుపాలెం | 345 | 1,247 | 642 | 605 |
19. | వి.రుద్రవరం | 270 | 822 | 417 | 405 |
20. | వేములపల్లి | 263 | 1,016 | 508 | 508 |
వనరులు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Ghantasala". Retrieved 25 June 2016. External link in
|title=
(help) - ↑ "రామమోహన గ్రంథాలయం". గ్రంథాలయ సర్వస్వము. 7. January 1928. Retrieved 8 March 2015.
- ↑ "ఘంటసాల మండలంలొ ఉన్న గ్రామాలు". Archived from the original on 2007-09-27. Retrieved 2007-08-24.
- ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.
మూలాలు[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to ఘంటసాల (కృష్ణా జిల్లా). |
[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగష్టు-3; 1వపేజీ. [2] ఈనాడు జిల్లా ఎడిషన్, 2013,సెప్టెంబరు-16; 15వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, 2013,అక్టోబరు-19. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,డిసెంబరు-5; 3వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2014,జనవరి-28; 3వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-18; 10వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2014,మార్చ్-26; 6వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-9; 1వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-16,1వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-16; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగష్టు-23; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-23; 9వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,డిసెంబరు-4; 3వపేజీ. [14] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జులై-22; 3వపేజీ. [15] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగష్టు-15; 1వపేజీ. [16] ఈనాడు కృష్ణా/ అవనిగడ్డ; 2015,ఆగష్టు-31; 3వపేజీ. [17] ఈనాడు కృష్ణా; 2015,సెప్టెంబరు-6; 10వపేజీ. [18] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,సెప్టెంబరు-10; 1వపేజీ. [19] ఈనాడు అమరావతి; 2016,జనవరి-14; 40వపేజీ. [20] ఈనాడు అమరావతి; 2016,మే-22; 21వపేజీ. [21] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,నవంబరు-3; 1వపేజీ. [22] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,ఏప్రిల్-18; 2వపేజీ. [23] ఈనాడు అమరావతి; 2017,మే-30; 4వపేజీ. [24] ఈనాడు అమరావతి/అవనిగడ్డ;2020,అక్టోబరు-28,6వపేజీ. [25] ఈనాడు అమరావతి;2020,నవంబరు-4,2వపేజీ.
- Andhra pradesh, santuario a più piani, da ghantasala, 90-110 ca.JPG
190-110 సిఏ -బహుళ అంతస్తుల ప్రతిమ - ఘంటసాల, ఆంధ్ర ప్రదేశ్, .
- Andhra pradesh, buddha, da ghantasala, 190-310 ca.JPG
190-310 సిఏ - బుద్ధుడు - ఘంటసాల - ఆంధ్ర ప్రదేశ్