లంకపల్లి (ఘంటసాల)
లంకపల్లి (ఘంటసాల) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | ఘంటసాల |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,448 |
- పురుషులు | 1,232 |
- స్త్రీలు | 1,216 |
- గృహాల సంఖ్య | 709 |
పిన్ కోడ్ | 521131 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
లంకపల్లి, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 131., ఎస్.టి.డి.కోడ్ = 08671.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
ఈ గ్రామాన్ని తూర్పు లంకపల్లి (East Lankapalli) అని గూడా అంటారు.
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
లంకపల్లి గ్రామం, కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంనకు 18 కి.మీ. దూరంలో, 214ఏ జాతీయ రహదారిపై ఉంది.
లంకపల్లి గ్రామానికి సరిహద్దుగా వున్న గ్రామాలు[మార్చు]
మంగళాపురం 2 కి.మీ, లక్ష్మిపురం 2 కి.మీ, పుషాడం 3 కి.మీ, బోగిరెడ్డిపల్లి 4 కి.మీ, దేవరకోట 4 కి.మీ
సమీప మండలాలు[మార్చు]
చల్లపల్లి, మొవ్వ, మోపిదేవి, గూడూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
కొత్తమాజేరు, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 62 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
- లంకపల్లి గ్రామ శివార్లలో 2005వ సంవత్సరంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు అయ్యింది.
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
- ఈ గ్రామంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, ప్రభుత్వ పాల సేకరణ కేంద్రం, తపాలా కార్యాలయం, దూరవాణి కేంద్రం ఉన్నాయి.
- గ్రామంలో ప్రస్తుతం పాక్షికంగానే శాశ్వత రహదారుల నిర్మాణం జరిగింది.
- తాగునీటి కోసం ఈ గ్రామ ప్రజలు ప్రధానంగా చేతి పంపుల ద్వారా, "నాంది నీటి శుద్ధి కేంద్రం" ద్వారా పొందుతున్నారు.
- శుద్ధినీటి సౌకర్యం:- గ్రామంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలో, సన్ ఫ్లవర్ విద్యాసంస్థల అధినేత శ్రీ ఎం.డి.వి.ఎస్,ఆర్.పున్నంరాజు ఆధ్వర్యంలో రు. 2.28 లక్షల ఆర్థికసహకారంతో నిర్మించిన ఎన్.టి.ఆర్.సుజలస్రవంతి పథకాన్ని, 2014,అక్టోబరు-31న ప్రారంభించారు. [1]
గ్రామానికి సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
ఈ గ్రామ పంచాయతీకి జూలై 2013 లో జరిగిన ఎన్నికలలో శ్రీ మాడెం నాగరాజు, సర్పంచిగా గెలుపొందారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
- శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం:- లంకపల్లి, పాతమాజేరు గ్రామ సరిహద్దులో ప్రసిద్ధి చెందిన నాగేంద్ర స్వామి దేవాలయము ఉంది. నాగుల చవితి నాడు జరిగే ప్రత్యేక పూజలు ఈ పరిసర ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందాయి.
- శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- దాతలు, గ్రామస్థుల సహకారంతో, రు. 5 లక్షలవ్యయంతో పునర్నిర్మించిన ఆ ఆలయంలో, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,మే నెల, 4వ తేదీ సోమవారం నుండి ప్రారంభించారు. 6వ తేదీ బుధవారం ఉదయం 9-55 గంటలకు, వేదపండితుల ఆధ్వర్యంలో, భక్తిశ్రద్ధలతో, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, మూడువేల మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [2]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
ఈ గ్రామంలో పండించే ప్రధాన పంటలు చెరకు, వరి. ఇంకా రబీ సీజన్ లో మినుములు, పెసలు పండిస్తారు. మాగాణి పంటలు పండించడానికి ప్రధానంగా గ్రామస్థులు భీంనదీ ఛానల్ ద్వారా వచ్చే నీటి మీద ఆధారపడతారు.
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
దాదాపు 90శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు.
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
- లంకపల్లి గ్రామం ప్రస్తుతం అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం పరిధిలో, మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
- లంకపల్లి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని లక్ష్మీపురం గ్రామంలో, కె.సి.పి. చక్కెర కర్మాగారం ఉంది. దీనిపై దాదాపు 400 మంది ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు.
జనాభా[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,448 - పురుషుల సంఖ్య 1,232 - గృహాల సంఖ్య 709
- జనాభా (2001) * మొత్తం కుటుంబాలు
- 726* మొత్తం జనాభా : 2454* పురుషుల సంఖ్య : 1244* స్త్రీల సంఖ్య : 1210
http://censusindia.gov.in/PopulationFinder/View_Village_Population.aspx?pcaid=535083&category=VILLAGE[permanent dead link]
మూలాలు[మార్చు]
[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-31; 3వపేజీ. [2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే నెల-7వతేదీ; 2వపేజీ.
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Lankapalli". Retrieved 25 June 2016. External link in
|title=
(help)