దాలిపర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాలిపర్రు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి గడ్డేటి రేవతి
జనాభా (2011)
 - మొత్తం 1,352
 - పురుషులు 666
 - స్త్రీలు 686
 - గృహాల సంఖ్య 471
పిన్ కోడ్ 521131
ఎస్.టి.డి కోడ్ 08671

దాలిపర్రు కృష్ణాజిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 131., ఎస్.టీ.డీ.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

మచిలీపట్టణం - చల్లపల్లి జాతీయ రహదారి-214కి, లంకపల్లి నుండి సుమారు 2 కి.మీ దూరంలో, లోపలికి ఉంది. ఈ గ్రామానికి సరిహద్దు గ్రామాలు లంకపల్లి, ఘంటసాల. ఈవూరి నుండి జాతీయ రహదారి-214 కి రావటానికి గ్రామం నుండి 2 దారులు ఉన్నాయి. వూరికి ఒక ప్రక్క పొలుగుల గండి అని ఒక ఏరు పారుతూ ఉంటుంది.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో మంగళాపురం, లక్ష్మిపురం, పూషడం, భోగిరెడ్డిపల్లి, మాజేరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

చల్లపల్లి, మొవ్వ, మోపిదేవి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొత్తమాజేరు, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 62 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, దాలిపర్రు

గ్రామములో మౌలిక సదుపాయాలు[మార్చు]

రక్షిత మంచినీటి పథకo[మార్చు]

ఈ గ్రామములోని పంచాయతీ కార్యాలయం సమీపంలో, ఈ పథకాన్ని,రు. 42 లక్షల గ్రామీణ నీటిసరఫరా విభాగం నిధులతో, నూతనంగా చేపట్టినారు. 60,000 లీటర్ల సామర్ధ్యంగల ఒక మంచినీటి ట్యాంకును నిర్మించుచున్నారు. [4]

దాతలు, గ్రామస్థులు సమకూర్చిన పది లక్షల రూపాయల నిధులతో నిర్మించిన నూతన డిజిటల్ నీటికేంద్రాన్ని, 2017,జూన్-1వతేదీ ఉదయం 9-40 కి ప్రారంభించెదరు. హైదరాబాదుకు చెందిన దాత శ్రీ గోరంట్ల బుచ్చినాయుడు, ఈ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా పరికరాల కొనుగోలుకు ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. బెంగుళూరుకు చెందిన శ్రీమతి చలసాని కృష్ణకుమారి, తన సోదరుడు పరుచూరి రవిబాబు పేరిట, ఈ కేంద్ర భవన నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ కేంద్రం అభివృద్ధి పనులకోసం, గ్రామస్థులు నాలుగు లక్షల రూపాయల నిధులను సమకూర్చారు. [5]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి గడ్డేటి రేవతి సర్పంచిగా గెలుపొందినారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఎక్కువ మందికి వ్యవసాయం ఆధారం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామంలో 2013 జూలై 31న జరుగు పంచాయతీ ఎన్నికలలో, 102 సంవత్సరాల వయసుగల శ్రీమతి మిక్కిలినేని సంపూర్ణమ్మ, 55వ సారి తన ఓటు హక్కు వినియోగించుకోబోవుచున్నారు. గత ఏడాది శతవసంతాలు నిండినందులకు ఈమె వంశవృక్షం 40మంది కుటుంబసభ్యులు, బంధువులు ఘనంగా సన్మానించారు. [2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1451,[2] ఇందులో పురుషుల సంఖ్య 698, స్త్రీల సంఖ్య 753, గ్రామంలో నివాస గృహాలు 445 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 584 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,352 - పురుషుల సంఖ్య 666 - స్త్రీల సంఖ్య 686 - గృహాల సంఖ్య 471

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Daliparru". Retrieved 25 June 2016. External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,జులై-28; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-8; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,మే-29; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-1; 1వపేజీ.