మాజేరు
మాజేరు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | చల్లపల్లి |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి మాచవరపు సునీత |
జనాభా (2011) | |
- మొత్తం | 3,998 |
- పురుషులు | 1,982 |
- స్త్రీలు | 2,016 |
- గృహాల సంఖ్య | 1,311 |
పిన్ కోడ్ | 521131 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
మాజేరు గ్రామం కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలంలో ఉంది. పిన్ కోడ్ నం.521 131., ఎస్.టీ.డీ.కోడ్ = 08671.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
పురావస్తుశాఖ వారి వివరాల ప్రకారం పూర్వం ఈగ్రామం పేరు మజేరికా విషశ్య. ఇది కాలక్రమేణా "మాజేరు"గా రూపాంతరం చెందింది. ఇచట జరిపిన తవ్వకాలలో పురాతన బౌద్ధ అవశేషాలు లభించాయి. కొత్త మాజేరు, పాత మాజేరు అను గ్రామాలు ఉన్నాయి.
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు
ఈ గ్రామం చల్లపల్లి నుండి 9 కి.మీ. మచిలీపట్నము నుండి 15 కి.మీ. దూరములో ఉంది.
సమీప గ్రామాలు[మార్చు]
ఈ గ్రామానికి సమీపంలో నేలకుర్రు, చిన్నాపురం, దాలిపర్రు, పూషడం, లంకపల్లి గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు[మార్చు]
చల్లపల్లి, మోపిదేవి, మొవ్వ, గూడూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
కొత్తమాజేరు, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 66 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లాపరిషత్తు ప్రాథమికొన్నత పాఠశాల[మార్చు]
కోటి సూర్య ప్రాథమికోన్నత పాఠశాల,మాజేరు[మార్చు]
ఈ పాఠశాల 14వ వార్షికోత్సవం, 2017,మార్చ్-19న ఘనంగా నిర్వహించినారు. [7]
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల (ఆదర్శ పాఠశాల)[మార్చు]
శ్రీ కైతేపల్లె దాస్[మార్చు]
- కొత్త మాజేరు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ కైతేపల్లి దాస్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత. వీరికి 2014, అక్టోబరు-12న హైదరాబాదులో, అరుంధతీ బంధు సేవామండలి వారు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేసినారు. ఒక నిరుపేద వ్యవసాయం కుటుంబం నుండి వచ్చిన వీరు, ఈ పురస్కారం అందుకొనడం విశేషం. [3]
- శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా, 2015, సెప్టెంబరు-5వ తేదీనాడు, గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని, హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో, మాస్టర్ జీ ఫౌండేషన్, విశ్వజన కళా మండలి అను సంస్థల వారు, సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో, వీరికి "సర్వేపల్లి రాధాకృష్ణన్" పురస్కారాన్ని అందజేసినారు. దేశంలోని పది రాష్ట్రాల నుండి వివిధ రంగాలలో నైపుణ్యం సాధించిన వ్యక్తులకు తగిన పురస్కారాలను మాస్టర్ జీ ఫౌండేషన్ సంస్థ అందించుచున్నది. శ్రీ కైతేపల్లి దాస్, కొత్తమాజేరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడమేగాక, విద్య ఆవశ్యకతపై గ్రామంలో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించినందుకు, ఈ పురస్కారం లభించింది. [4]
- వీరు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారం, ప్రశంసాపత్రాన్ని, 2016, సెప్టెంబరు-6న ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో, భారత రాష్ట్రపతి శ్రీ ప్రణభ్ ముఖర్జీగారి చేతులమీదుగా అందుకున్నారు. [5]
- వీరిని, ఎం.వి.ఎల్.ఎ.ట్రస్ట్ జాతీయస్థాయిలో గ్లోబల్ రోల్ మోడల్ ప్రధానోపాధ్యాయులుగా ఎంపిక చేసింది. 2016, సెప్టెంబరు-5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో రాష్ట్రానికి ఒక్కరు చొప్పున, రోల్ మోడల్ ఉపాధ్యాయులుగా ఎంపికచేసెదరు. ఈ సంవత్సరం ఆ పురస్కారం వీరికి దక్కినది. హైదరాబాదులోని రవీంద్రభారతి లో, 2016, నవంబరు-30న నిర్వహించిన గ్లోబల్ టీచర్స్ కాన్ఫరెన్స్-2016 లో, వీరికి ఈ పురస్కారాన్ని అందజేసినారు. [6]
- విశాఖపట్నం నగరానికి చెందిన ఎ.పి.జె.అబ్దుల్ కలాం స్మారక సంస్థ, వీరిని విద్యా భూషణ్ పురస్కారానికి ఎంపిక చేసింది. 2017, జులై-9న, హైదరాబాదులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీరు స్వర్ణపతకాన్నీ, ఙాపికనూ, ధ్రువపత్రాన్నీ, అందుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి, పేదల విద్యాభివృద్ధికి కృషిచేసినందుకుగాను వీరిని ఈ పురస్కారానికి ఎంపికచేసారు. [8]
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
బ్యాంకులు[మార్చు]
ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08671/245238.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మాచవరపు సునీత సర్పంచిగా 520 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
- శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయo:- ప్రతి యేడు దసరా నవరాత్రులు చాలా ఘనంగా జరుపుకుంటారు.
- ఈ ఊరిలో ఇంకా చాలా దేవాలయములు ఉన్నాయి.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
గ్రామ ప్రముఖులు[మార్చు]
శ్రీ అరెకపూడి శ్రీనివాస్[మార్చు]
2017, జులై-10న, 60వ జాతీయ మత్స్య కృషీవలుర దినోత్సవం సందర్భంగా, కేంద్రీయ మంచినీటి సంస్థ, భువనేశ్వర్, ఒడిశా, మత్స్యశాఖ, అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ఉత్తమ చేపల రైతు పురస్కారం అందుకున్నారు. [9]
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4335.ఇందులో పురుషుల సంఖ్య 2179, స్త్రీల సంఖ్య 2156, గ్రామంలో నివాస గృహాలు 1114 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1668 హెక్టారులు.[2]
- జనాభా (2011) - మొత్తం 3,998 - పురుషుల సంఖ్య 1,982 - స్త్రీల సంఖ్య 2,016 - గృహాల సంఖ్య 1,311
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Majeru". Retrieved 25 June 2016. External link in
|title=
(help) - ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్ద; 2013, ఆగస్టు-1; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, అక్టోబరు-14; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2015, సెప్టెంబరు-9; 3వపేజీ. [5] ఈనాడు గుంటూరు సిటీ; 2016, సెప్టెంబరు-7; 9వపేజీ. [6] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, డిసెంబరు-2; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, మార్చి-20; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017, జులై-11; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, జులై-12; 2వపేజీ.