పురిటిగడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పురిటిగడ్డ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం చల్లపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ పరుచూరి సురేష్
జనాభా (2011)
 - మొత్తం 2,034
 - పురుషుల సంఖ్య 1,009
 - స్త్రీల సంఖ్య 1,025
 - గృహాల సంఖ్య 646
పిన్ కోడ్ 521126
ఎస్.టి.డి కోడ్ 08671

పురిటిగడ్డ, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 126. యస్.టీ.డీ కోడ్ నంబరు. 08671.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

చల్లపల్లి మండలం[మార్చు]

చల్లపల్లి మండలంలోని చల్లపల్లి, చిడెపూడి, పాగోలు , నడకుదురు, నిమ్మగడ్డ, యార్లగడ్డ, వక్కలగడ్డ, వెలివోలు, పురిటిగడ్డ మరియు లక్ష్మీపురం, గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 10 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో నడకుదురు, రాముడుపాలెం, నాదెళ్ళవారి పాలెం, మేకావారిపాలెం, నిమ్మగడ్డ, వక్కలగడ్డ, యార్లగడ్డ, వెలివోలు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

ఘంటసాల, మోపిదేవి, మొవ్వ, కొల్లూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి ఎర్రబస్సు సౌకర్యం ఉంది. మండల కేంద్రం నుండి ఆటోలు నిత్యం తిరుగుతుంటవి. చల్లపల్లి, మచిలీపట్నం నుండి నేరుగా ఆర్.టి.సి.బస్సు సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 56 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

 1. ఈ పాఠశాలలో 2013,ఏప్రిల్-22, సోమవారం నాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో సరస్వతీదేవి విగ్రహం ఏర్పాటుచేశారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, తెలుగు పండితులు అయిన దాత శ్రీరామకవచం శ్యామసుందరం, తన భార్య బాలాత్రిపురసుందరి ఙాపకార్ధం, ఈ విగ్రహం ఏర్పాటుచేశారు. [5]
 2. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న 11 మంది విదార్ధినీ విద్యార్థులు, 2013-14 వ సంవత్సరానికి, (National merit-cum-means Scholarships) జాతీయ ప్రభుత్వ ఉపకారవేతనాలకు అర్హత సంపాదించారు. [6]
 3. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి అయిన పెరిక యుగంధరబాబు, 2014-మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షలలో, 9.5 గ్రేడ్ మార్కులు సాధించి, ఐ.ఐ.ఐ.టి.లో సీటు సంపాదించాడు. ఇతడు ఇంటరు నుండి బి.టెక్. వరకు ఇక్కడ ఉచితంగా విద్యనభ్యసించగలడు. [12]
 4. ఈ పాఠశాలలో 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన రాజులపాటి లీలాంబిక, లుక్కా నాగజ్యోతి మరియు జంపాన వంశీ కృష్ణశ్రీ అను ముగ్గురు విద్యార్థినులు, నూజివీడు ఐ.ఐ.ఐ.టి.లో సీట్లు సంపాదించారు. వీరు ఇంటరు నుండి బి.టెక్. వరకు అక్కడ ఉచితంగా విద్యనభ్యసించగలరు. [17]
 5. ఈ పాఠశాలో ప్రవాస భారతీయులైన దాతల ఆర్థిక సహకారంతో, 2015,ఆగస్టు-11వ తేదీనాడు, డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. [18]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

తపాలా సౌకర్యం[మార్చు]

ఈ వూరికి పోస్టాఫీస్ నడకుదురులో ఉంది.

రెవెన్యూ కార్యాలయం[మార్చు]

పురిటిగడ్డ గ్రామ ప్రధాన కూడలిలో 2013,మార్చి-14న రెవెన్యూ కార్యాలయం ప్రారంభించారు. స్థానికంగా ఉన్న భూసమస్యలు, పొలాలకు సంబంధించిన శిస్తులు చెల్లించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రెవెన్యూపరంగా తెలియజేసే అవకాశం గ్రామస్తులకు కలుగుతుంది. [7]

బ్యాంకులు[మార్చు]

ఈ గ్రామములో ఇండియన్ బ్యాంకు శాఖ ఉంది. ఫోన్ నం. 08671/222548.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

ఈ గ్రామములో నూతనంగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నిర్మాణం పూర్తి అయినది. 2015,ఆగస్టు-26న ప్రారంభోత్సవం నిర్వహించెదరు. ఇంకనూ ఈ కేంద్రానికి రహదారి అభివృద్ధి, త్రాగునీరు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాటుచేయవలసియున్నది. చల్లపల్లి మండలంలో మంజూరైన ఏకైక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఇది. ఈ కేంద్రానికి 80 సెంట్ల స్థలాన్ని, శ్రీమతి నాదెళ్ళ తులసీరత్నం అను ఒక దాత సమకూర్చారు. 2005లో ఈ కేంద్రం మంజూరవగా, అప్పటికి భవనం లేకపోవడంతో, దాత ఇంటినే ప్రస్తుతం ఆరోగ్యకేంద్రంగా ఉపయోగించుకొనడానికి దాత అంగీకరించారు. భవన నిర్మాణానికి జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు రు. 80 లక్షలకు అనుమతి మంజూరుకాగా, 2009,ఫిబ్రవరి-27న శంకుస్థాపన చేశారు. [4]&[19] ఈ ఆరోగ్యకేంద్రాన్ని, 2015,ఆగస్టు-26వ తేదీనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖా మంత్రి శ్రీ కామినేని శ్రీనివాస్ మరియు రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాదుతో కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కృష్ణాజిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ శ్రీమతి గద్దె అనూరాధ, నిడుమోలు మాజీ శాసనసభ్యులు శ్రీ పాటూరి రామయ్య, శ్రీమతి గోవాడ మరియకుమారి తదితరులు పాల్గొన్నారు. [20] ఈ ఆరోగ్యకేంద్రంలో పనిచేయుచున్న డాక్టర్ కె.రత్నగిరి మరియు డాక్టర్ వెంకటపద్మావతి దంపతులు, 2016,జనవరి-26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా, జిల్లా కలెక్టర్ చేతులమీదుగా ఉత్తమ వైద్యాధికారులుగా పురస్కారం అందుకున్నారు. [21]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

కె.యి.బి.కెనాల్.

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. నిమ్మగడ్డ, పురిటిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
 2. పురిటిగడ్డ గ్రామ పంచాయతీ 1959లో ఏర్పడింది. గ్రామ ప్రస్తుత జనాభా = 2,656. ఓటర్లు=2,012. అయినా, నేటికీ పంచాయతీకి కార్యాలయభవనం లేదు. గ్రామానికి చెందిన రామాలయం పెంకుటింట్లోనే పంచాయతీ కార్యక్రమాలు, అధికారుల విధులు కొనసాగిస్తున్నారు. ఇంతకు ముందు, భవననిర్మాణానికి రు 5లక్షలు మంజూరవగా, 2009లో శంకుస్థాపన జరిగినా నిధులు సరిపోక, నిర్మాణం ప్రారంభించలేదు. ఇప్పుడు, ఈ గ్రామానికి చెందిన, వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన, శ్రీ నాదెళ్ళ రామకృష్ణ, జన్మభూమిపై మమకారంతో, పంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి రు. 10 లక్షలు వితరణ చేయగా, నిర్మాణ పనులు త్వరితగతిన సాగుచున్నవి. [9]&[14]
 3. ఈ పంచాయతీ పరిధిలో నిమ్మగడ్డ ఇసుక క్వారీ ఉంది.
 4. 2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీ పరుచూరి సురేష్, 170 ఓట్ల ఆధిక్యంతో ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావు ఎన్నికైనారు. [2] & [8]
 5. ఈ గ్రామ సర్పంచి శ్రీ పరుచూరి సురేష్, డిసెంబరు-5, 2013 నాడు, చల్లపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ భ్రమరాంబా సమేతంగా శ్రీ గిరీశ్వరస్వామిస్వామివారి ఆలయం[మార్చు]

శివాలయం చాలా పురాతనమయినది. ఇక్కడ శివలింగాన్ని శ్రీశైలం నుండి తెచ్చి ప్రతిష్ఠించారని పెద్దలు చెపుతుంటారు. 1898 లో ఒకసారి ఈ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది. తరువాత జూన్ 18, 2011 నాడు మరియొక సారి ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరిగింది.

శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయం[మార్చు]

పురిటిగడ్డ గ్రామములో ఒక కోటి రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన శ్రీ షిర్డీ సాయిబాబావారి ఆలయంలో, 2013,అక్టోబరు-18, శుక్రవారం నాడు ఉదయం 11-42 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. ఈ ఆలయంలో 2014,ఏప్రిల్-8న, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని, సద్గురు శ్రీ సాయినాధుని ట్రస్ట్ ఆధ్వర్యంలో, శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివార్ల నూతన విగ్రహాలను, ఆలయంలో ఏర్పాటుచేయించి, శ్రీరామనవమి వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. ఈ ఆలయంలో 2014, జూలై-12, శనివారం నాడు గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయంలో 2014, అక్టోబరు-9 న, ప్రథమవార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదువేల మందికి అన్నసంతర్పణ నిర్వహించారు. [9],[11],[13]&[15]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరకు,

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

స్వచ్ఛందసేవాసంస్థ[మార్చు]

ఈ గ్రామములో ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ (I.V.M) అను ఒక స్వచ్ఛందసేవాసంస్థ ఉంది. దీనిని స్థాపించినది, ఈ గ్రామస్థులైన వేములపల్లి సురేశ్. ఈ సంస్థకు ప్రస్తుత డైరెక్టరైన వీరు, సివిల్ ఇంజనీరింగ్ చదివి, బ్రిటనులో డాక్టరేటు పొందారు. వీరు చేస్తున్న సేవలు:- (1) అనాథపిల్లల హోం (2) ఎడ్యుకేషనల్ హెల్ప్ (3) కుట్టు శిక్షణా కేంద్రం (4) వృద్ధులకు, వితంతువులకు సాయం (5) రిలీఫ్ ఎయిడ్ (6) సంఘసేవకుల సేవాసాయం. [9]


గ్రామంలో జరిగిన దుర్ఘటన[మార్చు]

పురిటిగడ్డ గ్రామంలోని రజకపేటలో, 2012,జూన్-1వ తేదీన, ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. === === Puritigadda the village, the village of the accident rajakapetalo, 2012, on June -1, was the risk of a catastrophic fire. ఈ అగ్నిప్రమాదంలో 30 ఇళ్ళు దగ్ధంకాగా, రు. Dagdhankaga the fire, 30 houses, Rs. 20 లక్షలపైగా ఆస్తి నష్టం జరిగింది. 20 laksalapaiga property damage. 55 కుటుంబాలవారు నిరాశ్రయులైనారు. 55 families homeless. ఈ ప్రమాదానికి విద్యుత్తు షార్ట్ సర్కూట్ కారణంగా భావిస్తున్నారు. This is likely due to electrical short circuit. [10] [10]

Veeriki gruhalanu, government vaarthi patu IVM samstah (Dr. Vemulapalli Suresh ) vaari arthika sahayamutho tirigi gruhaalanu nirmincharu.

దత్తత గ్రామo[మార్చు]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆకర్షణీయ గ్రామాల (స్మార్ట్ విలేజ్) కార్యక్రమంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల విభాగం అదనపు డి.జి.పి.గా పనిచేయుచున్న శ్రీ ఆర్.పి.ఠాకూర్, కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలంలోని పురిటిగడ్డ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్.పి.గా పనిచేసినప్పుడు ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధం రీత్యా "పురిటిగడ్డ" గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు ఆయన తెలిపినారు. [16]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2062.ఇందులో పురుషుల సంఖ్య 1043, స్త్రీల సంఖ్య 1019, గ్రామంలో నివాస గృహాలు 591 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 347 హెక్టారులు.[3]
జనాభా (2011) - మొత్తం 2,034 - పురుషుల సంఖ్య 1,009 - స్త్రీల సంఖ్య 1,025 - గృహాల సంఖ్య 646

మూలాలు[మార్చు]

 1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Challapalli/Puritigadda". Retrieved 25 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
 3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-3; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, 2013,డిసెంబరు-6; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఆగస్టు-4; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,ఏప్రిల్-23; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఫిబ్రవరి-22; 2వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,మార్చి-15; 1వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగస్టు-4; 1వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013,డిసెంబరు-25; 2వపేజీ. [10] ఈనాడు కృష్ణా; 2012,జూన్-2; 1&2 పేజీలు. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-9; 1వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జులై-9, 1వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జులై-13, 1వపేజీ. [14] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఆగస్టు-23; 1వపేజీ. [15] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,అక్టోబరు-10; 1వపేజీ. [16] ఈనాడు మెయిన్; 2015,మార్చి-4; 12వపేజీ. [17] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జులై-3; 3వపేజీ. [18] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగస్టు-11; 2వపేజీ. [19] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,ఆగస్టు-13; 1వపేజీ. [20] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-27; 7వపేజీ. [21] ఈనాడు అమరావతి; 2016,జనవరి-30; 40వపేజీ.