Coordinates: 16°10′53″N 80°54′08″E / 16.181408°N 80.902180°E / 16.181408; 80.902180

కొడాలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడాలి
—  రెవెన్యూ గ్రామం  —
కొడాలి is located in Andhra Pradesh
కొడాలి
కొడాలి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°10′53″N 80°54′08″E / 16.181408°N 80.902180°E / 16.181408; 80.902180
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,925
 - పురుషులు 1,445
 - స్త్రీలు 1,480
 - గృహాల సంఖ్య 947
పిన్ కోడ్ 521132
ఎస్.టి.డి కోడ్ 08671

కొడాలి, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన ఘంటసాల నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మచిలీపట్నం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 947 ఇళ్లతో, 2925 జనాభాతో 814 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1445, ఆడవారి సంఖ్య 1480. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 956 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 90. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589695[1].సముద్రమట్టానికి 11 మీ.ఎత్తులో ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

కొడాలి గ్రామానికి సమీపంలో తెలుగురావుపాలెం, కొత్తపల్లి, పెనుమత్చ, చిట్టూర్పు, ఘంటసాల గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి ఘంటసాలలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల మొవ్వలోను, ఇంజనీరింగ్ కళాశాల చల్లపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల విజయవాడలోను, పాలీటెక్నిక్ మచిలీపట్నంలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఘంటసాలలోను, అనియత విద్యా కేంద్రం మచిలీపట్నంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయవాడ లోనూ ఉన్నాయి.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

రాష్ట్రస్థాయి గణితబోధనోపకరణాల ప్రదర్శన పోటీలలో, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ టి.ఫణిరాజామోహన్ కు ద్వితీయస్థానం లభించింది. ప్రత్యేక గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్ జయంతి సందర్భంగా, 2014, డిసెంబరు-22వ తేదీనాడు, గుంటూరులో ఏ.పి.ఎస్.ఇ.ఆర్.టి. ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత ప్రదర్శన పోటీలు నిర్వహించారు. వీరు ఈ ప్రదర్శనలో, "గణితంలో సృజనాత్మకత" అను అంశంపై, 1 నుండి 10వ తరగతి వారకు, గణితం సులువుగా అర్ధం అయ్యేటట్లుగా, ప్రాథమిక సూత్రాలతోపాటు, గణిత బోధనోపకరణాలను రూపొందించి ప్రదర్శించారు. వీరికి ఇంతకుమునుపే, 2014, డిసెంబరు-16వ తేదీనాడు, గుడ్లవల్లేరు మండలంలోని అంగలూరులో జరిగిన జిల్లాస్థాయి గణితబోధనోపకరణాల ప్రదర్శనా పోటీలలో ప్రథమస్థానం లభించింది. [14]ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఫణిరాజమోహన్, దక్షిణభారతదేశ స్థాయి వైఙానిక ప్రదర్శనలో ఉపాధ్యాయ విభాగంలో ప్రథమస్థానాన్ని పొంది, తన పాఠశాల కీర్తిప్రతిష్ఠలను జాతీయస్థాయిలో ఇనుమడింపజేసినారు. పుదుచ్చేరిలో 2017, జనవరి-4 నుండి 9 వరకు నిర్వహించిన దక్షిణభారతదేశస్థాయి వైఙానిక ప్రదర్శన-2017 లో, ఆయన ప్రదర్శించిన సృజనాత్మక గణితంలో ప్రథమ బహుమతి, నగదు బహుమతి లభించినవి. పుదుచ్చేరి రాష్ట్ర విద్యామంత్రి శ్రీ కమలకన్నన్ నుండి వీరు ఆ బహుమతి అందుకున్నారు. ఈ ప్రదర్శనలో ఆరు రాష్ట్రాలకు చెందిన 439 మంది పాల్గొన్నారు. [20] పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని చిన అమిరం గ్రామంలోని విశ్వకవి అంగ్ల మాధ్యమ పాఠశాలలో 2015, డిసెంబరు-28 నుండి 30 వరకు నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యా, వైఙనిక ప్రదర్శనలో, ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఫణిరాజమోహన్ రూపొందించిన గణిత ప్రదర్శన ప్రథమస్థానం పొంది, జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపికైనది. 2016, జనవరి-19 నుండి 23 వరకు బెంగుళూరులోని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియంలో నిర్వహించు జాతీయస్థాయి ప్రదర్శనలో దీనిని ప్రదర్శించెదరు. [18] ఈ పాఠశాలలో పదవ తరగతి చదివిన విద్యార్థులు ప్రతి సంవత్సరం, 100% ఉత్తీర్ణతను సాధించుచున్నారు. కొంతమంది విద్యార్థులు ఐ.ఐ.ఐ.టి.లో ప్రవేశాలు పొందుచున్నారు. ఈ పాఠశాల 51వ వార్షికోత్సవాన్ని, 2016, ఫిబ్రవరి-16వ తేదీనాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాదులో ఇక్రిశాట్ సంస్థ శాస్త్రవేత్త శ్రీ రూపవరం శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, పాఠశాలలో రెండు రోజులపాటు వైద్యా, వైఙానిక ప్రదర్శన నిర్వహించారు. [19]

శ్రీనివాసా ప్రాథమికోన్నత పాఠశాల[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కొడాలిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఇద్దరు ఉన్నారు.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కొడాలిలో పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.

రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. ఆటల మైదానం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కొడాలిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 111 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 702 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 702 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కొడాలిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 702 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

కొడాలిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెరకు, మినుము

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

బియ్యం

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గుమ్మడి విజయకుమార్, సర్పంచిగా ఎన్నికైనాడు. [8]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి దేవాలయం[మార్చు]

కొడాలి గ్రామంలోని ఈ దేవాలయంలో, 2014, మార్చ్-9 ఆదివారం ఉదయం 11-07 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికై 41 అడుగుల బలార్షా టేకును మేఘనాలు, ఇత్తడి తొడుగులతో, రు. 7 లక్షల నిధులతో గ్రామస్థులు, దాతల సహకారంతో తయారు చేయించారు. ఈ సందర్భంగా మద్యాహ్నం, 5వేల మందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహించారు. ఆదివారం రాత్రికి ఆలయంలో హోమగుండాల వద్ద, విశేషపూజలు జరిగినవి. మూడురోజులనుండి ఆలయం వద్ద జరుగుచున్న ప్రత్యేక పూజలు ఆదివారంతో ముగిసినవి.ఈ కార్యక్రమానికి దివిసీమ నుండి భక్తులు పెద్ద యెత్తున తరలి వచ్చారు. [5]&[6]

ఈ ఆలయంలో, 2016, జనవరి-30వతేదీ శనివారం రాత్రి, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సహస్రనామ, కుంకుమార్చనలు నిర్వహించారు. [19]

శ్రీ గంగా పార్వతీ సమేత జగధీశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2014, నవంబర్-8, శనివారం నాడు, కార్తీకమాసం సందర్భంగా స్వామివారికి మహాన్యాస రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన నిర్వహించారు. అభిషేకపూజలు, సహస్రనామ, కుంకుమపూజలు నిర్వహించారు. [11]

శ్రీ కోదండరామాలయం[మార్చు]

శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం[మార్చు]

గంగానమ్మ తల్లి[మార్చు]

కొడాలి పరిసర ప్రాంతవాసుల ఇలవేలుపు అయిన గంగానమ్మ తల్లి వార్షిక జాతరను పురస్కరించుకొని, 2014, నవంబర్-9 ఆదివారం నాడు, కొడాలి గ్రామంలో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గంగానమ్మ తల్లి పోతురాజుల ఉత్సవ విగ్రహాలతో, డప్పుల విన్యాసాల మధ్య గ్రామోత్సవాన్ని నిర్వహించారు. [10]

శ్రీ రామకృష్ణ సేవాశ్రమం[మార్చు]

ఈ ఆశ్రమంలో శారదాదేవి 162వ జయంతి మహోత్సవాలను 2014, డిసెంబరు-11 నుండి 13వ తేదీ వరకు నిర్వహించారు. 11వ తేదీన మంగళహారతి, గురువుల సుప్రభాతం, గీతాపారాయణం, 12వ తేదీన ప్రముఖులు శ్రీ ద్రోణ పూర్ణచంద్రరావు గారిచే ధ్యానం, 13వ తేదీన డాక్టర్ హరీష్, కృష్ణభార్గవ్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేదసేవలందించారు. శారదాదేవి జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో, మూడు హోమగుండాలవద్ద, భక్తులచే గాయత్రీ యఙాన్ని శాస్త్రోక్తంగా, మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. శారదాదేవి జయంతిని నిర్వహించారు. [12]&[13]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 23 సంవత్సరాల క్రితం, దివంగత సంఘసేవకులు శ్రీ గుత్తికొండ గోపాలరావు సహకారంతో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ ఆలయ 23వ వ్య్వస్థాపక ప్రతిష్ఠా మహోత్సవం, 2015, మార్చ్-14వ తేదీ శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, సాయిబాబా వారి విగ్రహానికి అభిషేకాలు, దీపారాధన నిర్వహించారు. [15]

కొడాలి గ్రామంలో, శ్రీ లక్ష్మీ హయగ్రీవస్వామి జయంతి వేడుకలను, 2015, ఆగష్టు-29వ తేదీనాడు, వైభవంగా నిర్వహించారు. [17]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

కొడాలి ఆంజనేయులు - ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. కొడాలి గ్రామానికి చెందిన ఇతను ఆ రోజులలో, తను చేయుచున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, గాంధీజీ నడిచిన మార్గంలో నడిచారు. బ్రిటిష్ సామ్రాజాన్ని ఎదిరించి అనేక ఉద్యమాలలో పాలు పంచుకున్నారు. 1924, ఏప్రిల్-20న గాంధీజీ ఘంటసాల గ్రామానికి వచ్చినపుడు, ఆయనను కొడాలి గ్రామానికి తీసికొనివచ్చి, స్వాతంత్ర్యపోరాటానికి గ్రామస్థుల నుండి విరాళాలు సేకరించి అందించారు. అంతేగాక తన 40 ఎకరాల భూమితోపాటు, ఇంటిని సైతం ఉద్యమానికి పణంగా పెట్టిన నిస్వార్ధపరుడు. పోరాటంలో లాఠీదెబ్బలు, జైలు జీవితానికి వెరవలేదు. అనేక పుస్తకాలు గూడా వ్రాసిన వీరు, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు వ్రాసిన దేశభక్తిని ప్రదర్శించే అవతార పరివర్తనం నాటకం, బ్రిటిష్ ప్రభుత్వ నిషేధానికి గురైనది. భారత ప్రభుత్వం ఇచ్చిన బంగారు పతకాన్ని, 1962లో చైనా యుద్ధం సమయంలో, విరాళంగా ఇచ్చి, మరోమారు తన దేశభక్తిని చాటుకున్నారు. 1982 లో వీరు అనారోగ్యంతో కన్నుమూసినారు. వీరి విగ్రహాన్ని ఇటీవల కొడాలి గ్రామంలో ఏర్పాటు చేసారు. [9]

గ్రామ విశేషాలు[మార్చు]

  1. ఈ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థిని కొడాలి సృజన, పెడనలో 2013, డిసెంబరు 2 నుండి 4 వరకూ జరిగిన Inspire Sceince Fair లో, ప్రదర్శించిన Concept of Fundamental Operations in Number Systems అనే ప్రదర్శన పలువురిని ఆకట్టుకొనుటయేగాక, రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎన్నికైనది. అనంతపురంలో, 2013, డిసెంబరు 7నుండి జరిగే, రాష్ట్రస్థాయి Sceince Fair లో, ఈ ప్రదర్శన కృష్ణా జిల్లాకు ప్రాతినిధ్యం వహించబోవుచున్నది. [2]
  2. ఈ గ్రామంలోని శ్రీ రామకృష్ణాశ్రమంలో, శారదాదేవి జయంతి మహోత్సవం సందర్భంగా, 27వ వార్షికోత్సవం 2013, డిసెంబరు,24న జరుగును. [3]
  3. ఉయ్యూరుకి చెందిన శ్రీ తాడినాడ ఫణిరాజమోహన్, కొడాలి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరు గణితబోధనలో దిట్ట. వీరు పలు ప్రయోగాలద్వారా విద్యార్థులకు తేలికగా అర్ధమయ్యేలాగా గణితబోధన చేస్తున్నారు. కేవలం సైన్సు పాఠ్యాంశాలకే పరిమితమైన ప్రయోగాత్మక పద్ధతిని, వీరు గణితంలో గూడా చేసి చూపించుచున్నారు. వీరు 30కి పైగా గణిత అష్టావధానాలను నిర్వహించారు. గణితంలో పలు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పురస్కారాలు పొందినారు. [4]
  4. కొడాలి గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో, హైదరాబాదు వాస్తవ్యులైన శ్రీ సూర్యదేవర విజయభాస్కర్, రు.ఆరు లక్షల వితరణతో, నీటిశుద్ధి యంత్ర భవనాన్ని నిర్మించారు. దీనిద్వారా కొడాలి, తాడేపల్లి, చిట్టూర్పు, వేములపల్లి, చినకళ్ళేపల్లి గ్రామాలవారికి శుద్ధినీరు లభించగలదు. ఈ యంత్రాన్ని, 2014, జూన్-22, ఆదివారం రాత్రి ప్రారంభించారు. [7]
  5. ఈ గ్రామానికి చెందిన శ్రీ గుమ్మడి రత్నాకరరావు, గంగాభవాని దంపతుల కుమారుడైన శ్రీ శైలేంద్రకృష్ణ, ఒక ఎన్.ఆర్.ఐ. వీరు తన గ్రామాభివృద్ధికై రు. 1.34 లక్షల విరాళాన్ని అందజేసినారు. [16]

గణాంకాలు[మార్చు]

1.2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3407. ఇందులో పురుషుల సంఖ్య 1695, స్త్రీల సంఖ్య 1712, గ్రామంలో నివాసగృహాలు 959 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 814 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, డిసెంబరు-6; 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013, డిసెంబరు-21; 1వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013, డిసెంబరు-23; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మార్చ్-10, 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మార్చ్-11; 1వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-24; 2వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 3వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-15; 1వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, నవంబర్-10; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, నవంబర్-9; 3వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు=11; 2వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, డిసెంబరు-14; 2వపేజీ. [14] ఈనాడు కృష్ణా; 2014, డిసెంబరు-24; 6వపేజీ. [15] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మార్చ్-15; 3వపేజీ. [16] ఈనాడు కృష్ణా; 2015, మే-1; 16వపేజీ. [17] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగష్టు-30; 1వపేజీ. [18] ఈనాడు అమరావతి; 2016, జనవరి-1; 42వపేజీ. [19] ఈనాడు అమరావతి; 2016, ఫిబ్రవరి-1; 40వపేజీ. [20] ఈనాడు అమరావతి; 2017, జనవరి-11; 4వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కొడాలి&oldid=4127814" నుండి వెలికితీశారు