Jump to content

కొడాలి ఆంజనేయులు

వికీపీడియా నుండి

కొడాలి ఆంజనేయులు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. కొడాలి గ్రామానికి చెందిన ఆయన ఆ రోజులలో, తను చేయుచున్న ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, గాంధీజీ నడిచిన మార్గంలో నడిచాడు. బ్రిటిష్ సామ్రాజాన్ని ఎదిరించి అనేక ఉద్యమాలలో పాలు పంచుకున్నాడు. 1924, ఏప్రిల్ 20న గాంధీజీ ఘంటసాల గ్రామానికి వచ్చినపుడు, ఆయనను కొడాలి గ్రామానికి తీసికొనివచ్చి, స్వాతంత్ర్యపోరాటానికి గ్రామస్థుల నుండి విరాళాలు సేకరించి అందించాడు. అంతేగాక తన 40 ఎకరాల భూమితోపాటు, ఇంటిని సైతం ఉద్యమానికి పణంగా పెట్టిన నిస్వార్ధపరుడు. పోరాటంలో లాఠీదెబ్బలు, జైలు జీవితానికి వెరవలేదు. అనేక పుస్తకాలు గూడా వ్రాసిన ఆయన, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన వ్రాసిన దేశభక్తిని ప్రదర్శించే అవతార పరివర్తనం నాటకం, బ్రిటిష్ ప్రభుత్వ నిషేధానికి గురైనది. భారత ప్రభుత్వం ఇచ్చిన బంగారు పతకాన్ని, 1962లో చైనా యుద్ధం సమయంలో, విరాళంగా ఇచ్చి, మరోమారు తన దేశభక్తిని చాటుకున్నాడు. 1982 లో అనారోగ్యంతో కన్నుమూశాడు. వీరి విగ్రహాన్ని ఇటీవల కొడాలి గ్రామంలో ఏర్పాటు చేశారు.[1]

రచనలు

[మార్చు]

ఖాదీ అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని మహాత్మా గాంధీ రచించగా ఆంజనేయులు తెలుగులోకి అనువదించారు.[2].

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగష్టు-15; 1వపేజీ
  2. ఖాదీ అర్థశాస్త్రం:మూ.మహాత్మాగాంధీ, అ.కొడాలి ఆంజనేయులు:1958