దేవరకోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవరకోట
—  రెవిన్యూ గ్రామం  —
దేవరకోట is located in Andhra Pradesh
దేవరకోట
దేవరకోట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°09′07″N 80°56′39″E / 16.151865°N 80.944273°E / 16.151865; 80.944273
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఘంటసాల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,573
 - పురుషులు 803
 - స్త్రీలు 770
 - గృహాల సంఖ్య 483
పిన్ కోడ్ 521133
ఎస్.టి.డి కోడ్ 08671

దేవరకోట, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 133. యస్.టీ.డీ.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

ఘంటసాల మండలం[మార్చు]

ఘంటసాల మండలం తెలుగురావుపాలెం, కొడాలి, కొత్తపల్లె, చినకళ్ళేపల్లి, చిట్టూర్పు, ఘంటసాల, బొల్లపాడు, దేవరకోట, తాడేపల్లి, వెల్లిమల్లి, రుద్రవరం, వేములపల్లె, శ్రీకాకుళం గ్రామాలు ఉన్నాయి.

గ్రామంలో విష్ణుకుండినుల వంశం వారు కట్టిన పాత కోట ఉంది. పురాతన కాలం నాటి శాసనాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో ఘంటసాలపాలెం, ఘంటసాల, కొత్తపల్లి, లక్ష్మిపురం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

చల్లపల్లి, మొవ్వ, మోపిదేవి, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కొడాలి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 57 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, దేవరకోట

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. ఇది మండలంలో పెద్ద గ్రామం.
 2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి పుట్టి సుమతి, సర్పంచిగా ఎన్నికైనారు. [5]
 3. ఈ గ్రామ పంచాయతీ, 2015,నవంబరు-8వ తేదీనాడు, 57వ వార్షికోత్సవం జరుపుకున్నది. [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

 1. ఈ అమ్మవారు ఘంటసాల మండల పరిధిలోని దేవరకోట, ఘంటసాల పరిసర ప్రాంతాల ప్రజల ఇలవేలుపుగా పూజలందుకొనుచున్నారు.
 2. దేవరకోట గ్రామంలో కొలువైయున్న శ్రీ కోట ముత్యాలమ్మ అమ్మవారి ఇంటింటికీ, జాతర మహోత్సవాలు, 1871 నుండి, ప్రతి 5 సంవత్సరాలకొకసారి, చైత్ర శుద్ధ పౌర్ణమికి అత్యంత వైభవంగా నిర్వహించుచున్నారు. ఈ సంవత్సరం 2014,ఏప్రిల్ లో, 16వ తేదీ నుండి 22 వ తేదీ వరకూ నిర్వహించారు. అమ్మవారిని మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో భక్తిశ్రద్ధ్లతో జాతర మహోత్సవం నిర్వహించెదరు. ఈ సందర్భంగా భక్తులు, మ్రొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకొని తరించెదరు. [4]
 3. ఈ అమ్మవారి గ్రామోత్సవాన్ని, 2014, ఆగష్టు-22, శ్రావణ శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, భక్తిశ్రద్ధలతో అమ్మవారి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. [5]
 4. 2016,అక్టోబరు-30వ తేదీ ఆదివారం, దీపావళి పర్వదినం సందర్భంగా, ఆలయంలో కోట ముత్యాలమ్మ ఆలయ సంక్షిప్త చరిత్ర అను పుస్తకాన్ని, ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో, ఆలయ చరిత్రతోపాటు, దాతల వివరాలు, జమాఖర్చులు, ఆలయాన్ని సందర్శించిన ప్రముఖుల ఫొటోలను సుందరంగా పొందుపరచారు. [7]
 5. ఈ ఆలయ ప్రాంగణంలో దాతలు, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో 11 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన భోజనశాల భవనాన్ని, 2016,నవంబరు-7వ తేదీ కార్తీక సోమవారంనాడు ప్రారంభించెదరు. [8]
 6. 30వేల రూపాయల విలువైన ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, విజయవాడకు చెందిన శ్రీ వేముల హనుమంతరావు, శ్రీమతి సీతామహాలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీ సాయిగిరిధర్, కోడలు రాణి, 2017,మార్చి-14న, ఆలయానికి అందజేసినారు. ఈ విగ్రహాలకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [9]

శ్రీ కోదండరామాలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన వేమూరి రత్నగిరి రావు అనే రైతు తన చెరుకు చేనులో ఒక ఎకరానికి 71 టన్నుల చెరుకు పండించి రికార్డు సృష్టించారు. ఈయనను, 16-సెప్టెంబరు,2013 న జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘానికి డైరెక్టరుగా ఎన్నుకున్నారు. [2]&[3]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1537.[3] ఇందులో పురుషుల సంఖ్య 763, స్త్రీల సంఖ్య 774, గ్రామంలో నివాస గృహాలు 415 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 324 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1,573 - పురుషుల సంఖ్య 803 - స్త్రీల సంఖ్య 770 - గృహాల సంఖ్య 483

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Ghantasala/Devarakota". Retrieved 25 June 2016. External link in |title= (help)
 3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-08.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013,మార్చి-2; 11వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2013,సెప్టెంబరు; 19వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-16; 2వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 3వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-8; 43వపేజీ. [7] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,నవంబరు-1; 1వపేజీ. [8] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016,నవంబరు-7; 2వపేజీ. [9] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,మార్చి-14; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=దేవరకోట&oldid=3292322" నుండి వెలికితీశారు