ఘంటసాలపాలెం
Jump to navigation
Jump to search
ఘంటసాలపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°10′56″N 80°55′29″E / 16.182225°N 80.924591°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | ఘంటసాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | వేమూరి సాయి వెంకటరమణ |
పిన్ కోడ్ | 521133 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
ఘంటసాలపాలెం కృష్ణా జిల్లా, ఘంటసాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామ భౌగోళికం
[మార్చు]సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]మచిలీపట్నం, రేపల్లె, పెడన, గుడివాడ
సమీప మండలాలు
[మార్చు]చల్లపల్లి, మొవ్వ, పమిడిముక్కల, గూడూరు
గ్రామ ప్రముఖులు
[మార్చు]- తుమ్మల వేణుగోపాలరావు :ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. 1928 ఫిబ్రవరి 28న ఘంటసాలపాలెంలో జన్మించాడు.వేణుగోపాలరావు 83వ ఏట 2011 సెప్టెంబరు 21, న మరణించాడు. మరణానంతరం కళ్ళు, భౌతిక దేహం ఆంధ్ర వైద్య కళాశాలకు దానం చేయబడ్డాయి.
- ఉప్పల ప్రసాదరావు ఆదర్శరైతు 2012 వ సంవత్సరానికి గాను 'రాష్ట్ర రైతు నేస్తం' పురస్కారానికి యెన్నికయ్యారు. వీరు 2003,2010 సంవత్సరాలలో జిల్లా ఉత్తమ పశుపోషకుని అవార్డు, జిల్లా ఉత్తమ రైతు అవార్డూ పొందారు. 2014,అక్టోబరు-21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గన్నవరం పర్యటన సందర్భంగా, ఏర్పాటుచేసిన పశుప్రదర్శనలో వీరు పెంచుచున్న బ్లాక్ బెంగాల్ మేకపిల్లను ప్రదర్శించారు. ఆ ప్రదర్శనలో ఈ మేకపిల్లను చూసి ముచ్చటపడిన ఆయనకు, ఈ రైతు 170 ఎకరాల పొలం కౌలుకు చేస్తున్నాడనీ, ఆయన 200 పశువులను పోషించున్నాడనీ, ఇంకా ఆయన దగ్గర మేలురకం మేకలున్నాయనీ అధికారులు వివరించారు. ఈ సంగతి తెలుసుకున్న ఆయన, ఒక రైతుకు ఇవన్నీ ఎలా సాధ్యమైనవని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా, శ్రీ ప్రసాదరావు, ఆ మేకపిల్లను ముఖ్యమంత్రికి బహూకరించారు.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]కొడాలి, మొవ్వ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 54 కి.మీ
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
[మార్చు]మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని వేమూరి గోపాలరావునగర్ లో ఉంది.
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
[మార్చు]వైద్య సౌకర్యం
[మార్చు]ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
సామాజిక భవనo
[మార్చు]ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వేమూరి గోపాలరావునగర్ లో, ఈ భవనాన్ని, ఇటీవల గొర్రెపాటి వెంకట్రాయులు, ఉదయభాస్కరమ్మ విద్యాట్రస్ట్ ఆధ్వర్యంలో, రు. 5 లక్షల వ్యయంతో నిర్మించారు.
గ్రామ పంచాయతీ
[మార్చు]ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో వేమూరి సాయి వెంకటరమణ సర్పంచిగా గెలుపొందాడు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ మధురేశ్వరస్వామివారి ఆలయం:- ఈ గ్రామంలో గ్రామస్థులు, దాతల సహకారంతో రు. కోటి రూపాయల వ్యయంతో, నూతన శివాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠ కొరకు, రు. 8.5 లక్షల గ్రామస్థులు, దాతల ఆర్థిక సహకారంతో, తెనాలి, మహాబలిపురం నుండి దేవతామూర్తుల విగ్రహాలను, ఉమా మధురేశ్వరస్వామి, వీరభద్ర, భద్రకాళి, గణపతి, కుమారస్వామి, జీవధ్వజ, నవగ్రహ,షిర్డీ సాయిబాబా, వాయులింగ, నాగ విగ్రహాలను తెప్పించారు. చలువరాతి శివలింగాన్ని, రు. 2.4 లక్షల వ్యయంతో, రాజస్థాను నుండి తెప్పించారు. ఈ ఆలయంలో, 2014,జూన్-6 నుండి 8 వరకు, శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. 6వ తేదీన, ఉదయం 9 గంటలకు గణపతి పూజ, అఖండదీపారాధన, అంకురార్పణ, ధ్వజారోహణ, నీరాజన మంత్రపుష్పం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. 7వ తేదీన, వాస్తుహోమం, క్షీరాధివాసం, గవ్యాంతపూజలు, గ్రామోత్సవం, అన్నసమారాధన, హోమగుండాల వద్ద యాగాలు నిర్వహించారు. దీనికోసం హోమగుండం వద్ద ప్రత్యేకంగా యాగశాలను నిర్మించారు. 8వ తేదీ ఉదయం 7-38 గంటలకు నూతన శివాలయంలో శ్రీ ఉమా మధురేశ్వర స్వామి, వీరభద్ర, భద్రకాళి, గణపతి, కుమారస్వామి, జీవధ్వజ, నవగ్రహ, సాయిబాబా, వాయులింగ నాగప్రతిష్ఠా మహోత్సవాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి శైవక్షేత్రం పీఠాధిపతి శ్రీ శైవస్వామి అనుగ్రహభాషణ చేసారు.