అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం
అవనిగడ్డ | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు | అంబటి శ్రీహరి ప్రసాద్ |
PIN code | 521121 |
Area code(s) | 08671 |
అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో గలదు.
చరిత్ర[మార్చు]
ఈ నియోజకవర్గంలో 236 పోలింగ్ కేంద్రంలు, 1,83,813 ఓటర్లున్నారు. పురుషుల కంటే 3559 మహిళా ఓటర్లు ఎక్కువ. అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమగా పేరొందిన ప్రాంతం. పునర్విభజన తరువాత చల్లపల్లి, ఘంటసాల రెండు మండలాలు కొత్తగా చేరాయి. తూర్పు కృష్ణాప్రాంతంలో కాపు,అగ్నికుల క్షత్రియ,కమ్మ కులాల జనాభా ఎక్కువ.
చల్లపల్లి జమిందార్ యార్లగడ్డ శివరామ ప్రసాద్, మండలి వెంకట కృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణ వంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అవనిగడ్డ నియోజకవర్గం 1962 లో ఏర్పడింది.మొత్తం పదిసార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) లు ఏడుసార్లు, తెలుగుదేశం మూడుసార్లు ఇక్కడ గెలిచింది. యార్లగడ్డ శివరామ ప్రసాద్ అవనిగడ్డ నుంచి రెండుసార్లు, అంతకుముందు దివి నియోజకవర్గం నుంచి ఒకసారి మొత్తం మూడుసార్లు గెలవగా, మండలి వెంకట కృష్ణారావు సింహాద్రి సత్యనారాయణ మూడుసార్లు చొప్పున గెలిచారు. రెండుసార్లు కృష్ణారావు కుమారుడు బుద్ద ప్రసాద్ గెలుపొందారు. మండలి వెంకటకృష్ణారావు ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం ఒక ప్రత్యేకత. జిల్లాలో శాసనసభ్యులుగా పోటీచేసి మరెవరికీ ఈ గౌరవం దక్కలేదు. 1952, 55 లలో దివి నియోజకవర్గం ఉండేది.ఆ రెండుసార్లు దివి ద్వి సభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ప్రఖ్యాత సిపిఐ నేత చండ్ర రాజేశ్వరరావు సొంత నియోజకవర్గమైన దివలో ఒకసారి ఆయన సోదరుడు చండ్ర రామలింగయ్య గెలుపొందగా చల్లపల్లి రాజా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలో రాజేశ్వరరావు స్వయంగా పోటీచేసి చల్లపల్లి రాజాచేతిలో పరాజితులయ్యారు.[1]
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

శాసనసభ ఎన్నికలు[మార్చు]
2004 ఎన్నికలు[మార్చు]
2004 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందినమండలి బుద్ధప్రసాద్తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభర్థి బూరగడ్డ రమేష్ నాయుడుపై 8482 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. ప్రసాద్‌కు 41511 ఓట్లు రాగా, బూరగడ్డ రమేష్ నాయుడు 33029 ఓట్లు పొందినాడు. మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీచేసిన ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి సింహాద్రి సత్యనారాయణరావు 14845 ఓట్లతో మూడవ స్థానం పొందగా, సి.పి.ఐ. (ఎం.ఎల్) అభ్యర్థి కె.వెంకటనారాయణ 937 ఓట్లతో నాలుగవ స్థానం పొందినాడు.
2009 ఎన్నికలు[మార్చు]
2009 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అంబటి బ్రాహ్మణయ్య తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీకి అభర్థి మండలి బుద్ధప్రసాద్ ఫై 417 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు.
2013 ఉపఎన్నికలు[మార్చు]
2013 ఎన్నికలు అంబటి బ్రాహ్మణయ్య గారి మరణంతో జరిగిన ఉపఎన్నికలో అంబటి శ్రీహరి ప్రసాద్ 61,644 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ ఫై గెలుపొందినారు.కాంగ్రెస్, వై.కా.పా పార్టీలు ఈ ఎన్నికలలో పోటి చేయలేదు.
2013 ఉపఎన్నిక:అవనిగడ్డ | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలుగుదేశం పార్టీ | అంబటి శ్రీహరి ప్రసాద్ | 75,282 | |||
Independent | సైకం రాజశేఖర్ | 13,638 | |||
Independent | రావు సుబ్రహ్మణ్యం | 3,389 | |||
మెజారిటీ | 61,644 | ||||
మొత్తం పోలైన ఓట్లు | 92,309 | 47 | |||
తె.దే.పా గెలుపు | మార్పు |
2014 ఎన్నికలు[మార్చు]
ఆంధ్రప్రదేశ్ విభజనతో కాంగ్రెస్ నాయకుడు మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
2014 ఎన్నికలు:అవనిగడ్డ | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలుగుదేశం పార్టీ | మండలి బుద్ధప్రసాద్ | 80995 | |||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | సింహాద్రి రమేష్ బాబు | 75037 | |||
బహుజన సమాజ్ పార్టీ | అంబేద్కర్ పెగ్గం | 4486 | |||
భారత జాతీయ కాంగ్రేసు | మత్తి శ్రీనివాసరావు | 2091 | |||
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) | ఆవుల బసవయ్య[2] | 2049 | |||
లోక్ సత్తా పార్టీ | నడకుదిటి రాధాకృష్ణ | 673 | |||
మెజారిటీ | 5958 | - | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,68,232 | 84.6 | ![]() | ||
తె.దే.పా గెలుపు | మార్పు |
శాసనసభ్యులు[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యుల జాబితా.
సంవత్సరం | గెలుపొందిన సభ్యుడు | పార్టీ | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ||
---|---|---|---|---|---|---|
1955 | యార్లగడ్డ శివరామప్రసాద్ | కాంగ్రెస్ | చండ్ర రాజేశ్వరరావు | సి.పి.ఐ | ||
1962 | యార్లగడ్డ శివరామప్రసాద్ | కాంగ్రెస్ | సనకా బుచ్చికోటయ్య | సి.పి.ఐ | ||
1967 | యార్లగడ్డ శివరామప్రసాద్ | కాంగ్రెస్ | సనకా బుచ్చికోటయ్య | సి.పి.ఐ | ||
1972 | మండలి వెంకటకృష్ణారావు | కాంగ్రెస్ | ఏకగ్రీవ ఎన్నిక | |||
1978 | మండలి వెంకటకృష్ణారావు | కాంగ్రెస్ | సైకం అర్జునరావు | జనతా పార్టీ | ||
1983 | మండలి వెంకటకృష్ణారావు | కాంగ్రెస్ | వక్కపట్ల శ్రీరామ ప్రసాద్ | తె.దే.పా | ||
1985 | సింహాద్రి సత్యనారాయణ | తె.దే.పా | మండలి వెంకట కృష్ణారావు | కాంగ్రెస్ | ||
1989 | సింహాద్రి సత్యనారాయణ | తె.దే.పా | మండలి బుద్ధప్రసాద్ | కాంగ్రెస్ | ||
1994 | సింహాద్రి సత్యనారాయణ | తె.దే.పా | మండలి బుద్ధప్రసాద్ | కాంగ్రెస్ | ||
1999 | మండలి బుద్ధప్రసాద్ | కాంగ్రెస్ | బూరగడ్డ రమేష్ నాయుడు | తె.దే.పా | ||
2004 | మండలి బుద్ధప్రసాద్ | కాంగ్రెస్ | బూరగడ్డ రమేష్ నాయుడు | తె.దే.పా | ||
2009 | అంబటి బ్రాహ్మణయ్య | తె.దే.పా | మండలి బుద్ధప్రసాద్ | కాంగ్రెస్ | ||
2013* | అంబటి శ్రీహరి ప్రసాద్ | తె.దే.పా | సైకం రాజశేఖర్ | స్వతంత్రుడు | ||
2014 | మండలి బుద్ధప్రసాద్ | తె.దే.పా | సింహాద్రి రమేష్ బాబు | వై.కా.పా |
- 2013 ఎన్నికలు అంబటి బ్రాహ్మణయ్య గారి మరణంతో జరిగిన మధ్యంతర ఎన్నికలు.కాంగ్రెస్ , వై.కా.పా పార్టిలు ఈ ఎన్నికలలో పోటి చేయలేదు.
హ్యాట్రిక్ నాయకులు[మార్చు]
- 1955లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో యార్లగడ్డ శివరామ ప్రసాద్ తన సమీప ప్రత్యర్థి, సిపిఐకి చెందిన చండ్ర రాజేశ్వరరావుపై విజయం సాధించారు. 1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో యార్లగడ్డ శివరామ ప్రసాద్ సిపిఐ నాయకుడు సనకా బుచ్చికోటయ్యపై రెండవ పర్యాయం విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో వీరువురే బరిలో నిలవగా, మరో మారు శివరామ ప్రసాద్ విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు.
- 1972లో మండలి వెంకటకృష్ణారావు కాంగ్రెస్ పక్షాన శాసనసభకి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన మండలి వెంకట కృష్ణారావు జనతా పార్టీకి చెందిన సైకం అర్జునరావుపై రెండవ పర్యాయం విజయం సాధించారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని మండలి వెంకట కృష్ణారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వక్కపట్ల శ్రీరామ ప్రసాద్‌పై విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు.
- 1985లో జరిగిన ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన సింహాద్రి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావుపై విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో సైతం వీరువురే పోటీ చేయగా రెండవ పర్యాయం సింహాద్రి సత్యనారాయణ విజయబావుటా ఎగురవేశారు. 1994లో జరిగిన ఎన్నికల్లో సింహాద్రి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మండలి బుద్దప్రసాద్‌పై విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఈయన 24-09-2010 న పరమపదించారు.
నియోజకవర్గపు విశేషాలు[మార్చు]
- ఎదురుమొండి గ్రామశివారు ఎలిచెట్లదిబ్బ (పోలింగ్ స్టేషను నంబర్ 235) కు ఇప్పటికీ పడవల మీదనే సిబ్బంది వెళ్ళాల్సి ఉంది.
- నాచుగుంట గొల్లమంద కృష్ణాపురం గ్రామాలకు ఎన్నికల సామాగ్రిని జీపులతో సహా ఫంటు మీద కృష్ణానదీ పాయను దాటించాలి.
మూలాలు[మార్చు]
- ↑ http://www.suryaa.com/features/article-2-176612[permanent dead link]
- ↑ http://www.thehindu.com/news/national/andhra-pradesh/cpi-m-releases-final-list/article5915532.ece