అవనిగడ్డ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అవనిగడ్డ
—  రెవిన్యూ గ్రామం  —
అవనిగడ్డ is located in Andhra Pradesh
అవనిగడ్డ
అవనిగడ్డ
అవనిగడ్డ
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°01′46″N 80°54′51″E / 16.029565°N 80.914188°E / 16.029565; 80.914188
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వం
 - శాసన సభ్యులు [[మండలి బుద్ధ ప్రసాద్ ]]
 - సర్పంచి నలుకుర్తి పృధ్వీరాజ్
జనాభా (2011)
 - మొత్తం 23,737
 - పురుషుల సంఖ్య 21,479
 - స్త్రీల సంఖ్య 20,360
 - గృహాల సంఖ్య 6,027
పిన్ కోడ్ 521 121
ఎస్.టి.డి కోడ్ 08671

అవనిగడ్డ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

కృష్ణా ముఖద్వార౦ దగ్గర చిన్న రాజ్య౦ అవనిగడ్ద! ఇది దివిసీమకు రాజధాని. దీన్ని అవనిజపుర౦ అని సీతాదేవి పేరుతో పిలుస్తారు. క్రీ.శ.3వ శతాబ్దికి చె౦దిన బృహత్పలాయన ప్రభువులు ఈ దీవిని ఏర్పరచారని చెప్తారు. భట్టిప్రోలులో బుద్ధుని అస్థికలున్న భరిణ మీద కుబీరకుడనే యక్షరాజు పేరు ఉ౦దట! ఈ కుబీరకుడు కృష్ణానదికీ, సముద్రానికీ మధ్యలో దివిసీమ నేర్పరచాడ౦టారు. ఆనాడు రోము రాజ్యాధీశుని ఆస్థానానికి రాయబారిని ప౦పిన తెలుగు రాజు జయవర్మ గానీ, త్రిలోచన పల్లవుడు గానీ కావచ్చున౦టారు. అమియానస్ వ్రాసిన వ్రాతల్లో “దివి”(దివిసీమ), “శరణ్‘దివి(హ౦సలదీవి)” అనే పేర్లు కనిపిస్తాయి, అలోసైనీ అని ఆరోజుల్లో అవనిగడ్డని పిలిచారు.ఈ గ్రామం చుటూర క్రిష్న నది ప్రవహిస్తూ వుంటుంది, వేల స౦వత్సరాల తెలుగు వారి చరిత్రను తన గర్భ౦లో ఇముడ్చుకుని నిలువెత్తు సాక్షిగా నిలిచిన దివిసీమ ఒక చారిత్రక దివ్యసీమ.[1]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పురాణాలలో అవనిజాపురం'గా ప్రసిద్ధిచెందిన గ్రామమే నేటి "అవనిగడ్డ" అని చరిత్ర చెప్పుచున్నది. శ్రీరామచంద్రుడు తన గురువైన వశిష్టుని ఆశ్రమంలో సీతాదేవికి ధర్మశ్రవణం చేయించారని, అందువలన "అవనిజాపురం"గా పిలిచినట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుచున్నాయి. సీతాదేవి వనవాసం ఉన్నది సీతలంక అనీ, వశిష్టాశ్రమాన్ని వశిష్టమెట్టగా పిలిచేవారు. శాతవాహనుల కాలంలో రేవుకేంద్రంగా, వ్యాపారకేంద్రంగా ఉన్న "అలోషైని" నామంతో ప్రసిద్ధిచెందిన ఓడరేవు ఇది. క్రీ.పూ.3వ శతాబ్దం నుండి క్రీ.శ.13వ శతాబ్ది వరకు, ఈ రేవుద్వారా పెద్ద నావలతో వ్యాపారం జరిగేదనీ,అదే నేటి అవనిగడ్డ గ్రామంగా చరిత్ర చెపుచున్నది. 14వ శతాబ్దం ప్రారంభం నుండి "అవనిగడ్డ" గానే పిలుస్తున్నట్లు చరిత్ర పరిశోధకులు వెల్లడించారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

అవనిగడ్డ నుండి పలు ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. అవనిగడ్డ నుండి విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, కోడూరు, నాగాయలంక వంటి పలు ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. అదే విధంగా దూర ప్రాంతాలైన కె.పి.హెచ్.బి, ఇ.సి.ఐ.ఎల్, జీడిమెట్లకు పలు బస్సులు ఉన్నాయి. ఉదయం 2:30 నిముషాలకు అవనిగడ్డ నుండి విజయవాడకు బస్సు ఉంది. అవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 66 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

కళాశాలలు[మార్చు]

 1. ప్రభుత్వ డిగ్రీ కళాశాల:- ఈ కళాశాలకు నాక్-బి గ్రేడ్ వచ్చింది. ఈ కళాశాల 40వ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-20న నిర్వహించారు. [38]&[48]
 2. ప్రభుత్వ జూనియర్ కళాశాల - ఈ కళాశాల 46వ వార్షికోత్సవం, 2014,నవంబరు-8న కళాశాల ప్రాంగణంలో నిర్వహించెదరు. [18]
 3. దివిసీమ పాలిటెక్నిక్ కళాశాల
 4. ఎస్.వి.ఎల్ క్రాంతి జూనియర్ కళాశాల:- ఈ కళాశాల విద్యార్థి తుమ్మల హరీష్, ఇటీవల శ్రీశైలంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో తన ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైనాడు. ఈ విద్యార్థి, 2015,డిసెంబరు-15 నుండి 18 వరకు ఒడిషా రాష్ట్రంలోని కటక్ లో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటాడు. [42]
 5. కృష్ణారావు డి.ఎడ్. మరియా బి.ఎడ్ కళాశాల.

పాఠశాలలు[మార్చు]

 1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలో ప్రవాస భారతీయులైన దాతల ఆర్థిక సహకారంతో, 2015,ఆగస్టు-11వ తేదీనాడు, డిజిటల్ తరగతులను ప్రారంభించనున్నారు. [33]
 2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- స్థానిక లంకమ్మ మాన్యంలో రు. 6.5 లక్షలతో నిర్మించుచున్న ఈ పాఠశాల భవన నిర్మాణం, 2014,డిసెంబరు-16వ తేదీనాడు ప్రారంభించారు. [20]
 3. శ్రీ చైతన్య.
 4. సి.బి.ఎం. బోర్డింగ్ పాఠశాల:- ఈ పాఠశాల 1922 లో బ్రిటిష్ వారి పాలనలో ఏర్పడినది. ఈ పాఠశాలలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఉప సభాపతిగా ఉన్న శ్రీ మండలి బుద్ధప్రసాద్, అనేక ప్రముఖులు చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లుగా దేశ, విదేశాలలో ఉన్నత పదవులలో ఉన్నారు. ఈ పాఠశాలకు ఇప్పుడు దాతల సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టుచున్నారు. [47]
 5. సెంట్ యాన్స్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాల ప్రిన్సిపల్ అషా జార్జ్, 2015,సెప్టెంబరు-5వ తేదీనాడు, గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారం అందుకున్నరు. ఈమె కేరళ రాష్ట్రంలో జన్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురస్కారం అందుకోవడం విశేషం. [37]
 6. శిశు విద్యా మందిరం.
 7. విద్యా వికాస్.
 8. ఆర్.సి.యం స్కూలు.
 9. కరిపినేని రంగనాయకమ్మ బాలికోన్నత పాఠశాల:- ఈ పాఠశాల నియోజకవర్గంలోని ఏకైక బాలికోన్నత పాఠశాల. ఈ పాఠశాలకు సినీ నటుడు శర్వానంద్ తండ్రి శ్రీ మైనేని రత్నగిరి వరప్రసాదరావు, కరస్పాండెంటుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాల 47వ వార్షికోత్సవం,2015,ఫిబ్రవరి-22వ తేదీనాడు ఘనంగా నిర్వహించారు. [21]

కోచింగ్ విద్యాలయాలు[మార్చు]

 1. ప్రగతి విద్యా సంస్థలు
 2. విద్యా నికేతన్
 3. ప్రజ్ఞా విద్యా సంస్థలు

సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాలు[మార్చు]

ఈ గ్రామంలో బాలుర మోడల్ హాస్టల్ మరియూ బాలికల వసతిగృహాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. వీటిలో పూలు, పండ్ల మొక్కలు నాటించి ఉద్యానవనాలుగా తీర్చిదిద్దినారు. వేసవిలో గూడా వీటిని పర్యవేక్షించుచూ చెత్తను ఎప్పటికప్పుడు ఏరివేస్తుంటారు. నిత్యం మొక్కలకు నీరు పోస్తూ హరితవనాలుగా తీర్చిదిద్దినారు. జిరాఫీ, జింక, ఏనుగు, ఒంటె, నెమలి మొదలగు జంతువుల బొమ్మలు తయారుచేయించి లోపల ఉంచారు. విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో విద్యాబోధన చేసే ప్రభుత్వ ఉన్నత పాఠశాల దగ్గరలోనే ఉంది. ఈ వసతి గృహాలు జిల్లాకే ఆదర్శంగా ఉన్నాయి. [16]

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

పార్కు[మార్చు]

ఈ గ్రామములోని వంతెన కూడలిలో, ప్రవాసాంధ్రుల (ఎన్.ఆర్.ఐ) ఆర్థిక సహకారంతో నిర్మించిన ఈ పార్కును, 2015,అక్టోబరు-27వ తేదీనాడు ప్రారంభించారు. [39]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (P.A.C.S)[మార్చు]

అవనిగడ్డ మండలంలోని అశ్వరావుపాలెం, మోదుమూడి, వేకనూరు, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, సుమారు 8 సంవత్సరాల క్రితం, అవనిగడ్డ గ్రామ సంఘంలో విలీనం చేసారు. [40]

అంగనవాడీ కేంద్రం[మార్చు]

అవనిగడ్డ గ్రామములోని అంకమ్మ మాన్యంలో, రెవెన్యూశాఖ సమకూర్చిన స్థలంలో, 8 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఈ కేంద్రానికి ఒక నూతన భవన నిర్మాణం ప్రారంభమయినది. [41]

తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణమండపం[మార్చు]

త్యాగరాజ మందిరం[మార్చు]

సుమారు 50 సంవత్సరాల క్రితం, శ్రీ తంగిరాల వీరరాఘవయ్య వితరణగా అందించిన 10 సెంట్ల స్థలంలో ఈ మందిరాన్ని నిర్మించారు.

గ్రామములోని వైద్యసౌకర్యాలు[మార్చు]

సామాజిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

ఈ ఆరోగ్య కేంద్రానికి, జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాల గుర్తింపు లభించినది. సదరు ధృవీకరణ పత్రాలను ఈ ఆరోగ్య కేంద్రం అధికారికి, 29-9-2020న కృష్ణా జిల్లా కలెక్టర్, 2020,సెప్టెంబరు-29న అందజేసినారు. []

వ్యవసాయం మరియూ సాగునీటి సౌకర్యాలు[మార్చు]

ఎత్తిపోతల పథకం.

పరిపాలన[మార్చు]

అవనిగడ్డ శాసనసభ[మార్చు]

అవనిగడ్డకు సంబంధించిన రాజకీయ సమాచారం కోసం క్రింద వ్యాసం చూడగలరు.

మండల పరిషత్తు స్థానాలు[మార్చు]

విడత ఎంపిపి TDPFlag.PNGతె.దే.పా YSR Congress Party Ceiling Fan.jpgవై.యస్.ఆర్.సి.పి ఇతరులు ref
2014 మే - 5 4 3 1

అవనిగడ్డ పంచాయితీ[మార్చు]

 1. ఈ గ్రామ పంచాయతీ 60 సంవత్సరాల చరిత్ర గలిగిన నియోజకవర్గం లోనే అతి పెద్దది. నియోజకవర్గం లోనే అత్యధిక ఓటర్లుగల పంచాయతీ. 60 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది.[3]

అవనిగడ్డ పంచాయితీ సర్పంచులు[మార్చు]

 1. నలుకుర్తి పృధ్వీరాజ్ 2013 జూలై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

జిల్లా పరిషత్తు[మార్చు]

అవనిగడ్డ జిల్లా పరిషత్తు అభ్యర్థులుగా పనిచేసిన వారు:-

 • కొల్లూరి వెంకటేశ్వరరావు, 2014 మే తెలుగుదేశం పార్టీ

ప్రస్తుత నాయకులు[మార్చు]

పేరు పార్టీ అదనం
TDPFlag.PNGమండలి బుద్ధ ప్రసాద్ తెలుగు దేశం ప్రస్తుత ఎంఎల్ఏ
TDPFlag.PNGఅంబటి శ్రీహరి ప్రసాద్ తెలుగు దేశం మాజీ ఎంఎల్ఏ
YSR Congress Party Ceiling Fan.jpg సింహాద్రి రమేష్ వై.యస్.ఆర్.సి.పి
మత్తి శ్రీనివాసరావు కాంగ్రెస్ న్యాయవాది

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ లంకమ్మ అమ్మవారి దేవాలయం
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం(గాలి గోపురం)
 • కృష్ణా నది
 • పులిగడ్డ అక్విడక్ట్
 • మండలి వెంకట కృష్ణా రావు వారధి (పులిగడ్డ-పెనుమూడి వంతెన)
 • గాంధీ క్షేత్రం
 • సనకా బుచ్చికోటయ్య విజ్ఞాన భవనం
 • మండల కార్యాలయం:- అవనిగడ్డ గ్రామములో ప్రస్తుత తహసీల్దారు కార్యాలయంగా ఉపయోగించుచున్న భవనం బ్రిటిషువారి కాలంలో, 1912 వ సంవత్సరంలో, రు.13,200-00 ఖర్చుతో మాత్రమే నిర్మింపబడింది. [15]
 • ఈ గ్రామంలో 1912లో బ్రిటిషువారికాలంలో నిర్మించిన స్థానిక తహసీలుదారు కార్యాలయ భవనం, నేటికీ పటిష్ఠంగా సేవలందించుచూ ఆశ్చర్యం కలిగించుచున్నది. దీనిని నిర్మించిన కాలంలోనే వారు నాటిన రావిచెట్టు గూడా, నేటికీ, పచ్చదనంతో చల్లని వాతావరణం కలిగించుచున్నది. [19]
 • శ్రీ లంకమ్మ అమ్మవారి దేవాలయం - స్థానిక శ్రీ లంకమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం, చైత్ర మాసంలో జరుగును. జాతర మొదటి రోజున అమ్మవారి గ్రామోత్సవం మొదలగును. అమ్మవారు ఆలయం నుండి పుట్టింటివారయిన పోతరాజు వంశీకుల ఇంటికి వెళ్ళి, తొలుత పసుపు, కుంకుమలు, చీరె, సారె, అందుకుని, తరువాత గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్ళి, పూజలందుకోవడం ఆచారం. గ్రామస్థులు అమ్మవారికి, వారుపోసి, టెంకాయలు, హారతులు సమర్పించెదరు. ఏడవ రోజున అమ్మవారి జాతర మహోత్సవం రోజున, ఉదయం అమ్మవారు గ్రామోత్సవం ముగించుకుని, ఆలయం వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమాల తరువాత, వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారి నెల జాతర నిర్వహించెదరు. గత నెలలో నిర్వహించిన వార్షిక జాతరలో మొక్కుబడులు చెల్లించుకొనలేని వారు, ఈ రోజున తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు.[4],[5]
 • శ్రీ కోదండరామాలయం - స్థానిక లంకమ్మ మాన్యం వద్ద కోదండరామాలయం నిర్మాణానికి 2014,మే-9,శుక్రవారం నాడు పనులు ప్రారంభించారు.ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా, 2014, జూన్-19, గురువారం నాడు, సుప్రభాతసేవ, గోపూజ నిర్వహించారు. అనంతరం హోమగుండం వద్ద, అగ్నిప్రతిష్ఠ, జలాధివాసం కార్యక్రమాలను పలువురు దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 20వ తేదీ శుక్రవారం నాడు, గోపూజ అనంతరం, శ్రీ సీతారాములు, ఆంజనేయస్వామి, గణపతి విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ధ్వజస్తంభానికి విశేషపూజలు నిర్వహించారు. 21వ తేదీ శనివారం ఉదయం, విగ్రహాలకు విశేషపూజలు నిర్వహించారు. పలువురు దంపతులు పాల్గొని హోమాలు చేసారు. సాయంత్రం విగ్రహాలకు ధాన్యాధివాసం, పుష్పాధివాసం, వస్త్రాధివాసం, శయ్యాధివాసం, పవళింపుసేవ కార్యక్రమాలు పంచాహ్నిక దీక్షతో నిర్వహించారు. ఆదివారం ఉదయం 7-45 గంటలకు విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి శ్రీ సీతారాముల కల్యాణం జరిపించి, 16 రోజులైన సందర్భంగా, 2014, జూలై-7, సోమవారం నాడు, క్షీరాభిషేకం నిర్వహించారు. 16 రోజుల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకపూజలు నిర్వహించారు.[6] & [12],[13]&[14] - నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా 2015,జూన్-5వతేదీ శుక్రవారంనాడు గ్రామోత్సవం నిర్వహించారు. 6వ తేదీ శనివారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. 7వతేదీ ఆదివారంనాడు, ఆలయంలో వివిధ అధివాసాంగ హోమాలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలకు పంచగవ్యాధివాసం, క్షీరాధివాసం, జలాధివాసం కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. 8వతేదీ సోమవారం ఉదయం 7-44 గంటలకు శ్రీ రామ, లక్ష్మణ, సీతా, ఆంజనేయస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ, వేకనూరు, అశ్వారావుపాలెం, మోదుమూడి తదితర గ్రామాల నుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [28]&[30]
 • శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి భూనీల, రాజ్యలక్ష్మీ అమ్మవారల దేవాలయం - ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోఈత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో వైభవంగా నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, శుక్ల చతుర్దశి రోజు రాత్రి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయానికి అవనిగడ్డ(పాతయెడ్లంక)గ్రామములో 53.08 ఎకరాల మెట్టభూమి, అశ్వారావుపాలెం గ్రామములో 2.18 ఎకరాల మెట్టభూమి మరియూ 3.70 ఎకరాల మాగాణిభూమి, మాన్యంగా ఉంది.[7]
 • శ్రీ రాజరాజేశ్వరీ సహిత రాజశేఖర స్వామి దేవాలయం - ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2014,మే-26 నుండి 29 వరకు నిర్వహించెదరు. 26వ తేదీ ఉదయం 8-40 గంటలకు స్వామివారిని పెళ్ళికుమారుని చేసెదరు. అమ్మవారిని పెళ్ళికుమార్తెను చేసెదరు. 27 రాత్రి 6 గంట లకు జగాజ్యోతి, అనంతరం స్వామివారి కళ్యాణం నిర్వహించెదరు. 28న రథోత్సవం మరియూ గ్రామోత్సవం నిర్వహించెదరు. 29న పవళింపుసేవతో బ్రహ్మోత్సవాలు ముగింపుకు వచ్చును. [10]
 • శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం - స్థానిక వంతెన కూడలిలో ఉన్న ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. డెల్టా ఆధునికీకరణ పనులలో ఈ ఆలయం నేలకొరగగా, నూతన ఆలయనిర్మాణం చేపట్టినారు. గుత్తేదారు ఆలయం నిర్మించెదనని ఇచ్చిన హామీ మేరకు, రు. 38 లక్షల వ్యయంతో, బలమైన ఫౌండేషనుతో, ఈ నూతన ఆలయం నిర్మించారు. 2016,ఫిబ్రవరి-25వ తేదీ గురువారంనాడు ఈ ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు ప్రారంభించి, 28వ తేదీ ఆదివారం మద్యాహ్నం 12-12కి, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో 30 వేలమందికిపైగా భక్తులు పాల్గొన్నారని అంచనా. స్థానిక గీతామందిరం ధర్మకర్త శ్రీ యర్రంశెట్టి శ్రీహరిబాబు, ఈ ఆలయానికి 27 అంగుళాల (686 మి.మీ) ఎత్తయిన పంచలోహ ప్రసన్నాంజనేయస్వామివారి ఉత్సవమూర్తిని బహూకరించారు. ఈ విగ్రహాన్ని పంచామృతాల అభిషేకాలకు, మన్యసూక్త పూజలకు ఉపయోగించెదరు. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2017,ఫిబ్రవరి-27,28 తేదీలలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, 28వతేదీ మంగళవారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో ఏకాహ్నిక దీక్షతో, స్వామివారి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం ఏర్పాటుచేసిన అన్నసమారాధనలో, పదివేలమందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలకు వివిధగ్రామాలనుండి భక్తులు విచ్చేసారు. [11],[35],[43],[44]&[49]
 • శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- స్థానిక 20వ వార్డు (తిప్పపాలెం) లో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో అభయాంజనేయస్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఏప్రిల్-27వతేదీ,బుధవారం ఉదయం 10-28 కివైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ సీతా, రామ, లక్ష్మణస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠ గూడా కన్నులపండువగా నిర్వహించారు.[46]
 • శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం - ఈ ఆలయంలో 2014,అక్టోబరు-26,ఆదివారం నాడు, ఆలయ 32వ వార్షికోత్సవం సందర్భంగా, నాగులచవితిని పురస్కరించుకొని, 4వ వార్డులోని పుట్టవద్ద, వాల్మీకిపూజ నిర్వహించారు. సోమవారం నాడు నాగులచవితి పూజలు నిర్వహించెదరు. [17]
 • శ్రీ సాయి బాబా మందిరo:- ఈ మందిరం స్థానిక 1వ వార్డులో ఉంది. ఈ మందిరాన్ని శాసనసభ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్ తండ్రి, దివంగత మండలి వెంకటకృష్ణారావు నిర్మించారు. []
 • శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయం:-అవనిగడ్డలోని మార్కెట్ రహదారిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017,జూన్-10వతేదీ శనివారంనాడు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా ఆరోజున యాగశాల ప్రవేశం, కలశపూజ, గణపతి పూజ మొదలగు కార్యక్రమాలు నిర్వహించినారు. 11,12 తేదీలలో ఆలయంలో విశేషపూజలు నిర్వహించినారు. 14వతేదీ బుధవారం ఉదయం 8-21 కి అమ్మవారి విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించినారు. అనంతరం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారు. [50]
 • శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయం.
 • గీతా మందిరం
 • శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయం - స్థానిక కొత్తపేట, 20వ వార్డులోని ఈ ఆలయ నిర్మాణానికి, 2015,మార్చ్-12వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు, శ్రీ సనకా నాంచారయ్య, పద్మావతి దంపతులు శంకుస్థాపన నిర్వహించారు. గ్రామానికి చెందిన సనకా కుటుంబీకుల కులదేవతగా ఆరాధించే ఈ అమ్మవారి ఆలయ నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో, పలువురు సనకా కుటుంబీకులు, ఆడబడుచులు పాల్గొన్నారు. [23]
 • శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం - స్థానిక కొత్తపేటలోని ఈ ఆలయాన్ని మరమ్మత్తులు చేసి పునరుద్ధరించిన సందర్భంగా, 2015,మే-24వ తేదీ ఆదివారంనాడు, ఆలయంలో గుడి సంబరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు పంపిణీచేసారు. [26]
 • శ్రీరామాలయం - ఈ పురాతన ఆలయం, కొత్తపేట అగ్రహారంలో ఉంది. ఈ ఆలయంలోని ఉత్సవ విగ్రహాలు, భద్రాచలంలోని రామాలయంలోని ఉత్సవ విగ్రహాలనుపోలి ఉన్నాయి. ఈ రెండుచోట్లా విగ్రహాలను ఒకే శిల్పి చెక్కినవిగా ఆలయ చరిత్ర చెప్పుచున్నది. ఈ విగ్రహాలను, 90 మందివేదపండితులు, శ్రీవిద్యా ఉపాసకులు ప్రతిష్ఠించినారని ఆలయపురాణం ఉవాచ. [25]
 • శ్రీ రేణుకా మావూరమ్మ అమ్మవారి ఆలయం - స్థానిక కొత్తపేటలోని భూపతి వారి కులదేవతయైన ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు, 2015,మే-30వ తేదీ శనివారంనాడు ఘనంగా ప్రారంభమైనవి. అమ్మవారిని గ్రామ పొలిమేరలోని చలువపందిరిలో ఏర్పాటుచేసి, పూజలు చేసారు. ఈ సందర్భంగా పలువురు భూపతి వంశీయులు ఆలయానికి చేరుకున్నారు. భూపతివారి ఆడపడుచులు తరలివచ్చి, మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడినది. 31వ తేదీ ఆదివారం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడంతో జాతర ఉత్సవాలు ముగింపుకు చేరుకున్నవి. [27]
 • శ్రీ రెడ్డెంకాలమ్మ అమ్మవారి ఆలయం - స్థానిక 9వ వార్డులో ఉన్న ఈ ఆలయంలో, 2015,జూన్-7వ తేదీ ఆదివారంనాడు, అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం బట్టు వారి వంశీకులు మేళతాళాలతో ఉత్సవం నిర్వహించారు. పెడన, గుంటూరు జిల్లా మంగళగిరి, భట్టిప్రోలు తదితర గ్రామాలనుండి, బట్టు వారి వంశీకులు, ఆడబడుచులు తరలివచ్చి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. [29]
 • శ్రీ సీతారామ వేదపరిషత్తు మందిరం.
 • అవనిగడ్డ కొత్తపేట గ్రామానికి చెందిన రామభక్తబృందం, గత 50 సంవత్సరాలుగా నిర్వహించుచున్న శ్రీరామస్తంభంతో, గ్రామోత్సవాన్ని, 2015,మార్చ్-28వ తేదీ, శనివారం, శ్రీరామనవమి నాడు గూడా నిర్వహించారు. గ్రామంఉలోని తూర్పు, పడమర రామాలయాలకు చెందిన రెండు రామభక్త బృందాలు, సమీపంలోని కృష్ణా నదికి, శ్రీరామస్తంభంతో వెళ్ళి, స్నానాలు ఆచరించి, స్తంభాన్ని నదిలో శుభ్రంచేసి, భజనలు చేస్తూ, గ్రామోత్సవం నిర్వహింఛినారు. [24]
 • శ్రీ రేణుకా మావూరమ్మ తల్లి ఆలయం:- స్థానిక కొత్తపేటలో అన్నపరెడ్డి వంశీకుల ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు 2016,మార్చ్-1వ తేదీ మంగళవారంనాడు ప్రారంభమైనవి. ఆ రోజున ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. రాత్రికి జాతర నిర్వహించారు. 2వతేదీ బుధవారంనాడు అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. మొదట కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి, గ్రామం ప్రారభంలో ఏర్పాటుచేసిన అమ్మవారికి పూజలు నిర్వహించారు. 3వ తేదీ గురువారంనాడు, నెల్లూరుకు చెందిన మాత ఆధ్వర్యంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పంబళ్ళు అమ్మవారి బొమ్మ (ముగ్గు) గీచి, అమ్మవారి జాతర మహోత్సవం ప్రారంభించారు. తరువాత పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్ర్మంలో అన్నపురెడ్డి వంశీకులు, ఆడపడుచులు, బంధువులు, గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. [45]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి,మినుము,మొక్కజొన్న మామిడి కాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, చేపల చెరువులు

గ్రామంలో ప్రముఖ వ్యక్తులు[మార్చు]

మండలి వెంకట కృష్ణారావు
 • శ్రీ మండలి వెంకటకృష్ణారావు:- మండలి వెంకట కృష్ణారావు గారు 'దివిసీమ గాంధీ’గా పిలువబడే వారు.మంత్రిగా పనిచేసారు.1975 రాక్షస నామ సంవత్సరం ఉగాదినాడు ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాదు‌లో ఎంతో ఘనంగా నిర్వహించడానికి నడుం బిగించా రు. ఆ మహాసభల ద్వారా ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావడంలో మండలి కృషి అనన్యం.[8]
 • శ్రీ అంబటి బ్రాహ్మణయ్య:- అంబటి బ్రాహ్మణయ్య పంచాయతీ వార్డు మెంబర్‌ స్థాయి నుండి ఎంపీ స్థాయి వరకు ఎదిగారు. 1994లో మచిలీపట్నం నియోజకవర్గం నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో మచిలీపట్నం ఎంపీగా గెలిచారు. 2009 నుండి2013 మరణించే వరకు అవనిగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగారు.[9]
  అంబటి బ్రాహ్మణయ్య
 • శ్రీ సింహాద్రి సత్యనారాయణ:- సత్యనారాయణ గారు మాడుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
 • శ్రీ డా.సింహాద్రి చంద్రశేఖరరావు:- వీరు పేరొందిన కాన్సరు శస్త్రచికిత్సా నిపుణులు
 • శ్రీ మండలి బుద్ధ ప్రసాద్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ మంత్రి, తెలుగు భాషాభిమాని. 1999,2004 లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున అవనిగడ్డ శాసనసభ్యులుగా ఎన్నికైనారు.అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతిగా ఎన్నికయ్యారు.
 • శ్రీ తాడేపల్లి శ్రీకంఠశాస్త్రి :- వీరు సంగీత సాహిత్య సుధానిధి, విద్యా ఉపాసకులు, సంగీత విద్వాంసులు. ఆకాశవాణి కళాకారులుగా సుపరిచితులు. వీరి స్వగ్రామం అవనిగడ్డ అయినా, వీరు, గత 15 సంవత్సరాలుగా గన్నవరం బ్రాహ్మణ పరిషత్తు ప్రాంతంలో నివసించుచున్నారు. వీరు ప్రఖ్యాత మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి మిత్రులు. వీరు 89 సంవత్సరాల వయస్సులో, 2015,జూన్-23వ తేదీ రాత్రి, గుంటూరులోని ఒక ఆసుపత్రిలో, అనారోగ్యంతో పరమపదించారు. [32]
 • ఈ గ్రామానికి చెందిన శ్రీ ఉప్పల ఫణీంద్ర, ఎం.యే.,బి.యి.డి., చదివి 1995 నుండి విద్యాశాఖలో పనిచేస్తున్నారు. వీరు ప్రస్తుతం ఉయ్యూరు మండలం ఆకునూరు బి.సి.కాలనీలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో పనిచేయుచున్నరు. వీరు 2014 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనారు. []
 • "వాస్తుజ్యోతిష విద్వాన్" కీ.శే. బ్రహ్మశ్రీ కవితా కామేశ్వరశర్మ:- (1916-1990). వీరు దివిసీమలో పేరొందిన వాస్తు జ్యోతిష ధర్మ శాస్త్ర కోవిదులు.
 • మహాకవి శ్రీ పాలపర్తి శ్యామలానందప్రసాదు.
 • నాటకాలలో స్త్రీ వేషధారణకు ప్రసిద్ధులైన.కీ.శే.బుఱ్ఱా సుబ్రహ్మణ్య శాస్త్రి (1936-2019).
 • శ్రీ బాసు శాయిబాబు:-బాసు శాయిబాబు గారు క్రిష్న జిల్లా కొత్తపాలెం నందు జన్మించారు .తరువాత అవనిగడ్డలో స్థిరపడినారు,వీరు ,వ్యవసాయం చేసి నివశించే వీరు దయాహ్రుదయుడు వీరు ప్రజల కొరకు ధర్మ సత్రం కట్టించినారు.దానివలన ప్రజలకు చాల ఉపకరం జరుగుతుంది.
 • పల్లవి రామిశెట్టి:తెలుగు టెలివిజన్ నటి. ఈటీవీలో వచ్చిన సీరియళ్ళ ద్వారా గుర్తింపు పొందిన పల్లవి, భార్యామణి సీరియల్ లోని పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకుంది.[10]

గ్రామ విశేషాలు[మార్చు]

దివి సీమ ఉప్పెన[మార్చు]

1977 దివిసీమ ఉప్పెన

1977 నవంబరు 19న వచ్చిన దివి సీమ తుఫాన్, ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలోని పెద్ద ప్రకృతి ఉత్పాతాలలో ఒకటి. బలమైన గాలులు, 6 అడుగుల ఎత్తు గల ఉప్పెన కారణంగా ఈ ప్రాంతంలో 20,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఒక అంచనా. 1977 నవంబరు 23లో వచ్చిన ఒక అమెరికా పత్రిక కథనం ఇలా ఉంది

.. tidal wave that followed washed away 21 villages and left 10,000 persons dead along India's battered southeast coast, officials reported Tuesday.Another 100,000 persons were reported left homeless by the weekend storm the worst to hit eastern India in more than a century.ANDHRA Pradesh State Revenue Minister P. Narasa Reddy said 10,000 bodies had been counted and at least 21 villages were completely washed away in the tidal wave that followed the cyclone. Reddy said the storm dumped upto 10 inches of rain in eight hours in some areas..

—US(Galveston Daily News)

అవనిగడ్డ క్రీడాకారులు[మార్చు]

స్థానిక ఈశ్వర్ అకాడమీకి చెందిన శ్రీ ఎం.చంద్రశేఖర్, ఎస్.ఎన్.పవన్ కుమార్, పి.గౌతంహర్ష అను తైక్వాండో క్రీడాకారులు, జాతీయస్థాయిపోటీలలో పాల్గొనడానికి అర్హత సంపాదించారు. ఇటీవల కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో నిర్వహించిన జూనియర్, సీనియర్ తైక్వాండో పోటీలలో విజయం సాధించి, వీరీ అవకాశాన్ని పొందినారు. [36]

వాతావరణం[మార్చు]

Avanigadda-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
సగటు అధిక °C (°F) 29.2 30.9 33.3 35.3 37.7 36.3 33.8 32.8 32.8 31.5 30.3 29
సగటు అల్ప °C (°F) 20.1 21.4 23.5 26.1 28 27.5 26.2 25.9 25.9 24.9 22.5 20.2
వర్షపాతం mm (inches) 12.2 12.9 26.7 12.3 36.9 97.5 190.6 177.2 180.7 230.2 127.7 20.9
Source: Meoweather [11]

బయటి లింకులు[మార్చు]

దివిసీమ దివ్వెలు[permanent dead link]

వనరులు[మార్చు]

 1. http://drgvpurnachand.blogspot.de/2013/01/bams_25.html
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Avanigadda/Avanigadda". Retrieved 26 June 2016. External link in |title= (help)
 3. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ, జులై 22, 2013., 1వ పేజీ.
 4. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-9; 3వ పేజీ
 5. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,మే-15; 2వ పేజీ.
 6. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; మే-9,2014; 1వ పేజీ.
 7. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ ; మే-13,2014; 3వ పేజీ
 8. http://aviiviannee.blogspot.de/2012/08/blog-post_4.html
 9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-06. Retrieved 2013-11-24.
 10. "Telugu television actress Pallavi status in teleserials". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-08-01.
 11. Meoweather

[12] ఈనాడు అమరావతి;2020,సెప్టెంబరు-30;5వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=అవనిగడ్డ&oldid=3279774" నుండి వెలికితీశారు