మోదుమూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోదుమూడి
—  రెవిన్యూ గ్రామం  —
మోదుమూడి is located in Andhra Pradesh
మోదుమూడి
మోదుమూడి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°01′06″N 80°56′25″E / 16.018251°N 80.940167°E / 16.018251; 80.940167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 4,256
 - పురుషులు 2,280
 - స్త్రీలు 2,218
 - గృహాల సంఖ్య 1,269
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

"మోదుమూడి", కృష్ణాజిల్లా, అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 121., ఎస్.టి.డి.కోడ్ = 08671. [1]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు.

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో మాచవరం, అవనిగడ్డ, మోపిదేవిలంక, చిరువోలులంక ఉత్తరం, మోపిదేవి గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, చల్లపల్లి,కోడూరు (కృష్ణా)

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: రేపల్లె, తెనాలి, గుంటూరు 67 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, మోదుమూడి.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం[మార్చు]

అవనిగడ్డ మండలంలోని అశ్వరావుపాలెం, మోదుమూడి, వేకనూరు, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను, సుమారు 8 సంవత్సరాల క్రితం, అవనిగడ్డ సంఘంలో విలీనం చేసారు. [9]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామానికి చెందిన శ్రీ సింగం బసవపూర్ణయ్య, గ్రామంలోని ఎస్.సి.కాలనీవాసుల త్రాగునీటి అవసరాలను తీర్చేటందుకు వితరణగా అందించిన రెండు సెంట్లస్థలంలో ట్యాంకు నిర్మించి వారికి త్రాగునీరు అందించుచున్నారు. [8]

గ్రామీణ పశుగణాభివృద్ధి కేంద్రం[మార్చు]

మోదుమూడి గ్రామానికి చెందిన సంఘసేవకుడు శ్రీ తోట శ్యాం కుమార్ నాయుడు, తన తాత శ్రీ తోట శ్యామలయ్య, నాయనమ్మ శ్రీమతి సరస్వతమ్మల ఙాపకార్ధం, గ్రామంలో పశువైద్యశాల నిర్మాణానికి 8 సెంట్ల స్థలాన్ని వితరణ చేసారు. 2009 లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. రు. ఆరు లక్షలతో భవన నిర్మాణం పూర్తి అయినది. కానీ ఇంతవరకు పశువైద్యశాల ప్రారంభం కాలేదు. ఈ కేంద్రం ప్రారంభమయినచో మోదుమూడి గ్రామానికేగాక, చుట్టుప్రక్కల గ్రామాలయిన రామచంద్రాపురం, రామకోటిపురం, నలందపాలెం, సర్దాకోడు గ్రామాలకు చెందిన 14,000 పశువులకు ఈ కేంద్రం వైద్యసౌకర్యం అందించగలదు. [6]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

కోనేరు ఊరచెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి తోట వెంకటనాగలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు.[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామాలయం[మార్చు]

మోదుమూడి గ్రామంలోని శ్రీ కోదండరామాలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి వేడుకలు, ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ఐదవరోజూన స్వామివారిని వివిధరకాల పుష్పాలతో అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [2]

శ్రీ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారికి 1-10-2013 న సప్తసప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించెదరు. ఈ మూడురోజులలోనూ, ప్రతిరోజూ, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, సింధూరపూజలు, నాగవల్లీ అర్చనలు నిర్వహించెదరు.మూడవ రోజున భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]

ఈ ఆలయ స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని, 2015, ఫిబ్రవరి-24వ తేదీ మంగళవారం నాడు, ఆలయంలో అష్ట కలశ స్నపన నిర్వహించారు. వివిధ రకాలైన లక్ష పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోపూజ అనంతరం, శాంతిహోమాన్ని నిర్వహించారు. బుధవారంనాడు నవకలశస్నపన నిర్వహించారు. స్వామివారికి నాగవల్లీపత్ర పూజ నిర్వహించారు. ఆలయప్రాంగణంలో గోపూజ చేసి, అనంతరం శాంతిహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. నాలుగురోజులుగా నిర్వహించుచున్న ఈ కార్యక్రమాలు, 26వ తేదీ గురువారంతో ముగింపుకు చేరుకున్నవి. [7]

శ్రీ వేలమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక మహోత్సవం, 2014, జూన్-13, శుక్రవారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. మేళతాళాలతో డప్పువాద్యాలతో, కళాకారులు చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నవి. ఆలయంవద్ద అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని పలువురు మహిళలు వేలమ్మ తల్లికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పోతురాజుస్వామి జాతర మహోత్సవాన్ని నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. [4]

శ్రీ ఆదిశేష ఆలయం[మార్చు]

మోదుమూడి గ్రామశివారు మర్రిచెట్టు ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయంలో, 2014, జూన్-24, మంగళవారం నాడు, స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడినది. స్వామిని దర్శించుకొనడానికి వచ్చిన భక్తులు, బారులు తీరినారు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. [5]

శ్రీ ఙాని చిన్నమ్మ ఆశ్రమం[మార్చు]

ఈ ఆశ్రమాన్ని 20 సంవత్సరాల క్రితం ఏర్పరచారు. ఈ ఆశ్రమ నిర్వాహకులు శ్రీ గరికపాటి తత్వానంద, 84 సంవత్సరాల వయస్సులో, 2016, మే-14వ తేదీ శనివారంనాడు శివైక్యం చెందినారు. [10]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి,మినుము,మొక్కజొన్న

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4498.[4] ఇందులో పురుషుల సంఖ్య 2280, స్త్రీల సంఖ్య 2218, గ్రామంలో నివాస గృహాలు 1269 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1376 హెక్టారులు.

జనాభా (2001) - మొత్తం 4,498 - పురుషుల సంఖ్య 2,280 - స్త్రీల సంఖ్య 2,218 - గృహాల సంఖ్య 1,269

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Avanigadda/Modumudi". Retrieved 26 June 2016. External link in |title= (help)
  3. ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; జనవరి-7,2014; 1వ పేజీ.
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014;ఏప్రిల్-13; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మే-28; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-14; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014 జూన్-25; 2వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-8; 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఫిబ్రవరి-24,25&27. [8] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-1; 43వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-7; 44వపేజీ. [10] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, మే-15; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మోదుమూడి&oldid=2864190" నుండి వెలికితీశారు