వేకనూరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేకనూరు
—  రెవిన్యూ గ్రామం  —
వేకనూరు is located in Andhra Pradesh
వేకనూరు
వేకనూరు
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°58′50″N 80°55′25″E / 15.980693°N 80.923539°E / 15.980693; 80.923539
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం అవనిగడ్డ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,963
 - పురుషులు 2,548
 - స్త్రీలు 2,415
 - గృహాల సంఖ్య 1,471
పిన్ కోడ్ 521121
ఎస్.టి.డి కోడ్ 08671

వేకనూరు, కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 121., యస్.టీ.డీ.కోడ్= 08671. [1]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో నాగాయలంక, మోదుమూడి, అవనిగడ్డ, మాచవరం, మోపిదేవి లంక గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

మోపిదేవి, నాగాయలంక, రేపల్లె, కోడూరు

గ్రామ పంచాయతీ[మార్చు]

గాజులవారిపాలెం, గుడివాకవారిపాలెం గ్రామాలు, వేకనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని శివారు గ్రామాలు.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

వైద్య సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

అవనిగడ్డ, నాగాయలంక నుండి రోడ్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 67 కి.మీ

గ్రామానికి సాగు/త్రాగు నీటి సౌకర్యం[మార్చు]

దేవుడి చెరువు.

గ్రామములోని మౌలిక సదుపాయములు[మార్చు]

గ్రామములోని ఉత్పత్తులు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, మినుము, మొక్కజొన్న

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ఉషా పద్మినీ సమేత సూర్యనారాయణ స్వామి వారి ఆలయం[మార్చు]

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో, వేద పండితుల ఆధ్వర్యంలో, స్వామివారి శాంతి కళ్యాణం ఆగమ పండితులు, ఋత్విక్కుల మంత్రాలతో, మంగళ వాయిద్యాల నడుమ నయనానందకరంగా నిర్వహించారు.

శ్రీ గంగా పార్వతీ సమేత ఉభయ ముక్తేశ్వరస్వామి ఆలయం[మార్చు]

ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ముందు రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించెదరు. శివరాత్రి రోజున శివపార్వతుల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించెదరు. తరువాత భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.[3]

శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయం[మార్చు]

వేకనూరు గ్రామములో ఒక కోటి రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన అంకాలమ్మ తల్లి అలయంలో, 2020,నవంబరు-30వతేదీ సోమవారంనాడు, విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించినారు. ఆలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తయిన ధ్వజస్థంభం, పోతురాజుస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించినారు. ఈ సందర్భంగా, విచ్చేసిన భక్తులకు, పాఠశాలలో అన్నప్రసాద వితరణ నిర్వహించినారు. [1]

శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి ఆరాధనోత్సవాలు, నిర్వహించారు. ఈ కార్యక్రమాల కొరకై ఆలయంలో భక్తుల సౌకర్యార్ధమై, చలువ పందిళ్ళు వేసినారు. ఆలయాన్ని రంగు రంగుల విద్యుద్దీపాలతో అందముగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5429.[4] ఇందులో పురుషుల సంఖ్య 2755, స్త్రీల సంఖ్య 2674, గ్రామంలో నివాస గృహాలు 1481 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1524 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 4,963 - పురుషుల సంఖ్య 2,548 - స్త్రీల సంఖ్య 2,415 - గృహాల సంఖ్య 1,471

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Avanigadda/Vekanuru". Retrieved 26 June 2016. External link in |title= (help)
  3. కృష్ణా/అవనిగడ్డ, 9-9-13, 1వ పేజీ: 5-10-13,2వ పేజీ.
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి;2020,డిసెంబరు-1,5వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=వేకనూరు&oldid=3229078" నుండి వెలికితీశారు