పులిగడ్డ
పులిగడ్డ | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°03′12″N 80°54′48″E / 16.053330°N 80.913299°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | అవనిగడ్డ |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి మండలి లక్ష్మి |
జనాభా (2011) | |
- మొత్తం | 3,350 |
- పురుషులు | 1,900 |
- స్త్రీలు | 1,450 |
- గృహాల సంఖ్య | 921 |
పిన్ కోడ్ | 521121 |
ఎస్.టి.డి కోడ్ | 08671 |
పులిగడ్డ, కృష్ణా జిల్లా, అవనిగడ్డ మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 121. ఎస్.టీ.డీ.కోడ్ = 08671. [1]
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[2] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
ఈ గ్రామానికి సమీపంలో అవనిగడ్డ, మోపిదేవి, మోపిదేవిలంక, మోదుమూడి, అశ్వారావుపాలెం గ్రామాలు ఉన్నాయి.
సమీప మండలాలు[మార్చు]
అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, బట్టిప్రోలు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
అవనిగడ్డ, మోపిదేవి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: గుంటూరు 61కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
- మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పల్లెపాలెం.
- సి.బి.సి.ఎన్.సి.పాఠశాల, పాతకోట.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
దుర్గమ్మ చెరువు[మార్చు]
ప్రభుత్వ ఉపాధి హామీ పథకంలో భాగంగా, నీటి అవసరాలకోసం, భూగర్భ జలాల అభివృద్ధికోసం, ఈ చెరువులో, 2016, ఏప్రిల్-26వ తేదీనాడు, 1.7లక్షల రూపాయల అంచనా వ్యయంతో, పూడికతీత పనులు చేపట్టినారు. [19]
ఎత్తిపోతల పథకం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి మండలి లక్ష్మి 101 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉపసర్పంచిగా శ్రీ మురాల నాగశంకరరావు ఎన్నికైనారు. [2]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
చోళరాజుల కాలంనాటి ఈ ఆలయంలో ఉగాది, దసరా, ధనుర్మాస ఉత్సవాలతోపాటు, స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుపుతారు. తిరుమల తరహాలో ఇక్కడ గూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కలియుగదైవం అయిన ఇక్కడి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొనడానికి, జిల్లా నలుమూలలనుండి భక్తులు విచ్చేస్తుంటారు. ఈ ఆలయంలో నిర్మిస్తున్న నూతన రాజగోపురం, యాగశాల నిర్మాణం పూర్తయినది. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు రు.36.19 లక్షలు, గ్రామస్థుల విరాళం 6.25 లక్షల రూపాయలతో, నూతన రాజగోపురం, తలంబ్రాల కళ్యాణ మండపం, గర్భాలయ మరమ్మత్తు పనులు చేపట్టి పూర్తి చేశారు. నూతన రాజగోపురానికి శిల్పాలు అమర్చి, రంగులు దిద్దినారు. ఆలయం చుట్టూ ప్రహరీగోడ నిర్మించారు. [3]&[6]
నూతన రాజగోపురాన్ని 3 అంతస్తులతో నిర్మించారు. రాజగోపురంపై శిఖరాలతోపాటు వివిధ రకాల ఆకృతులు గలిగిన, శిల్పకళ ఉట్టిపడేలాగా శిల్పాలను అమర్చి రంగులు దిద్దినారు. ఆలయంలో నూతన తలంబ్రాల కళ్యాణమండపం నిర్మించి రంగులద్దినారు. ఆలయం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించి, ముందుభాగాన శిల్పాలను ఏర్పాటుచేసారు. చోళరాజుల కాలంనాటి ఈ ఆలయంలో ప్రతి శనివారం భక్తులు స్వామివారిని దర్శించుకొనడానికి బారులు తీరుతారు. ఆలయంలో ఉగాది ఉత్సవాలు పెద్దయెత్తున నిర్వహించడం ఆనవాయితీ. [16]
నూతన రాజగోపుర ప్రతిష్ఠా మహోత్సవాలు, 2016, ఫిబ్రవరి-23వ తేదీ మాఘ బహుళ పాడ్యమి మంగళవారం నుండి ప్రారంభించి, 25వ తేదీనాడు ప్రతిష్ఠించారు. 23వ తేదీ సాయంత్రం విష్వక్సేనపూజ, దీపారాధన, దీక్షా, మృత్య సంగ్రహణం, అంకురార్పణ, కర్పూర నీరాజనం, 24వ తేదీనాడు పంచగవ్యారాధన, పంచగవ్యప్రాశన, అగ్నిప్రతిష్ఠ, వాస్తుహోమం, 25వ తేదీనాడు అగ్నిగుండంలో ఉత్తహోమాలు, రత్నన్యాసం, యంత్రప్రతిష్ఠాపన, రాజగోపుర, ప్రతి శిఖర ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు. [18]
గ్రామదేవత శ్రీ పోలాశమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]
పులిగడ్డ గ్రామంలో వేంచేసియున్న గ్రామదేవత శ్రీ పోలాశమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రతి సంవత్సరం (మే నెలలో) వైశాఖ శుక్ల పౌర్ణమి నుండి ప్రారంభం చేసెదరు. ఈ కార్యక్రమానికై ఆలయం ముంగిట, భక్తుల సౌకర్యార్ధం, చలువ పందిళ్ళు వేయుదురు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించెదరు. పౌర్ణమి రోజు ఉదయం 6 గంటలకు అమ్మవారు అఖండ నదీ స్నానానికి తరలి వెళ్ళెదరు. అనంతరం పోతురాజు సంబరం నిర్వహించెదరు. సాయంత్రం మూడు గంటల నుండి అమ్మవారికి గ్రామోత్సవం ప్రారంభించి, మరుసటిరోజు (బహుళ పాడ్యమి) కి అమ్మవారు ఆలయ ప్రవేశం అనంతరం గుడి సంబరం జరుపుతారు. అనంతరం ఆషాఢమాసంలో బహుళ పక్షంలో ఆదివారంనాడు, అమ్మవారి నెలసంబరం నిర్వహించెదరు. [4]&[12]
శ్రీ అంకమ్మ అమ్మవారి ఆలయం, గౌడపాలెం[మార్చు]
పులిగడ్డ గ్రామ శివారు, గౌడపాలెంలో వేంచేసియున అంకమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు, 2015, మే నెల-10వతేదీ, ఆదివారంనాడు వైభవంగా ప్రారంభమైనవి. అమ్మవారి శిలాప్రతిమలను కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేయించి, మేళతాళాలతో ఆలయానికి తీసికొనివచ్చి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోమవారం నాడు, అమ్మవారికి నైవేద్యాలు, మొక్కుబడులు, గుడిసంబరాలు నిర్వహించెదరు. [10]
శ్రీ కనకదుర్గాదేవి ఆలయం[మార్చు]
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]
శ్రీ రామాలయం, పల్లెపాలెం[మార్చు]
పులిగడ్డ గ్రామశివారు పల్లెపాలెంలోని మత్స్యకారుల కాలనీలో, శిథిలమైన పురాతన రామాలయం స్థానంలో నూతన ఆలయం నిర్మించడానికి గ్రామస్థులు ముందుకు వచ్చారు. 2016 జూలైలో రానున్న కృష్ణా పుష్కరాలలోగా నూతన ఆలయాన్ని ప్రారంభించే దిశగా ముందుకు సాగుచున్నారు. ఈ క్రమంలో, 2015, నవంబరు-13వ తేదీ శుక్రవారంనాడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. [14]&[15]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
- కోకా విమలకుమారి - రచయిత్రి
గ్రామ చారిత్రిక విశేషాలు[మార్చు]
పురాతన ఎత్తిపోతల పథకo[మార్చు]
పులిగడ్డ గ్రామ శివారు పాతకోటలో, బ్రిటిషుకాలంలో 1904లో నిర్మించిన పురాతన ఎత్తిపోతల ప్రాచీన కట్టడం ఒకటి ఉంది. దివిసీమలో సాగునీరు అందించడం కోసం, బ్రిటిష్ పాలకులు కరవుకాలువను త్రవ్వి, ఎత్తిపోతలద్వారా కృష్ణానదిలోని నీటిని కాలువలోనికి మళ్ళించి, పంటలు పండించడానికి ఏర్పాటుచేసారు. నీటిని లిఫ్టు చేయడానికి వినియోగించడానికి ఉపయోగించిన ఇనుముగానీ, షట్టర్లుగానీ నేటికీ తుప్పుపట్టలేదంటే, నాటి ఇంజనీర్ల నైపుణ్యం, నాణ్యతా ప్రమాణాలు నేటి ఇంజనీర్లకు ఆదర్శవంతంగా ఉన్నాయి. 1936లో క్యాంప్ బెల్ ఆక్విడెక్ట్ నిర్మాణం తరువాత, ఈ ఎత్తిపోతల పథక వినియోగాన్ని నిలిపివేసినారు. [17]
ఇది పాతబడిపోయి, శిథిలమయ్యే ప్రమాదం ఉండటంతో, దీనిని పురావస్తు శాఖవారు తమ అధీనంలోనికి తీసుకొని, ఫిబ్రవరి-2014లో రు. 22.5 లక్షల వ్యయంతో ఈ కట్టడానికి పరిరక్షణ పనులు చేపట్టినారు. కట్టడం కుడి, ఎడమలలో పూడిక తీయించారు. కట్టడం షట్టర్లను తిరిగి పనిచేసే స్థితికి తెచ్చారు. కట్టడం చుట్టూ సిమెంటుదిమ్మలు పాతి, రంగులద్ది, ఫెన్సింగు వేసి, ముందుభాగంలో నాపరాయి పరచి, సందర్శకులు వీక్షించేటట్లుగా గేటును ఏర్పాటు చేసారు. ప్రస్తుతం గూడా ఈ పథకం పనిచేయడం విశేషం. కాలువలో నీరు ఎక్కువగా ఉండి, గట్లు తెగిపోయేటట్లుగా ఉంటే, దివి ప్రధాన కాలువకు ఉన్న షట్టరు తెరిచి, నీటిని కృష్ణానదిలోనికి వదలివేయడానికి, ఈ షట్టరును వినియోగించెదరు. ఇటువంటి అపురూపమైన కట్టడం, పురావస్తుశాఖవారు తమ ఆధీనంలోనికి తీసుకొని పరిరక్షించి, భావితరాలకు ఒక గొప్ప అపురూపమైన కట్టడంగా చూపించటానికి చేసిన ప్రయత్నం జిల్లాకే వన్నె తెచ్చే విధంగా ఉంది. [5]&[11]
క్యాంప్ బెల్ ఆక్విడక్ట్[మార్చు]
ఈ గ్రామంలో, 1936లో, దివిసీమకు నీరందించటానికి, నాటి పాలకులు కృష్ణా నదిపై "క్యాంప్ బెల్ ఆక్విడక్ట్" (అక్కిలేరు) ను నిర్మించారు. ఇది ప్రత్యేకతను సంతరించుకొనుచున్నది. సాగునీరు అందించే నీటి ప్రాజెక్టుగా, దివిసీమను సస్యశ్యామలంగా చేయడంతోపాటు, రహదారిగా గూడా ఉపయోగపడుచున్నది. [8]
సబ్ డివిజన్ కార్యాలయభవనo[మార్చు]
ఈ గ్రామంలో నీటిపారుదలశాఖ సబ్ డివిజన్ కార్యాలయభవనాన్ని బ్రిటిషు కాలంలో, 1910 లో నిర్మించారు. భవన నిర్మాణ వ్యయం=రు. 11,800. ఆ భవనం శిథిలమవడంతో, డెల్టా ఆధునికీకరణ పనులలో భాగంగా, నూతన కార్యాలయాన్ని నిర్మించి రంగులద్దినారు. ఈ కార్యాలయంలోనికి సబ్-డివిజన్ కార్యాలయంతోపాటు, ప్రధాన పనుల కార్యాలయాన్ని గూడా ఏర్పాటు చేస్తున్నారు. [7]&[8]
అతిధి గృహం[మార్చు]
ఈ గ్రామంలో నీటిపారుదలశాఖ అతిథి గృహం, 1906లో, రు. 9,800-00 ల వ్యయంతో నిర్మాణమయినది. [8]
దివిటీ స్థంభం[మార్చు]
పులిగడ్డ నీటిపారుదలశాఖ అతిథిగృహం సమీపంలో కృష్ణా నది కరకట్టకు ఆనుకుని 1903 వ సంవత్సరంలో నిర్మించిన దివిటీస్తంభం (వెలుగులు విరజిమ్మే కాగడాలు పెట్టే ఎత్తయిన దిమ్మ) నేటికీ చెక్కుచెదరక వీక్షకులను అబ్బురపరచుచున్నవి. కృష్ణానది పాయలో నీటిమట్టం, కొలతలు తీసికొనడానికి, కృష్ణానదికి ఇరువైపులా కరకట్ట వెంబడి, ఐదు మైళ్ళు (8 కి.మీ) కు ఒకటి చొప్పున వీటిని నిర్మించారు. వరదలు వచ్చిన సందర్భాలలో ఈ స్థూపాలపై దివిటీలు పెట్టి కాపలాలు కాసేవారని, నీటి ప్రవాహం, వేగం, నీటిమట్టాలను బట్టి ప్రజలకు వరద హెచ్చరికలు చేసేవారని తెలియుచున్నది. [9]
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామానికి చెందిన శ్రీ సింగోతు విజయకుమార్, 2015, సెప్టెంబరు-9 నుండు 13 వరకు, కొత్తఢిల్లీలోని ఎన్.ఎస్.గేట్ వే క్రికెట్ మైదానంలో నిర్వహించు జాతీయస్థాయి 20-20 క్రికెట్ జట్టులో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో పాల్గొనడానికి అర్హత సంపాదించాడు. [13]
గణాంకాలు[మార్చు]
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3215.[3] ఇందులో పురుషుల సంఖ్య 1793, స్త్రీల సంఖ్య 1422, గ్రామంలో నివాస గృహాలు 746 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1023 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 3,350 - పురుషుల సంఖ్య 1,900 - స్త్రీల సంఖ్య 1,450 - గృహాల సంఖ్య 921
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2014-07-18 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Avanigadda/Puligadda". Archived from the original on 16 ఏప్రిల్ 2018. Retrieved 26 June 2016. Check date values in:
|archive-date=
(help); External link in|title=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.
వెలుపలి లంకెలు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగస్టు-1; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జనవరి-9; 2వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014, మే-14; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూలై-7; 1వపేజీ. [6] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూలై-31; 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-9; 3వపేజీ. [8] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, ఆగస్టు-15; 2వపేజీ. [9] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, సెప్టెంబరు-30; 2వపేజీ. [10] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, మే-11; 1వపేజీ. [11] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-2; 1వపేజీ. [12] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, జూన్-22; 1వపేజీ. [13] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, ఆగస్టు-31; 2వపేజీ. [14] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015, సెప్టెంబరు-24; 1వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-14; 39వపేజీ. [16] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-7; 39వపేజీ. [17] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-8; 40వపేజీ. [18] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఫిబ్రవరి-21&26. [19] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2016, ఏప్రిల్-27; 3వపేజీ.