పల్లవి రామిశెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లవి రామిశెట్టి
Pallavi in aadade aadaram.png
జననంఅక్టోబరు 11, 1993
జాతీయతభారతీయురాలు
వృత్తితెలుగు టెలివిజన్ నటి
జీవిత భాగస్వాములుదిలీప్ కుమార్

పల్లవి రామిశెట్టి తెలుగు టెలివిజన్ నటి. ఈటీవీలో వచ్చిన సీరియళ్ళ ద్వారా గుర్తింపు పొందిన పల్లవి, భార్యామణి సీరియల్‌లోని పాత్రకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు అందుకుంది.[1]

జీవిత విషయాలు[మార్చు]

పల్లవి 1993, అక్టోబరు 11న కృష్ణా జిల్లా, అవనిగడ్డలో జన్మించింది. తండ్రి ఉద్యోరిత్యా కుటుంబంతో కొంతకాలం బెంగళూరుకు వెళ్ళింది. ఆ తరువాత హైదరాబాదుకు వచ్చి, ఉప్పల్ లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 10వ తరగతి వరకు చదివింది. 2019లో దిలీప్ కుమార్‌తో పల్లవి వివాహం జరిగింది.[2]

టివిరంగం[మార్చు]

10వ తరగతి చదువుతున్న సమయంలో ఈటివి ఆడిషన్స్‌కు వెళ్ళింది. ఈటివిలో వచ్చిన రంగుల కళ కార్యక్రమంకి వ్యాఖ్యాతగా ఎంపికై, టీవీరంగంలోకి ప్రవేశించింది.[3][4] ఆ తరువాత నటిగా సీరియళ్ళలో నటించింది. భార్యామణి సీరియల్‌లో అలేఖ్య పాత్రలో, ఆడదే ఆధారం సీరియల్‌లో అమృత పాత్రలో నటించింది.

సీరియళ్ళు[మార్చు]

  • భార్యామణి
  • ఆడదే ఆధారం
  • వసుంధర
  • మాటే మంత్రము
  • అత్తారింటికి దారేది

కార్యక్రమాలు[మార్చు]

అవార్డులు[మార్చు]

  1. ఉత్తమ సహాయ నటి - టివి నంది అవార్డు (భార్యామణి)

మూలాలు[మార్చు]

  1. "Telugu television actress Pallavi status in teleserials". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2020-07-31.
  2. Celebrity Wikis, Television Actress (13 March 2020). "Pallavi Ramisetty Bio". www.celebritywikis.com. Retrieved 31 July 2020. CS1 maint: discouraged parameter (link)
  3. "Pallavi is a big fan of Suriya - Times of India". The Times of India. Retrieved 2020-07-31.
  4. "New show 'Maate Mantramu', starring Ali Reza and Pallavi to begin from tonight - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-07-31.

ఇతర లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పల్లవి రామిశెట్టి పేజీ