Jump to content

సింహాద్రి రమేష్ బాబు

వికీపీడియా నుండి
సింహాద్రి రమేశ్ బాబు
సింహాద్రి రమేష్ బాబు


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు మండలి బుద్ధప్రసాద్
నియోజకవర్గం అవనిగడ్డ నియోజవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 22 జులై 1956
బందలాయిచెరువు, అవనిగడ్డ, కృష్ణా జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, భారతి
జీవిత భాగస్వామి కెప్టెన్‌ లక్ష్మి
సంతానం వికాస్‌, ఉజ్వల, సహజ, నిశ్చల

సింహాద్రి రమేష్‌బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సింహాద్రి రమేశ్ బాబు 22 జులై 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, అవనిగడ్డ, బందలాయిచెరువు గ్రామంలో వెంకటేశ్వరరావు, భారతి దంపతులకు జన్మించాడు.[3] ఆయన బీఏ వరకు చదువుకున్నాడు.[4]

రాజకీయ జీవితం

[మార్చు]

సింహాద్రి రమేశ్ బాబు కమ్యూనిస్టు పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజవర్గం నుండి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. రమేశ్ బాబు 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ చేతిలో ఓడిపోయాడు. సింహాద్రి రమేశ్ బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పై 20,725 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  3. Andhrajyothy (18 April 2024). "ఊరు చిన్నదే.. అందరూ రాజకీయ ఉద్ధండులే." Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
  4. Sakshi (18 March 2019). "కృష్ణా జిల్లా ...వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల వివరాలు". Archived from the original on 21 March 2019. Retrieved 22 December 2021.
  5. Sakshi (24 May 2019). "చరిత్ర సృష్టించిన సింహాద్రి". Archived from the original on 10 June 2019. Retrieved 22 December 2021.