ఇబ్రహీంపట్నం (కృష్ణా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇబ్రహీంపట్నం (కృష్ణా)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ఇబ్రహీంపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి అజ్మీరా స్వర్ణ
జనాభా (2011)
 - మొత్తం 29,432
 - పురుషుల సంఖ్య 13,690
 - స్త్రీల సంఖ్య 15,742
 - గృహాల సంఖ్య 5,572
పిన్ కోడ్ 521 456
ఎస్.టి.డి కోడ్ 0866

ఇబ్రహీంపట్నం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 521 456. యస్.టీ.డీ.కోడ్ = 0866.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

[1] గుంటుపల్లి 4 కి.మీ, తేలప్రోలు 4 కి.మీ, బత్తినపాడు 5 కి.మీ, రాయనపాడు 6 కి.మీ, కొండపల్లి 7 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

జి.కొండూరు, తుళ్ళూరు, విజయవాడ, తాడేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఇబ్రహీంపట్నం, కొండపల్లి నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 17 కి.మీ

గ్రామములోని విద్యాసౌకర్యాలు[మార్చు]

  1. A.A.I.M.S:- ఇబ్రహీంపట్నం కృష్ణానదీ శివారు ప్రాంతంలో, 2017,జూన్-14న అమరావతి అమెరికన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (A.A.I.M.S) స్థాపనకు శంఖుస్థాపన నిర్వహించెదరు. [8]
  2. జాకీర్ హుస్సేన్ కళాశాల.
  3. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ వై.వి.నారాయణరావు, ఇటీవల బీహరు రాష్ట్ర బాల్ బ్యాడ్ మింటన్ అసోసిసియేషన్ నిర్వహించిన పోటీలలో రిఫరీగా వ్యవహరించి, మన్ననలు పొంది, జాతీయస్థాయి రిఫరీగా ఎంపికైనారు. వీరు 2016,జనవరి-10 నుండి తెలంగాణా రాష్ట్రంలో నిర్వహించు సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలలో రిఫరీగా వ్యవహరించెదరు. [4]
  4. గిరిజన బాలుర వసతి గృహం.
  5. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ప్రసాదునగర్.
  6. అన్నమ్మ బధిరుల పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, ఈ వైద్యశాలను కృష్ణా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ వైద్యశాల వైద్యులు శ్రీమతి పద్మావతి, ఈ పురస్కారాన్ని, 2017,ఏప్రిల్-7న విజయవాడలో, కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడు చేతులమీదుగా అందుకున్నారు. [5]

బ్యాంకులు[మార్చు]

ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం. 0866/2882268.

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గజరాజు చెరువు.

గ్రామ పంచాయితీ[మార్చు]

  1. 20 వార్డులున్న ఈ గ్రామ పంచాయతీ ఏర్పడిన తొలిరోజులలో శ్రీమతి ఆవుల స్వరాజ్యలక్ష్మి 5 నెలలు ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. 2001 లో శ్రీమతి జోగి నాగమణి, 2006 లో శ్రీ మల్లెల అనంతపద్మనాభరావు ఈ గ్రామానికి సర్పంచులుగా ఎన్నికైనారు. [2]
  2. 2013 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి అజ్మీరా స్వర్ణ సర్పంచిగా గెలుపొందారు. ఉపసర్పంచిగా శ్రీమతి కనకదుర్గ ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక ఏ-కాలనీలోని ఈ ఆలయంలో, 2017,జూన్-15వతేదీ గురువారంనాడు, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా, స్వామివారికి గరుడోత్సవ సేవలు నిర్వహించినారు. శుక్రవారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, పూర్ణాహుతి నిర్వహించినారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా, మద్యాహ్నం సమయంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించుచున్నారు. [9]

శ్రీ అభయసాయి మందిరం[మార్చు]

ఈ ఆలయం స్థానిక ఎ-కాలనీలో ఉంది.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఆలయం స్థానిక ఎ-కాలనీలో ఉంది.

శ్రీ అంకమ్మతల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయం స్థానిక ఫెర్రీ వద్ద ఉంది.

శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం మరియు శ్రీ నరసింహస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామములోని శ్రీ అంకమ్మ తల్లి ఆలయ ఆవరణలో నెలకొనియున్న ఈ ఆలయాలలో గ్రామస్థులు ధ్వజస్తంభాలు ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, తొలుత 2017,మే-26వతేదీ శుక్రవారంనాడు, శ్రీ అంకమ్మ తల్లికి కొలుపులు నిర్వహించారు మరియు గ్రామోత్సవం నిర్వహించారు. [7]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయాధారిత వృత్తులు .

గ్రామ ప్రముఖులు[మార్చు]

కీ.శే.ఆచంట వెంకటరత్నం నాయుడు, పౌరాణిక కళాకారుడు.

గ్రామ విశేషాలు[మార్చు]

గన్నవరానికి చెందిన నిడమర్తి నానితావర్మ అను విద్యార్థిని, స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి చదువుచున్నది. ఈమె 2017,మార్చి‌లో "నాసా" నిర్వహించిన ఒక పరీక్ష వ్రాసి, అర్హత సాధించి 2017,మే నెలలో అమెరికా వళ్ళి, అక్కడ నాసాలో "ప్రపంచంపై కాలుష్యం ప్రభావం" అను అంశంపై మాట్లాడబోవుచున్నది. [6]

గ్రామ జనాభా[మార్చు]

జనసంఖ్య (2011) -మొత్తం 29432 -పురుషులు 13690 -స్త్రీలు 15742 -గృహాలు 5572 -అక్షరాస్యులు 20673
జనాభా (2001) -మొత్తం 91245 -పురుషులు 46772 -స్త్రీలు 44482


ఇబ్రహీంపట్నం
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో ఇబ్రహీంపట్నం మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో ఇబ్రహీంపట్నం మండలం యొక్క స్థానము
ఇబ్రహీంపట్నం is located in ఆంధ్ర ప్రదేశ్
ఇబ్రహీంపట్నం
ఆంధ్రప్రదేశ్ పటములో ఇబ్రహీంపట్నం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°36′20″N 80°22′43″E / 16.605597°N 80.378666°E / 16.605597; 80.378666
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము ఇబ్రహీంపట్నం
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 91,245
 - పురుషులు 46,772
 - స్త్రీలు 44,482
అక్షరాస్యత (2001)
 - మొత్తం 71.09%
 - పురుషులు 77.96%
 - స్త్రీలు 63.85%
పిన్ కోడ్ 521456

మండలంలోని గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా పట్టిక:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. చిలుకూరు 250 996 513 483
2. దాములూరు 471 1,814 940 874
3. ఈలప్రోలు 517 1,955 1,000 955
4. గుంటుపల్లి 2,783 12,011 6,088 5,923
5. ఇబ్రహీంపట్నం 5,572 22,020 11,116 10,904
6. జూపూడి 1,098 4,234 2,147 2,087
7. కాచవరం 621 2,551 1,330 1,221
8. కెతనకొండ 890 4,627 2,440 2,187
9. కొండపల్లి 6,938 29,868 15,347 14,521
10. కోటికలపూడి 666 2,752 1,404 1,348
11. మల్కాపురం 216 800 410 390
12. మూలపాడు 998 4,073 2,135 1,938
13. త్రిలోచనపురం 261 1,030 552 478
14. తుమ్మలపాలెం 592 2,413 1,274 1,139
15. జామి మాచవరం 24 110 76 34

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,జులై-15; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/మైలవరం; 2013,ఆగస్టు-17; 1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016,జనవరి-9; 32వపేజీ. [5] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఏప్రిల్-8; 1వపేజీ. [6] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,ఏప్రిల్-24; 1వపేజీ. [7] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,మే-27; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,జూన్-12; 1వపేజీ. [9] ఈనాడు అమరావతి/మైలవరం; 2017,జూన్-16&17; 2వపేజీ.