గుడివాడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడివాడ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°25′48″N 80°59′24″E మార్చు
పటం

గుడివాడ శాసనసభ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోగలదు.

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కఠారి ఈశ్వర్ కుమార్‌పై 8862 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటేశ్వరరావు 57843 ఓట్లు పొందగా, ఈశ్వర్ కుమార్ 48981 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.వెంకటేశ్వరరావు (నాని) పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ తరఫున పి.వెంకటేశ్వరరావు పోటీపడ్డాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.వి.రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.వి.రావుపై 17630 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.[1]

2014 ఎన్నికలు[మార్చు]

2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు పై 11537 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కొడాలి వెంకటేశ్వరరావు 81298 ఓట్లు పొందగా, రావి వెంకటేశ్వరరావు 69761 ఓట్లు సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) పు వై.కా.పా 81298 రావి వెంకటేశ్వరరావు పు తె.దే.పా 69761
2009 కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) పు తె.దే.పా 68034 పిన్నమనేని వెంకటేశ్వర రావు పు కాంగ్రెస్ 50404
2004 కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) పు తె.దే.పా 57843 ఈశ్వర కుమార్ కటారి పు కాంగ్రెస్ 48981
2000(ఉప ఎన్నిక) రావి వెంకటేశ్వర రావు పు తె.దే.పా 62559 రమేష్ శిస్ట్ల పు కాంగ్రెస్ 30562
1999 రవి హరి గోపల్ పు తె.దే.పా 43126 శేగు వెంకటేశ్వర్లు పు కాంగ్రెస్ 26180
1994 రావి శోభనాద్రి చౌదరి పు తె.దే.పా 59022 ఈశ్వర కుమార్ కఠారి పు కాంగ్రెస్ 38032
1989 ఈశ్వర కుమార్ కఠారి పు కాంగ్రెస్ 52723 రావి శోభనాద్రి చౌదరి పు తె.దే.పా 52213
1985 నందమూరి తారక రామారావు పు తె.దే.పా 49600 ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు పు కాంగ్రెస్ 42003
1985ఉప ఎన్నిక రావి శోభనాద్రి చౌదరి పు తె.దే.పా 53106 యు.ఎస్.బాబు పు కాంగ్రెస్ 31463
1983 నందమూరి తారక రామారావు పు తె.దే.పా 53906 కటారి సత్యనారాయణ రావు పు కాంగ్రెస్ 27368
1978 కటారి సత్యనారాయణ రావు పు కాంగ్రెస్[ఐ] 38060 పి.వెంకటసుబ్బారావు పు సిపిఐ(ఎం) 32236
1972 కటారి సత్యనారాయణ రావు పు కాంగ్రెస్ 34373 పి.వెంకటసుబ్బారావు పు సిపిఐ(ఎం) 27434
1967 ఎం.కె.దేవి స్త్రీ కాంగ్రెస్ 24854 వి.ఎస్.ఆర్.పుట్టగుంట పు సిపిఐ(ఎం) 15851
1962ఎస్.సి గంజి రామా రావు పు సి.పి.ఐ 27267 వేముల కూర్మయ్య పు కాంగ్రెస్ 23767
1955 అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం పు స్వతంత్ర అభ్యర్థి 52210 వేముల కూర్మయ్య పు కాంగ్రెస్ 49939

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009