Jump to content

శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format
వికీపీడియా నుండి
శ్రీకాళహస్తి
—  శాసనసభ నియోజకవర్గం  —
శ్రీకాళహస్తి is located in Andhra Pradesh
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది. ఈ నియోజక వర్గం 1951 లో డీలిమిటేషన్ ఉత్తర్వుల ప్రకారం ఏర్పడింది. ఈ నియోజకవర్గానికి అత్యధికంగా ఐదు సార్లు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈయన తర్వాతి స్థానం మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అద్దూరి బలరామిరెడ్డిది.

చరిత్ర

[మార్చు]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ నియోజకవర్గం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1952 లో మొదటిసారిగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దూరి బలరామిరెడ్డి, కృషికార్ లోక్ పార్టీకి చెందిన టి. వెంకటసుబ్బారావుపై గెలుపొందాడు.[1] 1953లో మద్రాసు నుండి విడివడి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పుడు, టంగుటూరు ప్రకాశం పంతులును ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డిని ఉప ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. అయితే, సంజీవరెడ్ది అప్పటికే శాసనసభ్యుడు కాదు. 1952లో మద్రాసు రాష్ట్రంలో భాగంగా జరిగిన ఎన్నికల్లో నీలం సంజీవరెడ్డి ఓడిపోయాడు. సంజీవరెడ్డి మార్గం సుగమం చేసేందుకు, శ్రీకాళహస్తి శాసనసభ్యుడు, అద్దూరి బలరామిరెడ్డి తన సీటుకు రాజీనామా చేశాడు. తత్ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలలో నీలం సంజీవరెడ్డి శ్రీకాళహస్తి నుండి గెలుపొంది, ఆంధ్రరాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.[2]

మద్రాసు నుండి విడివడి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ 1955 లో ఎన్నికలు జరిగాయి. ఈ ప్రభుత్వం ఏడేళ్ళ పాటు పాలించేందుకు అనుమతించారు ఎందుకంటే 1957కి తెలంగాణా ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలవడం వలన ఆ ప్రాంతానికే మాత్రమే శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1962 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి.

మండలాలు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్.సి.వి.నాయుడు తన సమీప ప్రత్యర్థి బొజ్జల గోపాలకృష్ణరెడ్డిపై 13078 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నాయుడుకు 69262 ఓట్లు రాగా, గోపాలకృష్ణరెడ్డి 56184 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గోపాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎస్సీవీ నాయుడు పోటీ చేశారు.[3] ఈ ఎన్నికల్లో గోపాలకృష్ణా రెడ్డి సమీప ప్రత్యర్థి ఎస్.సి.వి. నాయుడుపై గెలుపొందాడు.

ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024 287 జనరల్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పు తెలుగుదేశం పార్టీ 121565 బియ్యపు మధుసూదన్ రెడ్డి పు వైఎస్సార్సీపీ 78761
2019 287 జనరల్ బియ్యపు మధుసూదన్ రెడ్డి పు వైఎస్సార్సీపీ 109541 బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పు తెలుగుదేశం పార్టీ 71400
2014 287 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పు తె.దే.పా 89953 బియ్యపు మధుసూదన్ రెడ్డి పు వైఎస్సార్సీపీ 82370
2009 287 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పు తె.దే.పా 70707 ఎస్. సి. వి నాయుడు పు కాంగ్రెస్ 58244
2004 135 జనరల్ ఎస్. సి. వి నాయుడు పు కాంగ్రెస్ 69262 బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పు తె.దే.పా 56184
1999 135 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పు తె.దే.పా 61017 సత్రవాడ మునిరామయ్య పు కాంగ్రెస్ 52606
1994 135 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పు తె.దే.పా 59827 చదలవాడ కృష్ణమూర్తి పు కాంగ్రెస్ 55606
1989 135 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పు తె.దే.పా 58800 తాటిపర్తి చెంచురెడ్డి పు కాంగ్రెస్ 51432
1988 ఉప ఎన్నిక జనరల్ తాటిపర్తి చెంచురెడ్డి పు కాంగ్రెస్ 47984 కె. ఎస్. మూర్తి పు తె.దే.పా 43565
1985 135 జనరల్ సత్రవాడ మునిరామయ్య పు తె.దే.పా 46721 తాటిపర్తి చెంచురెడ్డి పు కాంగ్రెస్ 46641
1983 135 జనరల్ అద్దూరు దశరథరామిరెడ్డి పు స్వతంత్ర 41011 తాటిపర్తి చెంచురెడ్డి పు స్వతంత్ర 22790
1978 135 జనరల్ ఉన్నం సుబ్రహ్మణ్యం నాయుడు పు కాంగ్రెస్ (ఐ) 30204 తాటిపర్తి చెంచురెడ్డి పు జనతా పార్టీ 24292
1972 135 జనరల్ అద్దూరు బలరామిరెడ్డి పు స్వతంత్ర 41218 బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి పు కాంగ్రెస్ 32754
1967 132 జనరల్ బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి పు స్వతంత్ర 34282 అద్దూరు బలరామిరెడ్డి పు కాంగ్రెస్ 26531
1962 139 జనరల్ అద్దూరు బలరామిరెడ్డి పు కాంగ్రెస్ 16356 పి. వెంకటప్పయ్య పు సిపిఐ 12216
1955 119 ద్విసభ్య నీలం సంజీవరెడ్డి, పట్రా సింగారయ్య పు కాంగ్రెస్ 40404, 37190 గొడుగు సోమయ్య పు సిపిఐ 12909
1952 119 జనరల్ అద్దూరు బలరామిరెడ్డి పు కాంగ్రెస్ 31743 టి. వెంకటసుబ్బారావు పు కృషికార్ లోక్ పార్టీ 8377

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. indianelections.in (2024-02-12). "Srikalahasti, Andhra Pradesh: Read & Vote for Favorite political party. -" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-06-19.
  2. డి., సుందరరామ్. "దేశ రాష్ట్ర చిత్రపటంలో చిత్తూరు జిల్లా ప్రాముఖ్యత విశ్లేశణ" (PDF).
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009