Jump to content

బియ్యపు మధుసూదన్ రెడ్డి

వికీపీడియా నుండి
బియ్యపు మధుసూదన్ రెడ్డి
బియ్యపు మధుసూదన్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 2024
నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 15 మే 1971
అమ్మపాలెం గ్రామం
శ్రీకాళహస్తి మండలం
చిత్తూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి బియ్యపు శ్రీవాణిరెడ్డి
సంతానం 2 (ప‌విత్రా రెడ్డి)
నివాసం శ్రీకాళహస్తి

బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజక వర్గంలో తెలుగు దేశం పార్టీకి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

బి. మధుసూదన్‌ రెడ్డి 15 మే 1971లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి మండలం, అమ్మపాలెం గ్రామంలో జన్మించాడు. ఆయన బీఏ వరకు పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

బి. మధుసూదన్‌ రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన జగన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ను స్థాపించి నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాలను నిర్వహించాడు. ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో 7583 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

బి. మధుసూదన్‌ రెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పై 38141 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3]

నవరత్న నిలయం

[మార్చు]

బి. మధుసూదన్‌ రెడ్డి 'జగనన్న నవరత్న’ పథకాలతో ప్రజల జీవనస్థాయి ప్రమాణాలు ఎలా పెరిగాయో స్ఫురించేలా తొమ్మిది పురుష హస్తాలు, నాలుగు మహిళ హస్తాలతో నవరత్న పథకాలను గుడి కట్టించాడు. ఈ నిలయం మధ్యలో పేదలకు కేటాయించిన జగనన్న పక్కాగృహాన్ని ప్రత్యేకంగా అద్దాల గోపురాన్ని నిర్మించారు.[4]ఈ అద్దాల మహల్‌ లో రాగి ఆకుల్లో సీఎం జగన్‌ బొమ్మను చిత్రీకరించగా అందులోకి వెళ్లి ఎటు చూసినా సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోలు కనిపిస్తాయి.[5]

వివాదాలు

[మార్చు]

2020 లో కరోనా సమయంలో శ్రీకాళహస్తి నియోజకవర్గపు ఎమ్మెల్యే బియ్యపు మదుసూధన్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి వివాదానికి కారణమయ్యాడు. ఇందులో పాల్గొన్న అధికారులకు కరోనా వైరస్ సోకింది. తర్వాత వెంటవెంటనే ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడంతో శ్రీకాళహస్తి రెడ్ జోన్ గా ప్రకటించబడింది.[6][7] 2024 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అంశంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.[8] శ్రీకాళహస్తి ఆలయంలో వెండి అమ్మకాల్లో అవకతవకలు జరిగినట్లు ఈయనమీద ఆరోపణలు వచ్చాయి.[9]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీరే". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  3. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  4. Andrajyothy. "నవరత్న నిలయంలో అద్దాల మహల్‌ ప్రారంభం". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  5. News18 Telugu (16 August 2021). "సీఎం జగన్ పథకాలకు గుడి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే.. ఎలా ఉందో చూడండి." Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. archive, From our online (2020-04-22). "MLA's rally sparks rumours of community transmission". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-06-06.
  7. "Andhra MLA distributes groceries triggering large gatherings, draws flak for violating lockdown". India Today (in ఇంగ్లీష్). 2020-04-23. Retrieved 2024-06-06.
  8. Bureau, The Hindu (2024-02-15). "Srikalahasti MLA slams TDP leader for neglecting temple upkeep". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-06-06.
  9. Subramanyam, Avinash P. (2024-04-24). "Temple Scandal Sparks Controversy in Srikalahasti Poll Battle". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Retrieved 2024-06-06.