బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి

నియోజకవర్గము శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా

వ్యక్తిగత వివరాలు

జననం (1949-04-15) 15 ఏప్రిల్ 1949 (వయస్సు 72)
ఊరందూరు, మద్రాసు రాష్ట్రం, (ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్)
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి బృంద
సంతానము పద్మ, సుధీర్
నివాసము జూబ్లీ హిల్స్, హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్
మతం హిందు

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

బాల్యం విద్యాభ్యాసం[మార్చు]

గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరందూరు గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి గంగసుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తికి ఎమ్మెల్యేగా పనిచేశాడు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1968లో బీయెస్సీ పట్టాను, 1972లో లా పట్టాను పుచ్చుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

వివాహం అయిన తరువాత ఆయన లా ప్రాక్టీసు చేయడానికి హైదరాబాదు వెళ్ళాడు. తరువాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1989లో శ్రీకాళహస్తి శాసనసభానియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందాడు. 1994-2004 మధ్య కాలంలో నారా చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో ఐటీ మంత్రిగా, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతినిథి ఎస్సీవీ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. మళ్ళీ 2009 ఎన్నికల్లో అదే నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.