Jump to content

ఎస్సీవీ నాయుడు

వికీపీడియా నుండి
ఎస్సీవీ నాయుడు
పదవీ కాలం
2004-2009
నియోజకవర్గం శ్రీకాళహస్తి

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
సంతానం శ్రీకాంత్
నివాసం శ్రీకాళహస్తి
మతం హిందు

ఎస్సీవీ నాయుడు గా పేరుగాంచిన శాఖమూరి చెంచు వెంకటసుబ్రహ్మణ్యం నాయుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన రాజకీయ నాయకుడు. 2004 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆయన తల్లిదండ్రులు చెంచుపాపానాయుడు, జ్ఞానమ్మ. శ్రీకాళహస్తి ఫ్రభుత్వ కళాశాలలో 1973-75 మధ్యలో ఇంటర్మీడియట్ చదివాడు. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో నివాసముంటున్నాడు. ఎస్సీవీ కేబుల్ నెట్‌వర్క్ యజమాని.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్సీవీ నాయుడు తెలుగుదేశం పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్నిప్రారంభించి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2004లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఎస్సీవీ నాయుడు రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పని చేశాడు. ఆయన 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి శ్రీకాళహస్తి టికెట్ ఆశించి అది దక్కకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు.

ఎస్సీవీ నాయుడు 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపులో కీలకంగా పని చేశాడు. ఆయనకు వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని హామిఇవ్వగా, అది నెరవేరకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన 2023 జూన్ 29న అమరావతిలో నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. Andhra Prabha (29 June 2023). "తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న ఎస్ సి వి నాయుడు". Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.