బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ యువనేత. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు.[1][2]
బాల్యం, విద్యాభ్యాసం
[మార్చు]శ్రీకాళహస్తికి సమీపాన ఉన్న ఊరందూరు గ్రామంలో జన్మించాడు. తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తల్లి బృందమ్మ. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి. 2005లో సుధీర్ రెడ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. చెన్నై సెలైయూర్‌లోని భరత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (డీమ్డ్ యూనివర్సిటీ) లో మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు.[3]
రాజకీయాలు
[మార్చు]ప్రస్తుతం బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నాడు. 2019 శాసనసభ ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. కాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి గెలుపొందాడు.
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కూడా ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[4][5][6]
కుటుంబ రాజకీయ నేపథ్యం
[మార్చు]బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇందులో, మూడు పర్యాయాలు మంత్రిగా కూడా విధులు నిర్వహించాడు. గోపాలకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి, విశాలాక్షి దంపతుల రెండో సంతానం. బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి 1967లో శ్రీకాళహస్తి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
ఇక బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ తండ్రి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, వాయల్పాడు శాసనసభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి. పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ, 102 ఏళ్ళ వయసులో హైదరాబాదులో 2022 మే 6న తుదిశ్వాస విడిచింది.[7]
మూలాలు
[మార్చు]- ↑ "పొలిటికల్ స్క్రీన్‌పైకి సడన్ ఎంట్రీ ఇచ్చిన ఆ రెడ్డి నేత వార". web.archive.org. 2022-05-07. Archived from the original on 2022-05-07. Retrieved 2022-05-07.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Eenadu (11 June 2024). "అభ్యర్థులు సిద్ధం.. మిగిలింది యుద్ధం." Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
- ↑ "Bojjala Venkata Sudhir Reddy(TDP):Constituency- SRIKALAHASTI(CHITTOOR) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-03-26.
- ↑ "TDP: తెదేపా అభ్యర్థుల రెండో జాబితా విడుదల | tdp candidates second list released". web.archive.org. 2024-03-26. Archived from the original on 2024-03-26. Retrieved 2024-03-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ "బొజ్జల కుటుంబంలో మరో విషాదం - Andhrajyothy". web.archive.org. 2022-05-08. Archived from the original on 2022-05-08. Retrieved 2022-05-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)