బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి (1920 మే 14 - 2015 జనవరి 7) ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసన సభ్యులు.

జీవిత విశేషాలు

[మార్చు]

శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో 1920 మే 14 వ తేదీన బొజ్జల గంగిరెడ్డి, పోలమ్మ దంపతులకు బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి జన్మించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన తొమ్మిదో తరగతి వరకు మాత్రమే విద్యాభ్యాసం చేశారు.బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి గ్రామ కమిటీ ఛైర్మన్‌గాను, శాసన సభ్యులుగాను సేవలించారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన భార్య బొజ్జల విశాలాక్ష్మి 1995లోనే మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రెండో సంతానం.

మరణం

[మార్చు]

ఆయన శ్రీకాళహస్తి మండలంలో స్వగ్రామం ఊరందూరులో బుధవారం జనవరి 7 2015 న సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]