ఎంబిఎ
Jump to navigation
Jump to search
ఎంబిఎ లేదా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిష్ట్రేషన్ అనునది వాణిజ్య రంగానికి సంబంధించిన విద్య. ఇది ప్రపంచవ్యాప్తంగా పలు పేరు పొందిన కళాశాలలలో నిర్వహింపబడుతున్నది.
చరిత్ర[మార్చు]
- అమెరికాలో మొట్టమొదటి ఎంబిఎ కళాశాల డార్ట్మౌత్ కళాశాల లోని టక్ స్కూల్ ఆఫ్ బిజినెస్[1]. దీనిని 1990లో ప్రారంభించారు. ఇందులో మొదటగా వాణిజ్య శాస్త్రంలో ఆధునిక డిగ్రీని ప్రవేశపెట్టారు. తర్వాత ఇదే కోర్సు ఎంబిఎగా రూపాంతరం చెందింది.[2]
- 1908లో హార్వర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అడ్మినిష్ట్రేషన్ 15 మంది అధ్యాపకులతో, 33 మంది విద్యార్థులతో మరియు 47 మంది ప్రత్యేక విద్యార్థులతో ఎంబిఎ కోర్సును ప్రారంభించింది.[3][4]. ఈ కోర్సు మొదటి సంవత్సరం పాఠ్యాంశాలు ఫ్రెడరిక్ విండ్స్లోవ్ టేలర్ యొక్క సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆధారంగా రూపొందించబడ్డాయి.
- ప్రపంచంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయం మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 1930లో ఎంబిఎ విద్యను ప్రారంభించారు. ఇది తొలినాళ్ళలో కేవలం నాయకులకు మరియు ఉప నాయకులకు మాత్రమే ఉద్దేశింపబడింది. నేడు ఇది అందరికీ అందుబాటులో మరిన్ని విభిన్న కోర్సులతో రూపొందించబడింది.[5][6]
- యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మొట్ట మొదటిసారిగా విద్యార్థులకే కాక అప్పటికే పనిచేస్తున్న వృత్తి నిపుణులకి ఎంబిఎ విద్యని 1943లో అందుబాటులోకి తెచ్చింది.[7]. అంతేకాక ఈ కోర్సుకి గానూ మొట్టమొదటసారిగా షికాగో, బార్సిలోనా (ఐరోపా) మరియు సింగపూర్ ( (ఆసియా) వంటి వివిధ ఖండాలలో శాశ్వత విద్యా కేంద్రాలను నిర్మించింది. నేడు పలు విద్యాసంస్థలు వాటి విద్యార్థులకు అంతర్జాతీయ విద్యాకేంద్రాలలో ఈ విద్యను అందిస్తున్నాయి. ఈ కోర్సును ప్రారంభించిన తర్వాత ఈ విద్యాసంస్థ తన కేంద్రాలను షికాగో, లండన్ మరియు హాంకాంగ్ లకు తరలించింది.
- 1946లో ధండర్బర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాల గ్లోబల్ మేనేజ్మెంట్ పై మొట్టమొదటిసారిగా ఎంబిఎ డిగ్రీని ప్రారంభించింది.[8]
- 1950లో లండన్ లోని ది యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆంటోరియో లోని రిచర్డ్ ఐవి స్కూల్ ఆఫ్ బిజినెస్ [9] అమెరికా దేశం వెలుపల మొట్టమొదటిసారిగా ఎంబిఎ డిగ్రీని ప్రధానం చేసింది. తర్వాత 1951లో దక్షిణాఫ్రికా దేశంలోని ప్రిటోరియా విశ్వవిద్యాలయం కూడా ఎంబిఎ డిగ్రీలను ప్రధానం చేయడం ఆరంభించింది.[10]
- 1955లో ఆసియా ఖండంలో అమెరికా లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం లోని వార్టన్ స్కూల్ యొక్క సహకారంతో పాకిస్తాన్ దేశంలోని కరాచీ విశ్వవిద్యాలయం వాణిజ్య విభాగమైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిష్ట్రేషన్ కరాచీ మొదటి సారిగా ఆషియా ఖండంలోఅమెరికా మాదిరి ఎంబిఎ విద్యని అందించిన విద్యాసంస్థగా పేరుగొన్నది .[11] In 1957, INSEAD became the first European business school to offer an MBA program.[12]
- 1986లోఫ్లోరిడా లోని రోలిన్స్ కళాశాల లోని రాయ్ ఈ. క్రమ్మర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఎంబిఎ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికి తరగతి గదిలో ల్యాప్టాప్ తప్పనిసరి అనే నిబంధనను తెచ్చినది. ఈ నిబంధన విధించిన తొలినాళ్ళలో, అధ్యాపకులు కళాశాల తరపున విద్యార్థులకు అవసరమైన ల్యాప్టాప్ లను తరగతి ప్రారంభంలో గదులలోకి చక్రాలను అమర్చిన పెట్టెలలో తెచ్చేవారు.[ఉల్లేఖన అవసరం] ఇదిలా ఉండగా 1992-1993 విద్యాసంవత్సరంలో [[m:en:Columbia Business School]|కొలంబియా బిజినెస్ స్కూల్]] ఇలాంటి నిబంధననే విధిస్తూ తమ విద్యాలయంలో ఎంబిఎ అభ్యసించే ప్రతి విద్యార్థి సొంతంగా ల్యాప్టాప్ మరియు అందులో సంబంధిత ప్రామాణిక సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేసే విధంగా తప్పనిసరి నిబంధన విధించింది. ఈ నిబంధన తెచ్చిన తొలి విద్యాలయంగా ఈ సంస్థ పేరుగొన్నది, [13][14]
- 1994లో కెనడా లోని అథబాస్కా విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొదటిసారిగా ఆన్లైన్ ఎంబిఎ విద్యను అందుబాటులోకి తెచ్చి తద్వారా ఈ ఘనత సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా ఖ్యాతికెక్కింది.[15]
ఈ రోజు ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎంబిఎ కోర్సును విభిన్న ప్రత్యేకాంశాలలో అందుబాటులోకి తెచ్చాయి.[16]
ప్రత్యేకతలు[మార్చు]
- మానవ వనరులు (హెచ్. ఆర్)
- ఆర్థికము (ఫైనాన్స్)
- సిస్టమ్స్
ఎంబిఎ విద్యను అభ్యసించిన ప్రముఖులు[మార్చు]
- ముకేష్ అంబానీ - సుప్రసిద్ద పారిశ్రామికవేత్త . రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్కఅధినేత, నిర్వాహకుడు మరియు ఆ కంపెనీలో అత్యధిక వాటాదారుడు. స్టాన్ఫోర్డ్ బిసినెస్ స్కూలులో ఎంబిఎ చదువు ప్రారంబించారు.
- కుమార్ మంగళం బిర్లా - సుప్రసిద్ద పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ (వ్యాపార సముదాయం) అధ్యక్షుడు. చార్టర్డ్ అకౌంటంట్ అయిన ఇతడు లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబిఎ చేసాడు
- దగ్గుబాటి వెంకటేష్ - తెలుగు సినీ నటుడు. మోంటెరే ఇన్స్టిస్టూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, యు.ఎస్.ఎ నుండి ఎంబిఎ పట్టా అందుకున్నాడు.
- పూజా బాత్రా - ప్రముఖ సినీ నటి. పూణేలోని సింబయాసిస్ కళాశాల నుండి మార్కెటింగ్ లో ఎంబిఎ చేసింది.
- కల్వకుంట్ల తారక రామారావు - తెరాస నాయకుడు. అమెరికా న్యూయర్క్లో ఎంబిఎ చదివారు
- అజిత రాజి - భారత సంతతికి చెందిన ఒక అమెరికన్ మహిళ. 2014 లో ఈమెను అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా, స్వీడన్ లో అమెరికా రాయబారిగా నియమించడంతో వార్తలలోకి వచ్చింది.1983లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ., 1991లో ఎంబిఎ చేసింది.
- పయ్యావుల కేశవ్ - అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మరియు మాజీ శాసనసభ్యుడు.
- నారా లోకేష్
మూలాలు[మార్చు]
- ↑ "Tuck School of Business History". Tuck.dartmouth.edu. Retrieved 2013-07-26.
- ↑ Donald Stabile (1 January 2007). Economics, Competition and Academia: An Intellectual History of Sophism Versus Virtue. Edward Elgar Publishing. pp. 101–. ISBN 978-1-84720-716-6.
- ↑ Kaplan, Andreas (2014). "European management and European business schools: Insights from the history of business schools". European Management Journal. 32: 529–534. doi:10.1016/j.emj.2014.03.006.
- ↑ "History - About Us - Harvard Business School". Hbs.edu. Retrieved 2013-07-26.
- ↑ "The Sloan Legacy". London.edu.
- ↑ "MIT's contributions to business and economics". http://www.boston.com. 15 May 2011. External link in
|journal=
(help) - ↑ Key Facts | The University of Chicago Booth School of Business. Chicagobooth.edu. Retrieved on 2013-07-26.
- ↑ International Business School & MBA Programs | Thunderbird School of Global Management. Thunderbird.edu. Retrieved on 2013-07-26.
- ↑ Richard Ivey School of Business page showing awarding of first MBA in 1950, one year ahead of the University of Pretoria's claim
- ↑ University of Pretoria page claiming to have awarded the first MBA outside of America
- ↑ Iba.edu.pk
- ↑ Insead MBA
- ↑ http://spectatorarchive.library.columbia.edu/cgi-bin/columbia?a=d&d=cs19920918-01.2.4&e=-------en-20--1--txt-txIN------
- ↑ http://www.micsymposium.org/mics_1998/proceedings.pdf
- ↑ "Athabasca University". Cite web requires
|website=
(help) - ↑ McIntyre, John R. and Ilan Alon, eds. (2005), Business and Management Education in Transitioning and Developing Countries: A Handbook, Armonk, NY: ME Sharpe.
బయటి లంకెలు[మార్చు]
![]() |
Wikiversity has learning materials about ఎంబిఎ |