Jump to content

ముఖేష్ అంబానీ

వికీపీడియా నుండి
(ముకేష్ అంబానీ నుండి దారిమార్పు చెందింది)
ముఖేష్ అంబానీ
జననం (1957-04-19) 1957 ఏప్రిల్ 19 (వయసు 67)
ఎడెన్, ఎడెన్ కాలనీ (ప్రస్తుతం యెమెన్)[1][2]
జాతీయతభారతీయుడు
వృత్తిరిలయన్స్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు
నికర విలువIncrease US$20.1 బిలియన్లు (February 2016)[3]
జీవిత భాగస్వామినీతా అంబానీ (m. 1985)
పిల్లలుఆకాశ్ అంబానీ
అనంత్ అంబానీ
ఇషా అంబానీ[4][5]
తల్లిదండ్రులుధీరూభాయ్ అంబానీ
కోకిలాబేన్ అంబానీ
బంధువులుఅనిల్ అంబానీ (సోదరుడు)

ముఖేష్ ధీరూభాయ్ అంబానీ (జననం: ఏప్రిల్ 19,1957) భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్.ఐ.ఎల్) సంస్థకు అధ్యక్షుడు,  యాజమాన్య సంచాలకుడు, 35%తో అత్యధిక వాటాదారుగా ఉన్నారు. రిలయన్స్ సంస్థ ఫార్చూన్ గ్లోబల్ 500 కంపెనీ చిట్టాలోనూ, భారతదేశ రెండవ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది.[7][8][9] ప్రపంచంలోనే అత్యంత విలువైన అంటిలా బిల్డింగ్ లో నివాసం ఉంటున్నరు అంబానీ. ఈ ఇల్లు సుమారు 2 బిలియన్ డాలర్ల విలువైనది.[10][11] ధీరూభాయ్ అంబానీ, కోకిలాబెన్ అంబానీల మొదటి సంతానం ముఖేష్. ఈయన్ సోదరుడు అనిల్ అంబానీ. రిలయన్స్ సంస్థ ముఖ్యంగా పెట్రో ఉత్పత్తుల శుద్ధి, పెట్రో రసాయనాలు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి రంగాల్లో పనిచేస్తుంది. ఈ వ్యాపారాలకు అనుబంధంగా ఈ సంస్థ నడిపే వర్తకం భారతదేశంలోనే అతిపెద్దది.[12]

2014లో, ఫోర్బ్స్ జాబితాలో అంబానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా 36వ స్థానంలో నిలిచారు.[3] 2010లో ఫోర్బ్స్ లో "ముఖ్యమైన 68 మంది వ్యక్తుల" జాబితాలో చోటు దక్కింది.[13] 2013లో భారతదేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గుర్తించబడ్డారు. అదే సంవత్సరం ఆసియాలో రెండవ అత్యంత సంపన్నునిగా నిలిచారు ముఖేష్.[3]  వరుసగా 9వ సంవత్సరం కూడా అంబానీ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు.[14] రిలయన్స్ సంస్థ ద్వారా భారత ప్రీమియర్ లీగ్ లోని "ముంబై ఇండియన్స్" జట్టుకు అంబానీ యజమాని. 2012లో ఫోర్బ్స్ జాబితా ఆయనను ప్రపంచంలోనే సంపన్న క్రీడా యజమానిగా పేర్కొంది.[15][16]

బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కు ఆయన పాలకమండలిలో, అంతార్జాతీయ విదేశీ వ్యవహారాల కౌన్సిల్ లో సలహా మండలిలోను సేవలందించారు. భారతదేశంలోని ప్రధాన బిజినెస్ స్కూల్స్ లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగుళూరు పాలకమండలికి అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు.

జీవిత సంగ్రహం

[మార్చు]

ముఖేష్ ఏప్రిల్ 19 1957న ధీరూబాయ్ అంబానీ, కోకీలాబెన్ అంబానీలకు జన్మించారు. ముఖేష్ కు తమ్ముడు అనిల్ అంబానీ, ఇద్దరు చెల్లెళ్ళు దీప్తి సలగొన్కర్, నైనా కొఠారీ ఉన్నారు. 1970లలో అంబానీ కుటుంబం ముంబై లోని భులేశ్వర్ ప్రాంతంలో ఒక చిన్న రెండు పడకగదుల ఇంట్లో ఉండేవారు.[17]  ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ధీరూభాయ్ కోల్బాలో 14 అంతస్తుల భవనాన్ని కొన్నారు. దాని పేరు "సీ విండ్". మొన్న మొన్నటిదాకా ముఖేష్, అనిల్ కుటుంబాలు వేర్వేరు అంతస్తుల్లో ఆ ఇంట్లోనే కలసి ఉండేవారు.[18]

ముంబై లో పెద్దర్ రోడ్లోని హిల్ గ్రేంజ్ హైస్కూల్లో తన తమ్ముడు అనిల్  తో కలసి చదువుకున్నారు. ముఖేష్ కు అత్యంత సన్నిహితుడైన ఆనంద్ జైన్ ఆ స్కూల్లోనే ఆయన సాహాధ్యాయి.[19] ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, మాతుంగలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో బిఈ పట్టా పొందారు.[20] ఆ తరువాత స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏలో జాయిన్ అయినా రిలయన్స్ సంస్థను నడపడంలో తండ్రి ధీరూభాయ్ కు సహాయం చేయడం కోసం చదువు మధ్యలో ఆపేసి వచ్చేశారు. అప్పటికి రిలయన్స్ వేగంగా ఎదుగుతున్న చిన్న వ్యాపార సంస్థ.[21]

వ్యాపారం

[మార్చు]

1980లో, ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం పాలిస్టర్ ఫిలమెంట్ యార్న్ ను ప్రారంభించింది. దీనిని ప్రయివేటు రంగానికి అప్పగిస్తూ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ఉత్తర్వులిచ్చింది. ధీరూభాయ్ అంబానీ టాటా, బిర్లా, దాదాపు మరో 43మంది వ్యాపారులతో పోటీపడుతూ లైసెన్సుకు దరఖాస్తు చేసుకున్నారు. ధీరూభాయ్ కు లైసెన్స్ రావడం[22]తో ఈ కొత్త వ్యాపారాన్ని నడిపేందుకు ధీరూభాయ్ తన పెద్ద కుమారుడు ముఖేష్ ను స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చదువు మధ్యలో ఆపి తీసుకువచ్చారు. అలా ముఖేష్ తన చదువును అపి, వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 1981లో ఈ అడుగుతోనే ముఖేష్ వ్యాపార ప్రస్థానం మొదలైంది.[7]

ముఖేష్ రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్ (ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ గా వ్యవహరింపబడుతోంది.) ను స్థాపించారు. ఈ సంస్థ సమాచారం, సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి విషయంలో పనిచేస్తుంది.[23]

జాంనగర్ లోప్రపంచంలోనే అతిపెద్ద పెట్రోలియం రిఫైనరీ సంస్థ ను అంబానీ స్థాపించారు. 2010కి రోజుకు 660,000బారెళ్ల ఉత్పత్తి ఈ కంపెనీ సామర్ధ్యం (సంవత్సరానికి 33 మిలియన్ల టన్నులు). పెట్రోకెమికల్స్, విద్యుత్ ఉత్పత్తి, ఓడరేవు, దానికి సంబంధించిన సౌకర్యాలు అనుసంధానం చేయడానికి ఈ సంస్థ పనిచేస్తుంది.[24]

2013 డిసెంబరులో మొహాలిలో జరిగిన ప్రోగ్రసివ్ పంజాబ్ సమ్మిట్ లో భారత్ ఎయిర్ టెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం గురించి అంబానీ ప్రకటించారు. ఈ భాగస్వామ్యంతో భారతదేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయడానికి 4జి నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు.[25]

2014, ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీకి వ్యతిరేకంగా ఎఫ్.ఐ.అర్ ఫైలైంది. కెజిబేసిన్ లో దొరికే గ్యాస్ ను ఎక్కువ ధరకు అమ్ముతున్నారంటూ ఆ ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొన్నారు.[26] ముఖేష్ కు వ్యతిరేకంగా ఈ కంప్లయింట్ ను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఇచ్చారు. రాహుల్ గాంధీనరేంద్ర మోడీ లను ముఖేష్ పై చర్య తీసుకోవాలని కోరారు.[27][28][29] కేజ్రివాల్ కంప్లయింట్ ప్రకారం ఒక యూనిట్ కు కంపెనీ ఒక డాలరు మాత్రమే ఖర్చు పెడుతుండగా, 8 డాలర్లకు అమ్ముతోందనీ, దీని వల్ల దేశం సంవత్సరానికి 540బిలియన్ల రూపాయలు నష్టపోతోందని ఆరోపించారు.[30][31]

జూన్ 18, 2014లో ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి 40వ ఎజిఎంను ఎంపిక చేసిన సభలో మాట్లాడుతూ 2015నాటికి 4జి బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ ను స్థాపిస్తామని, తమ సంస్థ వచ్చే 3 ఏళ్ళలో 1.8 ట్రిలియన్ రూపాయలు పెట్టుబడి పెడుతుందని ప్రకటించారు.[32]

బోర్డ్ సభ్యత్వాలు

[మార్చు]
  • ముంబై ఇన్‌స్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ పాలకమండలిలో  సభ్యుడు.
  • Chairman, managing director, Chairman of Finance Committee and Member of Employees Stock Compensation Committee, Reliance Industries Limited రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కు సంస్థకు అధ్యక్షుడు, యాజమాన్య సంచాలకుడు, ఫైనాన్స్ కమిటీకి అధ్యక్షుడు, ఎంప్లాయిస్ స్టాక్ కాంపెన్సేషన్ కమిటీకి సభ్యుడు
  • భారత పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటిడ్ కు మాజీ అధ్యక్షుడు
  • రిలయన్స్ పెట్రోలియం సంస్థకు మాజీ ఉపాద్యక్షుడు
  • రిలయన్స్ పెట్రోలియం సంస్థకు పాలకమండలి  అధ్యక్షుడు
  • రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ సంస్థ ఆడిట్ కమిటీకి అధ్యక్షుడు
  • రిలయన్స్ పరిశోధన, ఉత్పత్తి డిఎంసిసి సంస్థ అధ్యక్షుడు
  • బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కు మాజీ డైరెక్టర్, క్రెడిట్ కమిటీ  సభ్యుడు, పరిహారాలు, ప్రయోజనాల కమిటీ సభ్యుడు
  • గుజరాత్  గాంధీనగర్ లోని పండిట్ దెండియాల్  పెట్రోలియం విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడు

అవార్డులు-గౌరవాలు

[మార్చు]
  • 2010లో హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో అంబానీ 5వ ఉత్తమ ప్రపంచ  సిఈవోగా ఎన్నికయ్యారు.[33]
సంవత్సరం అవార్డు/గౌరవం పేరు  సంస్థ
2000 ఆ సంవత్సరానికి గాను యువ పారిశ్రామికవేత్త[34]
ఎర్నెస్ట్ & యంగ్ ఇండియా
2010 అవార్డ్స్ డిన్నర్ లో గ్లోబల్ విజన్ అవార్డు[35] ఆసియా సొసైటీ
2010 బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్[35]
ఎన్.డి.టి.వి 

ఇండియా

2010 బిజినెస్ మేన్ ఆఫ్ ది ఇయర్[36]
ఫైనాంషియల్ 

క్రొనికల్

2010 స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్

 అప్లైడ్ సైన్స్ డీన్స్ మీడియా [37]

పెన్నిసిల్వనియా 

విశ్వవిద్యాలయం

2010 గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్[38] బిజినెస్ కౌన్సిల్

ఫర్ ఇంటర్నేషనల్
అండర్ స్టాండింగ్

2010 డాక్టరేట్[39]
బరోడా ఎంఎస్ 

విశ్వవిద్యాలయం

2013 మిలీనియం బిజినెస్ లీడర్ ఆఫ్ ది డికేడ్ ఎట్ ఇండియన్

ఎఫైర్స్ ఇండియా లీడర్ షిప్ కాన్క్లేవ్ అవార్డ్స్

ఇండియా లీడర్ షిప్ కాన్క్లేవ్ & ఇండియన్ ఎఫైర్స్ బిజినెస్ లీడర్ షిప్ అవార్డ్స్ 

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ముఖేష్ నీతా అంబానీని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు అనంత్, ఆకాష్, ఒక కూతురు ఇషా ఉన్నారు. ఈ కుటుంబం ప్రపంచంలోనే అతి ఖరీదైన భవనంగా పేరుపొందిన అంటిలా లో ఉంటారు. ఈ భవనంలో 27 అంతస్తులు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. Nolan, Jeannette. "Mukesh Ambani". Encyclopædia Britannica. Retrieved 6 October 2013.
  2. "The Rediff Business Interview/ Mukesh Ambani". Rediff.com. 17 June 1998. Retrieved 22 August 2013.
  3. 3.0 3.1 3.2 "Mukesh Ambani". Forbes. Retrieved 2 February 2016.
  4. Andhra Jyothy (20 November 2022). "క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఇషా అంబానీ". Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. "NY Times pics on Mukesh Ambani". The New York Times. India. 15 June 2008. Retrieved 22 August 2013.
  6. "Meet the Gujarati who went on to become the richest Indian". Daily Bhaskar. Retrieved 29 January 2014.
  7. 7.0 7.1 "Mukesh Ambani :: RIL :: Reliance Group of Industries" Archived 2015-04-16 at the Wayback Machine.
  8. "FORTUNE Global 500 2011: Countries".
  9. "Market Capitalization".
  10. Magnier, Mark (24 October 2010).
  11. Kwek, Glenda (15 October 2010).
  12. "Ambani tops retailer list, too".
  13. "Sonia Gandhi, Tata in Forbes' most powerful people list".
  14. "Mukesh Ambani richest Indian with wealth of $21 billion: Forbes" Archived 2014-10-20 at the Wayback Machine.
  15. Van Riper, Tom.
  16. "Mumbai Indians owner Mukesh Ambani among richest sport owners".
  17. "Reliance didn't grow on permit raj: Anil Ambani".
  18. Yardley, Jim (28 October 2010).
  19. Anand Jain: A bone of contention between the Ambani brothers.
  20. "Mukesh Ambani on his childhood, youth".
  21. "Always invest in businesses of the future and in talent".
  22. "Reliance Industries – Company Profile".
  23. "Reliance Infocomm Ushers a Digital Revolution in India" Archived 2013-07-23 at the Wayback Machine.
  24. "Mukesh Ambani :: Reliance Group :: Reliance Petroleum Limited :: Reliance Industries" Archived 2016-03-05 at the Wayback Machine.
  25. "Mukesh Ambani hints at venture between Reliance Industries and Bharti Airtel".
  26. "Arvind Kejriwal rakes up K G Basin gas pricing, orders FIRs against Moily, Deora, Mukesh Ambani".
  27. Nair, Anisha (23 February 2014).
  28. "Arvind Kejriwal's letter to Mukesh Ambani on gas pricing". 
  29. Ghosh, Deepshikha (21 February 2014).
  30. "Arvind Kejriwal fires on all cylinders, now writes to Rahul Gandhi over gas prices involving Mukesh Ambani".
  31. "Arvind Kejriwal asks Narendra Modi to come clean on gas pricing".
  32. "Reliance 4G services to be launched in 2015: Mukesh Ambani".
  33. Mulgund, Shreyas (January 2010).
  34. "Ernst & Young Entrepreneur of the Year Award" Archived 2016-03-04 at the Wayback Machine.
  35. 35.0 35.1 Mulgund, Shreyas.
  36. Mulgund, Shreyas (30 December 2010).
  37. "IMukesh Ambani awarded the Dean's Medal by University of Pennsylvania" Archived 2019-03-17 at the Wayback Machine.
  38. "BCIU Presents Dwight D. Eisenhower Global Awards to Mukesh D".
  39. "M.S. University Confers Degree of Doctor of Science Honoris Causa To Mukesh Ambani".