కుమార్ మంగళం బిర్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కుమార మంగళం బిర్లా
జననం (1967-06-14) జూన్ 14, 1967 (వయస్సు: 50  సంవత్సరాలు)
భారతదేశం
నివాసం భారతదేశం
జాతీయత భారతీయుడు
జాతి Hindu[1]
వృత్తి Chairman of Aditya Birla Group
అసలు సంపద IncreaseUS$7.9 billion (2010)[1]
మతం హిందూమతం

కుమార మంగళం బిర్లా (జననం: 1967 జూన్ 14) ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా గ్రూప్ అధ్యక్షుడు. గ్రాసిం, హిండాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, ఆదిత్య బిర్లా నువో, ఐడియా సెల్యులర్, ఆదిత్య బిర్లా రిటెయిల్, కెనడాకు చెందిన ఆదిత్య బిర్లా మినక్స్ మొదలైన కంపెనీలు ఈ గ్రూపులో ఉన్నాయి. ఈయన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలాని)కు కులపతి.

జీవితం మరియు వృత్తి[మార్చు]

కుమార మంగళం బిర్లా రాజస్తాన్ రాష్ట్రంలో మార్వాడీ వ్యాపారులైన బిర్లాల కుటుంబంలో జన్మించారు. చార్టర్డ్ అకౌంటంట్ అయిన కుమార మంగళం బిర్లా లండన్ బిజినెస్ స్కూల్‌లో ఎంబిఎ చేసాడు. ప్రస్తుతం అక్కడ గౌరవ సభ్యుడు కూడా. అతని భార్య నీరజ కస్లివాల్. వారికి అనన్యశ్రీ, అర్యమన్ విక్రం, మరియు అద్వైతేశ అని ముగ్గురు పిల్లలు ఉన్నారు.

పురస్కారాలు మరియు గౌరవాలు[మార్చు]

ఆదిత్య బిర్లా గ్రూప్‌కు అధిపతిగా ఉంటూ పరిశ్రమకు, యాజమాన్య పద్ధతులకు కుమార్ మంగళం బిర్లా అందించిన సేవలకు గాను గుర్తింపుగా అనేక పురస్కారలు గౌరవాలు పొందాడు.

2006

 • ఎర్నెస్ట్ అండ్ యంగ్ వారి అకాడమీలో సభ్యత్వం.

2005

 • "ఎర్నెస్ట్ అండ్ యంగ్ వారి ఈ ఏటి మేటి ప్రపంచ పారిశ్రామికవేత్త - భారతదేశం"
 • బిజినెస్ టుడే వారిచే "ఉత్తమ యువ నిర్వాహకుడు"గా ఎంపిక.
 • PHD చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ — ఉద్యోగ రత్న

2004

 • దావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు యువ ప్రపంచ నేతగా గుర్తించారు.
 • వ్యాపార రంగానికి చేసిన విశిష్టమైన సేవలకుగాను, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇతనికి గౌరవ డి.లిట్. పట్టాను ఇచ్చింది.
 • అల్ ఇండియా మేనేజ్ మెంట్ అసోసియేషన్ వారు గౌరవ ఫెలోషిప్ తో సత్కరించారు.

2003

 • ఎకనామిక్ టైమ్స్ పురస్కారాలలో "ఈ ఏడాది వ్యాపార నాయకుడు"గా గుర్తింపు
 • బిజినెస్ ఇండియా వారిచే "ఈ ఏడాది వ్యాపార వేత్త - 2003"గా నామకరణం. ఒకే సంవత్సరంలో ఈ రెండు పురస్కారాలను వేరెవరూ అందుకొకపోవడం విశేషం.

2002

 • క్విమ్ప్రో ఫౌండషన్ వారి "క్విమ్ప్రో ప్లాటినం స్టాండర్డ్ అవార్డ్".

2001

 • ద నేషనల్ HRD నెట్వర్క్ (పూణే) వారి "ఈ ఏటి అత్యుత్తమ వ్యాపార వేత్త"
 • "వ్యాపార దక్షతకు మరియు పరిశ్రమకు చేసిన సేవ"కు గుర్తింపుగా ద జైన్ట్స్ ఇంటర్నేషనల్ అవార్డ్
 • ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వారి "వ్యాపార నాయకత్వానికి గాను బంగారు నెమలి పురస్కారం"

2000

 • ద బోంబే మేనేజమేంట్ అసోసియేషన్ వారి "ద మేనేజమేంట్ మెన్ ఆఫ్ ద ఇయర్ 1999-2000" .

1999

 • లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి "ద అచీవర్ ఆఫ్ ద మిలీనియం"
 • అహమదాబాద్ రోటరీ క్లబ్ వారి "ద లెజెండ్ ఆఫ్ ద కార్పోరేట్ వరల్డ్"

బాహ్య లింకులు[మార్చు]

వివరణ[మార్చు]

 1. "#86 Kumar Mangalam Birla - The World's Billionares". Forbes. 2009-09-30. Archived from the original on 2013-06-29. Retrieved 2010-03-10.