బార్సిలోనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బార్సిలోనా స్పెయిన్ దేశంలోని ఒక తీర ప్రాంతపు పట్టణం.

నైరుతి ఐరోపాలో బార్సిలోనా ఒక సాంస్కృతిక, ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా పేరు పొందింది. స్పెయిన్ లో బయోసాంకేతికకు కేంద్రం లాంటిదీ నగరం. ఇది ఒక ప్రధాన రవాణా కేంద్రం. బార్సిలోనా ఓడరేవు ఐరోపాలో అత్యంత జనసమ్మర్ధం కలిగిన ప్రధాన రేవు.[1] ఇక్కడి విమానాశ్రయం నుంచి యేటా సుమారు ఐదు కోట్ల మంది ప్రయాణాలు చేస్తుంటారు.[2] ఇంకా ఇక్కడి రహదారులు, రైల్వే నెట్‌వర్క్ కూడా ఫ్రాన్స్, ఇంకా ఇతర ఐరోపా దేశాలకు చేరుకునేలా విస్తృతంగా వ్యాపించి ఉంది.[3]

1992 లో ఇక్కడ వేసవి ఒలింపిక్ క్రీడలు జరిగాయి. ఈ క్రీడల తర్వాత అప్పటి దాకా పారిశ్రామిక నగరంగా ఉన్నది అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించడం మొదలు పెట్టింది. ఈనగరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కూడా ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Port of Barcelona traffic statistics Accumulated data December 2013" (PDF). Statistics Service. p. 6. Archived from the original (PDF) on 14 June 2014. Retrieved 14 June 2014.
  2. "AENA December 2018 Report" (PDF). 14 January 2019. Archived from the original (PDF) on 15 January 2019.
  3. "First commercial trips" (in స్పానిష్). Europapress.es. 10 December 2010. Archived from the original on 10 April 2014. Retrieved 30 March 2014.