శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
కర్నూలు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో శ్రీశైలం శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గం 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడింది.
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 2014 బుద్దా రాజశేఖరరెడ్డి వై.ఎస్.ఆర్.సి శిల్పా చక్రపాణిరెడ్డి తెలుగుదేశం పార్టీ 2009 ఎ.ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వి.రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- శ్రీశైలం
- ఆత్మకూరు
- వెలుగోడు
- బండి ఆత్మకూరు
- మహానంది
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బుడ్డా రాజశేఖరరెడ్డి పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ నుండి ఏరాసు ప్రతాపరెడ్డి, ప్రజారాజ్యం పార్టీ తరఫున బుడ్డా శేషారెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున ఎం.కృష్ణారెడ్డి, లోక్‌సత్తా పార్టీ టికెట్టుపై శ్రీనివాసచారి పోటీచేశారు.[2]