ఏరాసు ప్రతాప రెడ్డి
ఏరాసు ప్రతాప రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2009 - 2014 | |||
నియోజకవర్గం | శ్రీశైలం నియోజకవర్గం | ||
---|---|---|---|
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1994 - 2009 | |||
నియోజకవర్గం | ఆత్మకూరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1963 కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | ఏరాసు అయ్యపురెడ్డి |
ఏరాసు ప్రతాప రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మకూరు నుండి మూడుసార్లు, శ్రీశైలం నియోజకవర్గల నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]ఏరాసు ప్రతాప రెడ్డి తన తండ్రి ఏరాసు అయ్యపురెడ్డి మరణాంతరం రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1994, 2004 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుండి, 2009లో నియోజకవర్గాల పునర్విభజన ద్వారా నూతనంగా ఏర్పడ్డా శ్రీశైలం నియోజకవర్గల నుండి ఎమ్మెల్యేగా గెలిచి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2014లో రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి,[1] [2] 09 మార్చి 2014న తెలుగుదేశం పార్టీలో చేరి [3] పాణ్యం అసెంబ్లీ నుండి పోటీ చేసి మూడవ స్థానంలో నిలిచాడు. ఆగస్టు మొదటి వారంలో ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజీనామాలు సమర్పించిన మంది మంత్రుల్లో ఏరాసు ప్రతాప్ రెడ్డి ఒకరు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.[4]
సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ | పోలైన ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | పోలైన ఓట్లు |
---|---|---|---|---|---|---|
1994 | ఏరాసు ప్రతాప రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 48332 | బుడ్డా వెంగళ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | 23660 |
1999 | బుడ్డా సీతారామి రెడ్డి | తెలుగుదేశం పార్టీ | 63391 | ఏరాసు ప్రతాప రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 44353 |
2004 | ఏరాసు ప్రతాప రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 63277 | బుడ్డా శైలజ | తెలుగుదేశం పార్టీ | 47047 |
2009 | ఏరాసు ప్రతాప రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 49,384 | బుడ్డా రాజశేఖర్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ | 45,077 |
2014 (పాణ్యం నియోజకవర్గం) | గౌరు చరితా రెడ్డి | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 72245 | ఏరాసు ప్రతాప రెడ్డి | తెలుగుదేశం పార్టీ | 53,358 (3వ స్థానం) |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (18 February 2014). "మంత్రి పదవికి, పార్టీకి ఏరాసు రాజీనామా". Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
- ↑ Deccan Chronicle (1 January 2014). "3 ministers to quit Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
- ↑ "3 senior Congress leaders join the Telugu Desam Party". Business Line (in ఇంగ్లీష్). 9 March 2014. Archived from the original on 11 January 2022. Retrieved 11 January 2022.
- ↑ "Andhra Pradesh Law minister quits post, party over Telangana-India News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2013-10-04. Retrieved 2022-04-25.