Jump to content

ఏరాసు అయ్యపురెడ్డి

వికీపీడియా నుండి

ఏరాసు అయ్యపురెడ్డి ప్రముఖ న్యాయ శాస్త్ర కోవిదుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు, రాష్ట్ర మంత్రి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏరాసు అయ్యపురెడ్డి, న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు.

కర్నూలు జిల్లా, గడివేముల మండలం గడిగరేవుల గ్రామంలో జన్మించిన అయ్యపురెడ్డి ప్రముఖ క్రిమినల్ లాయర్‌గా, రాజ్యాంగ నిపుణుడిగా పేరొందాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా, తెలుగుదేశం పార్టీ తరఫున అతను కర్నూలు నుంచి లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరించాడు. లోక్‌సభలో పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహించాడు. ఇతని కుమారుడు ఏరాసు ప్రతాపరెడ్డి, శ్రీశైలం శాసనసభ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు.[1]

1978లో జనతా పార్టీ తరపున అరవై మంది ఎమ్మెల్యేలు గెలిచారు. కాని వారిలో చాలా మంది పార్టీని వదలి వెళ్లిపోయారు. అ క్రమంలో పార్టీలో చీలిక కూడా వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న గౌతు లచ్చన్న లోక్‌దళ్ పార్టీ వైపు వెళ్లగా జనతా పార్టీ తరఫున అయ్యపు రెడ్డి కొంతకాలం విపక్ష నేతగా వ్యవహరించాడు. కాని అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ఇతనితో సంప్రదింపులు జరిపి మంత్రి పదవి ఇవ్వడంతో అయ్యపురెడ్డి జనతా పార్టీని వదలి అధికార పార్టీ అయిన కాంగ్రేస్‌లో చేరి మంత్రి అయ్యాడు. అంతకుముందు అయ్యపురెడ్డి కాంగ్రెస్ నేతే. కానీ 1978 పరిణామాలలో కాంగ్రేస్‌ను వదలి జనతా పార్టీ తరపున పోటీచేశాడు. ఆ తర్వాత కాలంలో అతను మళ్లీ కాంగ్రెస్ ను వదలి తెలుగుదేశం పార్టీలో చేరి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డిని లోక్‌సభ ఎన్నికలలో ఓడించి సంచలనం సృష్టించాడు.[2]

మరణం

[మార్చు]

రెండు సంవత్సరాలుగా అస్వస్థతతో ఉన్న అయ్యపురెడ్డి 89 సంవత్సరాల వయసులో, ఆరోగ్యం క్షీణించి 2009, జూన్ 27న మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. archive, From our online (2012-05-15). "Former MP Ayyapu Reddy is dead". The New Indian Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-31.
  2. "దాడి రాజీనామా-కొన్ని ప్రత్యేకతలు". the original నుండి 2013-07-08 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-06-28.
  3. archive, From our online (2012-05-15). "Former MP Ayyapu Reddy is dead". The New Indian Express (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-07-31.