బుడ్డా రాజశేఖరరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బుడ్డా రాజశేఖరరెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. 2014 శాసనసభ ఎన్నికలలో శ్రీశైలం నియోజకవర్గం నుండి వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ తరపున ఎన్నికయ్యాడు.

జీవిత విశేషాలు[మార్చు]

బుడ్డా రాజశేఖర రెడ్డి మార్చి8 న1967 లో కర్నూలు జిల్లా వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలో దివంగత రాష్ట్ర మంత్రి బుడ్డా వెంగళరెడ్డి, బుడ్డా ఓబులమ్మ దంపతుల రెండవ కుమారుడు. ఈయన సోదరుడు బుడ్డా సీతారామిరెడ్డి ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి అనారోగ్యం కారణంగా మరణించాడు. బుడ్డా రాజశేఖర రెడ్డి రెండవ సోదరుడు బుడ్డా శేషారెడ్డి తండ్రి బుడ్డా వెంగళరెడ్డి హయం నుంచి రాజకీయాల్లో వుంటూ నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యక స్థానం సంపాదించుకున్నాడు. 2009 లో రాజశేఖర రెడ్డి ప్రజారాజ్యం పార్టీ తరపున తన సోదరునిపై పోటి చేశాడు. ఇద్దరు సోదరులు ఓటమి పాలైనారు.

బుడ్డా రాజశేఖరరెడ్డి 10 తరగతి వరకు వెలుగోడులో చదివి, ఉన్నత చదువులను బెంగళూరు హైదరాబాదు లలో పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం [మార్చు]

బుడ్డా వెంగళరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన రాజశేఖర రెడ్డి మొదట కర్నూలు జిల్లా తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. 2004 సాధారణ ఎన్నికల్లో బుడ్డా రాజశేఖర రెడ్డి భార్య బుడ్డా శైలజమ్మ పోటి చేసి ఓడిపోయింది. తరువాతి కాలంలో బుడ్డా సోదరులిద్దరు చెరొక పార్టీ నుంచి పోటీ చెయ్యడంతో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెసు తరుపున పోటి చేసిన ఏరాసు ప్రతాపరెడ్డి గెలుపొంది మంత్రి పదవి పొందాడు. తరువాతి కాలంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో గెలుపొందాడు. ఆ తరువాత కర్నూలు జిల్లా వైకాపా అధ్యక్షుడుగా నియమితులైనాడు.