బద్వేలు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బద్వేలు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవైఎస్ఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°44′24″N 79°3′0″E మార్చు
పటం

బద్వేలు శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోగలదు.

చరిత్ర[మార్చు]

ఇది 1952లో ఏర్పడింది. ఈ స్థానాన్ని అనుసూచిత కులాలకు (ఎస్.సి) కేటాయించారు.[1]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]

2004 ఎన్నికలు[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి చిన్న గోవిందరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కోనిరెడ్డి విజయమ్మను 5281 ఓట్ల తేడాతో ఒడించాడు. గోవిందరెడ్డికి 57023 ఓట్లు రాగా, విజయమ్మకు 51742 ఓట్లు లభించాయి.

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున లక్కినేని చెన్నయ్య అలియాస్ అమృతకుమార్, కాంగ్రెస్ తరపున కమలమ్మ పోటీ చేస్తున్నారు.[2]

నియోజకవర్గ ప్రముఖులు[మార్చు]

వడ్డెమాని చిదానందం

వడ్డెమాని చిదానందం బద్వేలు తొలి శాసనసభా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు. ఈయన అట్లూరు మండలంలోని కమలకూరు గ్రామంలో జన్మించాడు. చిదానందం తర్వాత ఆయన కుమారులైన వడ్డెమాని వెంకటరమణ, వడ్డెమాని శివరామకృష్ణారావులు ఇద్దరూ రాజకీయాలలో ప్రవేశించారు. వెంకటరమణ కమలకూరు సర్పంచి చాలా పనిచేశాడు. శివరామకృష్ణారావు బద్వేలు శాసనసభ సభ్యునిగా పది సంవత్సరాలు పైగా పనిచేశాడు.

ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా[మార్చు]

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2021 (ఉప ఎన్నిక) 124 బద్వేల్ (ఎస్.సి) దాసరి సుధ పు వైఎస్సార్సీపీ 111710 పి. సురేశ్‌ పు బీజేపీ 21621
2019 124 బద్వేల్ (ఎస్.సి) గుంతోటి వెంకట సుబ్బయ్య పు వైఎస్సార్సీపీ ఓబులాపురం రాజశేఖర్‌ పు తె.దే.పా
2014 124 బద్వేల్ (ఎస్.సి) త్రివేది జయరాములు M వైఎస్సార్సీపీ 78302 ఎన్‌డీ విజయ జ్యోతి F తె.దే.పా 68800
2009 243 బద్వేల్ (ఎస్.సి) Kamalamma P.M F INC 78486 Chennaiah Lakkineni M తె.దే.పా 41892
2004 155 బద్వేల్ జనరల్ దేవసాని చిన్న గోవిందరెడ్డి M INC 57023 కొనిరెడ్డి విజయమ్మ F తె.దే.పా 51742
2001 By Polls బద్వేల్ జనరల్ కొనిరెడ్డి విజయమ్మ F తె.దే.పా 58805 వడ్డమాని శివరామకృష్ణారావు M INC 39430
1999 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి M తె.దే.పా 51136 వడ్డమాని శివరామకృష్ణారావు M INC 41155
1994 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి M తె.దే.పా 67083 వడ్డమాని శివరామకృష్ణారావు M INC 40087
1989 155 బద్వేల్ జనరల్ వడ్డమాని శివరామకృష్ణారావు M INC 60804 బిజివేముల వీరారెడ్డి M తె.దే.పా 50803
1985 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి M తె.దే.పా 50034 వడ్డమాని శివరామకృష్ణారావు M INC 40768
1983 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి M ICJ 43140 వడ్డమాని శివరామకృష్ణారావు M INC 38534
1978 155 బద్వేల్ జనరల్ వడ్డమాని శివరామకృష్ణారావు M JNP 44542 బిజివేముల వీరారెడ్డి M INC (I) 34359
1972 155 బద్వేల్ జనరల్ బిజివేముల వీరారెడ్డి M INC 32793 వడ్డమాని శివరామకృష్ణారావు M IND 28549
1967 152 బద్వేల్ జనరల్ B. V. Reddy M INC 34404 P. B. Reddy M IND 24333
1962 159 బద్వేల్ జనరల్ Vaddamani Chidanandam M SWA 25841 బండారు రత్నసభాపతి M INC 19125
1955 137 బద్వేల్ జనరల్ బండారు రత్నసభాపతి M INC 25832 Ramanareddy Puttamreddy M INC 14309

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "బద్వేల్ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009