దేవసాని చిన్న గోవిందరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవసాని చిన్న గోవిందరెడ్డి

ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 నవంబర్ 2021 - 22 నవంబర్ 2027

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 నుండి 2009
నియోజకవర్గం బద్వేలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 23 ఫిబ్రవరి 1956
కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి తులసమ్మ
బంధువులు రమేష్‌రెడ్డి, ఐపీఎస్‌ అధికారి (అల్లుడు)
సంతానం గోపీనాథ్‌రెడ్డి, ఆదిత్యానాథ్‌ రెడ్డి, డాక్టర్‌ సుష్మ
పూర్వ విద్యార్థి ఐఐటీ మద్రాస్‌ ఎంటెక్
మతం హిందూ మతము

దేవసాని చిన్న గోవిందరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 11 నవంబర్ 2021న ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికయ్యాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

డీసీ గోవిందరెడ్డి 23 ఫిబ్రవరి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, పోరుమామిళ్ల గ్రామంలో గోవిందా రెడ్డి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఐఐటీ మద్రాస్‌ నుండి ఎంటెక్ పూర్తి చేశాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

డీసీ గోవిందరెడ్డి 1988లో గ్రూపు–1లో ఎంపికై రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌గా, డిప్యూటీ కమిషనర్‌ ట్రాన్స్‌పోర్ట్‌గా పదోన్నతి పొంది 2001లో ఉద్యోగానికి రాజీనామా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. గోవిందరెడ్డి వైఎస్సార్‌ మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2014లో బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలుపులో కీలకంగాను పని చేయడంతో ఆయనకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2015లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాడు.

బద్వేలు నియోజకవర్గానికి 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో డాక్టర్‌ సుధను 90వేలకు పైగా మెజారిటీతో గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తించి పార్టీ ఆయనకు రెండవసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. ఆయనను 11 నవంబర్ 2021న ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ ప్రకటించింది. ఆయనకు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నవంబర్ 16న బీఫాం అందజేయగా సెక్రటేరియట్‌ లో నామిషన్‌ దాఖలు చేశాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (11 November 2021). "ముగ్గురు ఎమ్మెల్సీల ఖరారు". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  2. Sakshi Post (16 November 2021). "AP CM YS Jagan Hands Over B-forms To MLC Candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.
  3. TV9 Telugu, TV9 (16 November 2021). "ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు.. వైసీపీ అభ్యర్థులకు బీఫాం అందజేసిన సీఎం వైఎస్ జగన్‌". Archived from the original on 18 November 2021. Retrieved 18 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)