గుంతోటి వెంకట సుబ్బయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుంతోటి వెంకట సుబ్బయ్య

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - 28 మార్చి 2021
నియోజకవర్గం బద్వేలు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 జనవరి 1960
వల్లెలవారిపల్లె గ్రామం , గోపవరం మండలం , కడప జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 28 మార్చి 2021
కడప
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వెంకటసుబ్బయ్య, పెంచలకొండమ్మ
జీవిత భాగస్వామి దాసరి సుధ
సంతానం హేమలత, తనయ్‌

గుంతోటి వెంకట సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

గుంతోటి వెంకట సుబ్బయ్య 10 జనవరి 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా , గోపవరం మండలం , వల్లెలవారిపల్లె గ్రామంలో వెంకటసుబ్బయ్య, పెంచలకొండమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన ఎంబీబీఎస్, ఎంఎస్‌ (ఆర్థో) పూర్తి చేసి, వైద్యుడిగా పని చేస్తున్నాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

డాక్టర్ వెంకటసుబ్బయ్య 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2016లో బద్వేలు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడయ్యాడు. డాక్టర్ వెంకటసుబ్బయ్య 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేలు నియోజకవర్గం నుండి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ఓబులాపురం రాజశేఖర్‌పై 44,734 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మరణం[మార్చు]

డాక్టర్ గుంతోటి వెంకటసుబ్బయ్య 28 మార్చి 2021న అనారోగ్యంతో బాధపడుతూ కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మరణించాడు. ఆయనకు భార్య దాసరి సుధ , ఇద్దరు పిల్లలు హేమలత, తనయ్‌ ఉన్నారు. [2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (18 March 2019). "కడప బరిలో..వైఎస్సార్‌ సీపీ దళం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.
  2. Sakshi (28 March 2021). "వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
  3. 10TV (28 March 2021). "వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత" (in telugu). Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)