బిజివేముల వీరారెడ్డి
Jump to navigation
Jump to search
బిజివేముల వీరారెడ్డి భారతదేశ రాజకీయ నాయకుడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను బద్వేల్, కడప జిల్లా కు చెందినవాడు. అతను తెలుగు దేశం పార్టీ కి చెందినవాడు. అతను సర్బంచ్ నుంచి కేబినెట్ మంత్రి స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేశాడు. 2000 సంవత్సరంలో మరణించే వరకు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించాడు. [1] అతను ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఐదుసార్లు సభ్యునిగా తన సేవలనందించాడు. బద్వేల్ ప్రాంత రైతాంగానికి వరప్రసాదమైన తెలుగు గంగ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేసాడు. అతను చేసిన కృషి ఫలితంగా తెలుగు గంగ ఎడమ కాలువకు అతని పేరు పెట్టారు.