Jump to content

సత్రవాడ మునిరామయ్య

వికీపీడియా నుండి
సత్రవాడ మునిరామయ్య

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1988
ముందు అద్దూరు దశరథరామిరెడ్డి
తరువాత తాటిపర్తి చెంచురెడ్డి
నియోజకవర్గం శ్రీకాళహస్తి

వ్యక్తిగత వివరాలు

జననం 1950
శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ పార్టీ
సంతానం ప్రవీణ్
నివాసం శ్రీకాళహస్తి

సత్రవాడ మునిరామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985లో జరిగిన శాసనసభ ఎన్నికలలో శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సత్రవాడ మునిరామయ్య తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి చెంచురెడ్డిపై 80 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన రెండన్నరేళ్ల పాటు శాసనసభ్యులుగా పని చేసి అనంతరం కొన్ని రాజకీయ పరిస్థితులతో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1999లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో 8411 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

సత్రవాడ మునిరామయ్య ఆ తరువాత వైఎస్సార్‌సీపీ చేరి ఆ తరువాత 8 ఫిబ్రవరి 2023న వైయ‌స్ఆర్‌సీపీని వీడి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమఖంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (28 May 2022). "నాయకుడంటే.. ఇలా కదా ఉండాలి!". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  2. Vaartha (8 February 2023). "వైస్సార్సీపీ కి షాక్ : టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.