దేవినేని అవినాష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవినేని అవినాష్
జననం15 March 1988 (1988-03-15) (age 36)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయుడు
వృత్తిరాజకీయ నాయకుడు
రాజకీయ పార్టీవై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులుదేవినేని నెహ్రూ

దేవినేని అవినాష్ (జ.1988 మార్చి 15) యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రాజకీయనాయకుడు. అతను విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ప్రస్తుతం ఉన్నాడు. 2019లో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. అతను 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కొడాలి నాని పై తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసాడు. కొడాలి నాని 9,479 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆంధ్రప్రదేశ్ లో దేవినేని కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన అతి పిన్న వయస్కులైన నాయకులలో అవినాష్ ఒకడు. తన స్వంత ప్రజాకర్షణతో యువత, ప్రజలలో చాలా గుర్తింపు పొందాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

దేవినేని అవినాష్ 1988 మార్చి 15న దేవినేని నెహ్రూ, లక్ష్మీ దంపతులకు జన్మించాడు. అవినాష్ విజయవాడలో సుధీర ను వివాహమాడాడు. వారికి అన్విత (కుమార్తె), రాజశేఖర్ (కుమారుడు) అనే ఇద్దరు పిల్లలున్నారు.

బాల్య జీవితం, విద్య

[మార్చు]

అతను న్యూఢిల్లీ లోని శ్రీ వెంకటేశ్వర కళాశాల నుండి బి.కాం చేసాడు. లండన్ యూనివర్శిటీ ఆఫ్ బిజినెస్ మేనేజిమెంటు నుండి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విద్యనభ్యసించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అవినాష్ విజయవాడలో తన తండ్రి దేవినేని నెహ్రూ స్థాపించిన యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (యుఎస్ఓ) అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.[1] అతని తండ్రి దివంగత దేవినేని నెహ్రూ దివంగత ఎన్. టి. రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. దేవినేని నెహ్రూ ఐదు పర్యాయాలు (1983, 1985, 1989, 1994, 2004) కంకిపాడు మండలం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు.

ప్రస్తుతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విజయవాడ ఈస్ట్ (అసెంబ్లీ నియోజకవర్గం) ఇన్ ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం నుంచి పోటీ చేసిన తన తండ్రి దివంగత దేవినేని నెహ్రూ కోసం అవినాష్ ప్రచారం చేశాడు. అతను సమైక్యాంధ్ర ఉద్యమ విద్యార్థి జెఎసి కన్వీనర్‌గా 100,000 మంది విద్యార్థులతో ఉద్యమాలు చేస్తూ మొత్తం రాష్ట్ర దృష్టిని ఆకర్షించాడు. జల దీక్ష, అనేక ఇతర విద్యార్థి ర్యాలీలతో సహా వివిధ సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు[2].[3] [4] రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు జరిగిన నిరసనలకు ఆయన నాయకత్వం వహించాడు, ఇందులో యువతతో పాటు ఆందోళనలు, బైక్ ర్యాలీలు ఉన్నాయి. అవినాష్ భారత జాతీయ కాంగ్రెస్ లో పనిచేసిన కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, విజయవాడ పార్లమెంటరీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు.

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి విజయవాడ లోక్‌సభ ఎన్నికలు 2014 లో దేవినేని పోటీ చేశాడు.[5][6][7] కానీ, అతను తెలుగు దేశం పార్టీకి చెందిన కేశినేని శ్రీనివాస్ చేతిలో ఓడిపోయాడు. తరువాత, అతను తన తండ్రి దేవినేని నెహ్రూతో కలిసి 2016 లో తెలుగు దేశం పార్టీలో చేరాడు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆతనిని నియమించారు. ఇది తెలుగు దేశం పార్టీ యువజన విభాగం.

అవినాష్ మళ్లీ 2019 ఆంధ్ర ప్రదెశ్ శాసనసభ ఎన్నికలలో గుడివాడ (అసెంబ్లీ నియోజకవర్గం) లో, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావుపై పోటీ చేసి ఓడిపోయాడు[8].[9] ఏదేమైనా, ఈ ఎన్నికలలో అతను మొత్తం రాష్ట్రంలో భారీ ఫాలోయింగ్ సంపాదించాడు. రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా యువతలో అతను తనదైన గుర్తింపును సృష్టించాడు.

తరువాత, అవినాష్ తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి, 2019 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు[10][11][12][13]. ప్రస్తుత సమాజంలో ఉన్న సమస్యలపై యువత దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అనే అభిప్రాయంలో అవినాష్ ఉన్నాడు. దానికి తోడు, తరువాతి తరం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం యువతను శక్తివంతం చేయడం కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం, విజయవాడ ఈస్ట్ (అసెంబ్లీ నియోజకవర్గం) ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పైన టాక్స్ కేసులు ఉన్నాయి అవి జగన్ కి సమానంగా ఉన్నాయి . ఇంకం టాక్స్ వారు రైడింగ్ చేసి కొన్ని ఆస్తులు సీజ్ చేశారు కూడా [14]

మూలాలు

[మార్చు]
  1. Telugu360 (17 April 2017). "Devineni era ends in Vijayawada, a remarkable leader in AP politics". Telugu360.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 7 October 2019.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Students undertake 'Jala Deeksha'". The Hindu (in Indian English). Special Correspondent. 27 August 2013. ISSN 0971-751X. Retrieved 7 October 2019.{{cite news}}: CS1 maint: others (link)
  3. "Students take out rally for Samaikyandhra". The Hindu (in Indian English). Special Correspondent. 19 September 2013. ISSN 0971-751X. Retrieved 7 October 2019.{{cite news}}: CS1 maint: others (link)
  4. "నేటి నుంచి సమైక్య ఉద్యమాలు". Sakshi. 29 January 2014. Retrieved 7 October 2019.
  5. "Win or lose, I will serve people: Devineni Avinash". The Hindu (in Indian English). Special Correspondent. 1 May 2014. ISSN 0971-751X. Retrieved 7 October 2019.{{cite news}}: CS1 maint: others (link)
  6. Rao, G. V. R. Subba (27 April 2014). "A tale of two young leaders". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 7 October 2019.
  7. India, The Hans (1 October 2018). "YSRCP, TD may upset Vangaveeti Radha, Devineni Avinash's applecart". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 7 October 2019.
  8. "Gudivada to witness tough fight between local Kodali Nani, non-local Devineni Avinash". The New Indian Express. Retrieved 7 October 2019.
  9. Talari, Yadedya (13 March 2019). "TDP leader Devineni Avinash begins election campaign in Gudivada". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 7 October 2019.
  10. "In blow to TDP, its youth wing President Devineni Avinash joins YSRCP in Andhra". www.thenewsminute.com. 2019-11-15. Retrieved 23 November 2019.
  11. Bandari, Pavan Kumar (14 November 2019). "Devineni Avinash joins YSRCP in the presence of CM Jagan". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 23 November 2019.
  12. "TDP youth wing president Devineni Avinash joins YSRCP". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 23 November 2019.
  13. "TDP youth wing president Devineni Avinash joins YSRCP". www.aninews.in (in ఇంగ్లీష్). Retrieved 23 November 2019.
  14. Bandari, Pavan Kumar (21 November 2019). "Devineni Avinash gets the post in YSRCP, the young leader thanks CM Jagan". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 23 November 2019.