పామర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పామర్రు
—  రెవిన్యూ గ్రామం  —
పామర్రు is located in ఆంధ్ర ప్రదేశ్
పామర్రు
పామర్రు
అక్షాంశరేఖాంశాలు: 16°19′23″N 80°57′40″E / 16.322985°N 80.961208°E / 16.322985; 80.961208
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి దేవరకొండ రోహిణి
జనాభా (2001)
 - మొత్తం 21,395
 - పురుషుల సంఖ్య 10,947
 - స్త్రీల సంఖ్య 11,421
 - గృహాల సంఖ్య 5,736
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674


పామర్రు
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో పామర్రు మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో పామర్రు మండలం యొక్క స్థానము
పామర్రు is located in ఆంధ్ర ప్రదేశ్
పామర్రు
పామర్రు
ఆంధ్రప్రదేశ్ పటములో పామర్రు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°19′37″N 80°57′40″E / 16.327°N 80.961°E / 16.327; 80.961
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము పామర్రు
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 58,827
 - పురుషులు 29,080
 - స్త్రీలు 29,747
అక్షరాస్యత (2001)
 - మొత్తం 73.48%
 - పురుషులు 78.25%
 - స్త్రీలు 68.85%
పిన్ కోడ్ 521157

పామర్రు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 521 157., ఎస్.టి.డి.కోడ్ = 08674.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలం[మార్చు]

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్ఝవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల మరియు రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలు[మార్చు]

సమీప పట్టణలు[మార్చు]

గుడివాడ,పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

పమిడిముక్కల, పెదపారుపూడి, వుయ్యూరు, గుడివాడ

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

పామర్రు, వుయ్యూరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 44 కి.మీ

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

టి.ఎస్.ఆర్ & ఇ.ఆర్.ఆర్.డిగ్రీ కళాశాల[మార్చు]

టి.కె.ఆర్.పాలిటెక్నిక్[మార్చు]

కంచర్ల రామారావు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న మునిపల్లి రజిత అను విద్యార్థిని, జాతీయ ప్రతిభ ఉపకారవేతనం () పొందుటకు ఎంపికైనది. ఈ విద్యార్థినికి ఇంటరు వరకు, ప్రతి సంవత్సరం ఆరువేల రూపాయల ఉపకార వేతనాన్ని అందించెదరు. [13]

డి.ఎస్.ఆర్.ఉన్నత పాఠశాల[మార్చు]

ఎ.ఎన్.ఎం.పాఠశాల[మార్చు]

బి.సి.బాలికల వసతి గృహం[మార్చు]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

శ్రీ వాసవీ వృద్ధుల శరణాలయం[మార్చు]

ఈ ఆశ్రమం, స్థానిక బందరు రహదారిలో ఉంది. ఈ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ తాళ్ళూరి వెంకటేశ్వరరావు.

బ్యాంకులు[మార్చు]

 1. సిండికేట్ బ్యాంక్:- గ్రామములో ఈ బ్యాంక్ శాఖను, 2015,మే-29వ తేదీనాడు ప్రారంభించారు.
 2. ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం. 08674/253382.
 3. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఫోన్ నం. 08674/255234. సెల్=7702113277.
 4. ఆంధ్రా బ్యాంక్.
 5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియ.
 6. సప్తగిరి గ్రామీణ బ్యాంక్.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

ఈ కేంద్రానికి, 13వ ఆర్థికసంఘం నిధులు రు. 68.50 లక్షలతో నూతన భవన నిర్మాణాన్ని, 2013,జులై-3న ప్రారంభించారు. ఈ భవనం నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. [7]

అంగనవాడీ కేంద్రం[మార్చు]

అగ్నిమాపక కేంద్రం[మార్చు]

వ్యవసాయశాఖ కార్యాలయo[మార్చు]

ఈ గ్రామములో వ్యవసాయశాఖ కార్యాలయానికి ఒక నూతన భవన నిర్మాణానికి, 2016,డిసెంబరు-3వతేదీ శుక్రవారంనాడు శంకుస్థాపన నిర్వహించెదరు. [11]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామంలోని రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

 1. కొరముక్కువానిపురం, చాట్లవానిపురం, కంచర్లవానిపురం గ్రామాలు, పామర్రు గ్రామ పంచాయతీలోని శివారు గ్రామాలు.
 2. 2013 జూలైలో పామర్రు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దేవరకొండ రోహిణి సర్పంచిగా ఎన్నికైనారు. శ్రీ ఆరేపల్లి శ్రీనివాసరావు, ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, 2015,మే నెల-13వతేదీ బుధవారంనాడు, ఆలయ ప్రతిష్ఠా దినోత్సవం సందర్భంగా, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. [4]

శ్రీ వల్మీకేశ్వరీ అమ్మవారి (పుట్లమ్మ తల్లి) ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి ఏకాదశ వార్షిక మహోత్సవాలు 2016,ఫిబ్రవరి-11,12,13 తేదీలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు అభిషేకాలు నిర్వహించారు. 13వ తేదీ శనివారంనాదు రాత్రి అమ్మవారి గ్రామోత్సవం కన్నులపండువగా సాగినది. [9]

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయం స్థానిక వెలమపేటలో, శివాలయం రహదారిపై ఉంది. ఈ ఆలయంలో 2017,మార్చి-6వతేదీ సోమవారం నుండి 11వతేదీ శనివారం వరకు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం నిర్వహించెదరు. ఆరవతేదీ సోమవారం తెల్లవారుఝామున అమ్మవారికి 108 బిందెల నీళ్ళతో అభిషేకం చేసి, అనంతరం, పట్టు వస్త్రాలు ధరింపజేసి, పంబలవారు అమ్మవారి చరిత్రను పారాయణ చేసెదరు. పోతురాజు గడను అలంకరించి, మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో అమ్మవారు, పోతురాజు, ఘటం కుండలతో గ్రామోత్సవం నిర్వహించెదరు. గ్రామ మునసబు వారసుడు శ్రీ బొమ్మారెడ్డి మధుసూదనరెడ్డి ఇంటి నుండి తొలి నైవేద్యాన్ని స్వీకరించెదరు. గ్రామస్థులు ఊరేగింపుగా బయలుదేరి, పసుపు, కుంకుమలతో ఓలలాడుతూ ఇంటింటికీ తిరిగెదరు. 6వతేదీ నుండి 11వతేదీ రాత్రి వరకు, అమ్మవారు గ్రామములో తిరుగుతూ, భక్తులను అలరింపజేసెదరు. గ్రామ పొలిమేరల వద్ద, క్షుద్రశక్తులు గ్రామంలోనికి రాకుండా, పంబలివారు కట్టడి చేసెదరు. 12వతేదీ ఆదివారంనాడు గ్రామోత్సవం నిర్వహించెదరు. 25 వేల జనాభా ఉండి, ఆరువేల గడప ఉన్న పామర్రు గ్రామములో హిందువులంతా ప్రతి ఇంటి నుండి, గారెలు, బూరెలు, పాయసంతో నైవేద్యాలను, సాయంత్రానికి ఆలయం వద్దకు తీసికొని వచ్చి, అమ్మవారికి సమర్పించెదరు. ఆరోజున సుమారు 75,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకొనెదరని అంచనా. [14]

శ్రీ కరుమారి అమ్మవారి ఆలయం[మార్చు]

స్థానిక విజయవాడ రహదారిలోని ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-10, ఆదివారం నాడు, శ్రావణపూర్ణిమ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం, దేవీహోమం నిర్వహించెదరు. అనంతరం మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [3]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామములో 2015,నవంబరు-29వ తేదీ కార్తీకమాసం, ఆదివారంనాడు, భజనలు చేయుచూ, కీర్తనలు పాడుకుంటూ, రాములవారి దీపస్తంభాన్ని గ్రామములో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి హారతులు, కానుకలు, టెంకాయలు సమర్పించారు. కార్తీకమాసం చివరిరోజు వరకు ఇలా ఊరేగించి, ఆ రోజున సుమారు 4000 మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించి, దీపస్తంభాన్ని విష్ణ్వాలయంలో భద్రపరచెదరు. ఈ కార్యక్రమాన్ని సుమారు 100 సంవత్సరాల నుండి, తమ తాతముత్తాతల కాలం నుండి ఇలా నిర్వహించుచున్నామని గ్రామానికి చెందిన శ్రీ వేణుగోపాల బృందావన భజన సమాజం వారు చెప్పుచున్నారు. [8]

ఈ ఆలయాన్ని 60 లక్షల రూపాయలతో పునర్నిర్మించడానికి అంచనాలు తయారుచేస్తున్నారు. ఇందులో గ్రామస్థుల వాటాగా 20 లక్షల రూపాయలు చెల్లించవలసియున్నది. [10] ఈ ఆలయంలో 2016,మే-20వ తేదీ వైశాఖ శుద్ధ చతుర్దశినాడు స్వామివారి కల్యాణోత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. 21వ తేదీ శనివారం, వైశాఖపౌర్ణమినాడు, స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. [11]

శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

స్థానిక రాళ్ళబండివారి చెరువుకట్టపై స్థిరనివాసి అయిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో, 2016,ఫిబ్రవరి-25వ తేదీ గురువారంనాడు శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమం, వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [9]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం[మార్చు]

స్థానిక గుడివాడ రహదారిలోని సాయినగరులోని ఈ ఆలయ 21వ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని, 2015,మే-30వ తేదీ శనివారంనాడు, ఆలయంలో స్వామివారికి ఉదయం ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం పంచామృతసహిత రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులచే సామూహికంగా లక్ష పుష్పార్చన నిర్వహించారు. [5]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం

ఈ ఆలయం స్థానిక గుడివాడ రహదారిలోని

ఈ వ్యాసమును వికిపుస్తకములకు తరలించాలని ప్రతిపాదించబడినది. వివరాలకు చర్చా పేజీ చూడండి.


శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయ ప్రథమ వార్షికోత్సవం, 2015,మే-30వ తేదీ శనివారంనాడు, వైభవంగా నిర్వహించారు. స్వామివారికి అమృతాభిషేకం, ఆకుపూజ నిర్వహించారు. అనంతరం హరేరామ సంకీర్తన గానంచేసారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా తయారుచేసిన గారెలు, బూరెలదండలతో అలంకరించారు. [5]

బుచ్చమ్మ ఆశ్రమం[మార్చు]

స్థానిక విజయవాడ రహదారిలో ఉన్న ఈ ఆశ్రమంలో, శ్రీ పర్వతవర్ధనీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారు కొలువైయున్నారు.

శ్రీ పుట్లమ్మ తల్లి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, చెఱుకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం వివిధ వృత్తుల వ్యాపారస్థులు కలరు

గ్రామ ప్రముఖులు[మార్చు]

 • తుమ్మా కోటమ్మరెడ్డి మాజీ న్యాయమూర్తి,శాసనసభ్యురాలు

గ్రామ విశేషాలు[మార్చు]

పామర్రు గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామం (స్మార్ట్ విలేజ్) గా తీర్చిదిద్దటానికై, ప్రవాసాంధ్రులొకరు, గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [8]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 58,827 - పురుషులు 29,080 - స్త్రీలు 29,747;అక్షరాస్యత (2001) - మొత్తం 73.48% - పురుషులు 78.25% - స్త్రీలు 68.85%

పామర్రు మండలంలోని గ్రామాలు[మార్చు]

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[3]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అడ్డాడ 330 1,288 606 682
2. ఐనంపూడి (పామర్రు) 207 817 436 381
3. బల్లిపర్రు 175 654 347 307
4. జుజ్ఝవరం 758 2,725 1,351 1,374
5. కనుమూరు 722 2,716 1,323 1,393
6. కాపవరం 244 918 456 462
7. కొమరవోలు 675 2,585 1,302 1,283
8. కొండిపర్రు 462 1,637 809 828
9. కురుమద్దాలి 956 3,694 1,772 1,922
10. మల్లవరం (పామర్రు మండలం) 81 268 137 131
11. నిమ్మకూరు 381 1,800 949 851
12. నిభానుపూడి 249 932 469 463
13. నిమ్మలూరు 342 1,145 586 559
14. పామర్రు 5,736 22,368 10,947 11,421
15. పసుమర్రు (పామర్రు మండలం) 568 2,093 1,042 1,051
16. పెదమద్దాలి 947 3,544 1,770 1,774
17. పోలవరం 119 427 205 222
18. ప్రాకర్ల 125 474 236 238
19. రాపర్ల(పామర్రు మండలం) 255 1,041 504 537
20. రిమ్మనపూడి 330 1,181 588 593
21. ఉండ్రపూడి 205 804 395 409
22. ఉరుటూరు 326 1,069 531 538
23. యెలకుర్రు 426 1,349 670 679
24. జమ్మిదగ్గ్గుమిల్ల్లి 136 481 235 246
25. జమిగొల్వేపల్లి 797 2,817 1,414 1,403

వనరులు[మార్చు]

 1. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Pamarru". Retrieved 29 June 2016. External link in |title= (help)
 3. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

బయటి లింకులు[మార్చు]

[2] ఈనాడు, కృష్ణా/పామర్రు; 2014,జులై-29; 1వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఆగష్టు-10; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015,మే-14; 38వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,మే-31; 34వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,జులై-4; 38వపేజీ. [7] ఈనాడు అమరావతి; 2015,జులై-20; 24వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-30; 23వపేజీ. [9] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,ఫిబ్రవరి-14; 1వపేజీ. [10] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-8; 2వపేజీ. [11] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,డిసెంబరు-2; 1వపేజీ. [12] ఈనాడు అమరావతి పామర్రు; 2017,జనవరి-26; 2వపేజీ. [13] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-8; 1వపేజీ. [14] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-5; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పామర్రు&oldid=2563045" నుండి వెలికితీశారు