పెదమద్దాలి
పెదమద్దాలి | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′48″N 80°57′12″E / 16.346746°N 80.953256°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | పామర్రు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,490 |
- పురుషులు | 1,733 |
- స్త్రీలు | 1,757 |
- గృహాల సంఖ్య | 1,039 |
పిన్ కోడ్ | 521390 |
ఎస్.టి.డి కోడ్ | 08674 |
పెదమద్దాలి, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 390., ఎస్.టి.డి.కోడ్ = 08674.
విషయ సూచిక
- 1 గ్రామ చరిత్ర
- 2 గ్రామం పేరు వెనుక చరిత్ర
- 3 గ్రామ భౌగోళికం
- 4 గ్రామానికి రవాణా సౌకర్యాలు
- 5 గ్రామంలో విద్యా సౌకర్యాలు
- 6 గ్రామంలో మౌలిక వసతులు
- 7 గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం
- 8 గ్రామ పంచాయతీ
- 9 గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- 10 గ్రామంలో ప్రధాన పంటలు
- 11 గ్రామంలో ప్రధాన వృత్తులు
- 12 గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
- 13 గ్రామ విశేషాలు
- 14 గణాంకాలు
- 15 మూలాలు
- 16 వెలుపలి లింకులు
గ్రామ చరిత్ర[మార్చు]
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]
విజయవాడరూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరులపాడుమండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.
పామర్రు మండలం[మార్చు]
పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల మరియు రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు
ఈ గ్రామం పామర్రు నుండి 2 కి.మీ., గుడివాడ నుండి 8 కి.మీ., దూరంలో ఉంది.
సమీప గ్రామాలు[మార్చు]
గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి
సమీప మండలాలు[మార్చు]
పెదపారుపూడి, గుడివాడ, వుయ్యూరు, గుడ్లవల్లేరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
పామర్రు, గుడివాడ నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 43 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, పెదమద్దాలి. సి.బి.ఎన్.సి.పి స్కూల్, పెదమద్దాలి. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, కొత్తపెదమద్దాలి.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
పాల కేంద్రం.
గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
కొండాయిపాలెం, పెదమద్దాలి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికకలో శ్రీమతి ఈడ్పుగంటి వసుంధర, సర్పంచిగా ఎన్నికైనారు.[3]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయాన్ని 1830లో, ఒక ఎకరం విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయానికి 18.44 ఎకరాల సాగుభూమి మాన్యంగా ఉంది. అందులో 11.44 ఎకరాలు, అర్చకుల అధీనంలో ఉంది. మిగిలిన 7 ఎకరాల భూమి దేవాదాయశాఖ అధీనంలో ఉంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం, 180 బస్తాల కౌలు ద్వారా, 1.35 లక్షల రూపాయల ఆదాయం వచ్చుచున్నది. కౌలు ద్వారా వచ్చే ఆదాయం, ఆలయ నిర్వహణకే సరిపోవడంలేదు. పురాతనమైన ఈ ఆలయం శిథిలమవడంతో, ఒక కోటి రూపాయల అంచనాతో పునర్నిర్మాణం చేయడానికి దేవాదాయశాఖవారికి నిధుల కొరకు ప్రతిపాదనలు పంపించారు.[4]
ఈ ఆలయంలోని స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, 2016,మే-18 నుండి 21 వరకు వైభవంగా నిర్వహించెదరు.[5]
శ్రీ ఉద్దండవేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]
ఈ ఆలయాన్ని 1836లో, 40 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఆలయానికి 16.11 ఎకరాల సాగుభూమి మాన్యంగా ఉంది. అందులో 6.20 ఎకరాలు, అర్చకుల అధీనంలో ఉంది. మిగిలిన 9.91 ఎకరాల భూమి దేవాదాయశాఖ అధీనంలో ఉంది. దీని ద్వారా ప్రతి సంవత్సరం, 1.70 లక్షల రూపాయల ఆదాయం వచ్చుచున్నది. కౌలు ద్వారా వచ్చే ఆదాయం, ఆలయ నిర్వహణకే సరిపోవడంలేదు. పురాతనమైన ఈ ఆలయం శిథిలమవడంతో, ఒక కోటి రూపాయల అంచనాతో పునర్నిర్మాణం చేయడానికి దేవాదాయశాఖవారికి నిధుల కొరకు ప్రతిపాదనలు పంపించారు. [3]
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి (మే నెలలో) మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.
శ్రీ రామసాయి మందిరం[మార్చు]
ఈ ఆలయ వార్షికోత్సవం, 2016,మే-2వతేదీ సోమవారంనాడు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు, మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు.[6]
శ్రీ గొంతేనమ్మ తల్లి ఆలయం[మార్చు]
ఈ ఆలయంలో గొంతేనమ్మగా పిలువబడే కుంతీదేవి వార్షిక జాతర మహోత్సవాలు, 2016,నవంబరు-20వతేదీ ఆదివారంనాడు మరియు 21వతేదీ సోమవారంనాడు, వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అమ్మవారికి గ్రామములోని ప్రధాన వీధులలో గ్రామోత్సవం నిర్వహించినారు. గ్రామములోని ఈ ఆలయంలో 150 సంవయత్సరాల నుండి ఈ జాతర మహోత్సవం క్రమం తప్పకుండా నిర్వహించుచున్నారు.[7]
శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం[మార్చు]
ఈ గ్రామ శివారులోని కొండాయిపాలెం గ్రామముములో ఉన్న ఈ ఆలయంలో, 2017,ఆగష్టు13వతేదీ ఆదివారంనాడు అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి, డప్పు వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించినారు. గ్రామస్థులు అమ్మవారికి, టెంకాయలు, పసుపు కుంకుమలు చల్ది నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.[8]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారితవృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
- కాకి మాధవరావు
- మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి.
- గవర్నర్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు.
- ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత చలసాని గోపి.
- ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత చలసాని అశ్వనీ దత్తు.
- ప్రముఖ తెలుగు చలనచిత్ర నిర్మాత, ఎన్.టి.ఆర్.సోదరుడు, నందమూరి త్రివిక్రమరావు అత్తగారి ఊరు గూడా ఇదే.
- కాకి సునీత:- ఈ గ్రామానికి చెందిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అయిన కాకి మాధవరావు కుమార్తె కాకి సునీత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈమె ఆకర్షణీయ గ్రామాల సందర్శనలో భాగంగా, ప్రతి ఐ.యే.ఎస్.అధికారీ, ఒక గ్రామాన్ని దత్తర తెసుకోవాలనే ప్రభుత్వ ఉత్తరువుల నేపథ్యంతో, తన స్వగ్రామమయిన పెదమద్దాలి గ్రామాన్ని దత్తత తెసుకొన్నది. గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా, ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి అభివృద్ధి చేయడం ప్రారంభించింది.
- ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ యార్లగడ్డ హరీష్ చంద్రప్రసాద్.
గ్రామ విశేషాలు[మార్చు]
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 3,490 - పురుషుల సంఖ్య 1,733 - స్త్రీల సంఖ్య 1,757 - గృహాల సంఖ్య 1,039
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3544.[9] ఇందులో పురుషుల సంఖ్య 1770, స్త్రీల సంఖ్య 1774, గ్రామంలో నివాస గృహాలు 947 ఉన్నాయి.
మూలాలు[మార్చు]
- ↑ http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Pedamaddali". Retrieved 30 June 2016. Cite web requires
|website=
(help); External link in|title=
(help) - ↑ ఈనాడు అమరావతి; 2015,సెప్టెంబరు-13; 27వపేజీ.
- ↑ ఈనాడు అమరావతి; 2016,జనవరి-20; 23వపేజీ.
- ↑ ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-12; 1వపేజీ.
- ↑ ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-3; 1వపేజీ.
- ↑ ఈనాడు అమరావతి/పామర్రు; 2016,నవంబరు-22; 2వపేజీ.
- ↑ ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఆగష్టు-14; 1వపేజీ.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు