జమిగొల్వేపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జమిగొల్వేపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
జమిగొల్వేపల్లి is located in Andhra Pradesh
జమిగొల్వేపల్లి
జమిగొల్వేపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°13′26″N 80°34′27″E / 16.224°N 80.5742°E / 16.224; 80.5742
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి venkata ratnam
జనాభా (2011)
 - మొత్తం 2,545
 - పురుషులు 1,252
 - స్త్రీలు 1,293
 - గృహాల సంఖ్య 813
పిన్ కోడ్ 521322
ఎస్.టి.డి కోడ్ 08674

జమిగొల్వేపల్లి {Golvepalli (Zami)}, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 322., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలం[మార్చు]

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి

సమీప మండలాలు[మార్చు]

పామర్రు, గుడివాడ, వుయ్యూరు, గుడ్లవల్లేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పామర్రు, గుడివాడ నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 42 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. కుమారి వల్లభనేని శోభ స్మారక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  3. శాఖా గ్రంథాలయం:- గ్రామంలోని ఈ గ్రాంధాలయం గ్రేడ్-3 గ్రంథాలయం.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఆంధ్రా బ్యాంకు. ఫోన్ నం. 08674/258249.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

తొలుత ఈ గ్రామంలో 1957లో పొట్లూరి బసవయ్య, తులసమ్మ మెమోరియల్ ప్రభుత్వ డిస్పెన్సరీ మొదలయినది. ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో, నూతనభవన నిర్మాణానికి, ఎన్.ఆర్.హెచ్.ఎం.నిధులు రు. 45 లక్షలు మంజూరయినవి. అదే సమయంలో దాతలు శ్రీ పెద్దు పద్మనాభరావు, కృష్ణకుమారి దంపతులు, ఈ భవనానికి కావలసిన 40 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఆ స్థలంలో శాశ్వత భవన నిర్మాణానికై 2011,డిసెంబరు-29న శంకుస్థాపన నిర్వహించారు. భవన నిర్మాణం 2014,ఫిబ్రవరి-2న పూర్తి అయినది. 2015,ఏప్రిల్ నుండి ఈ భవనంలో సేవలందించుచున్నారు. అనంతరం దాతల వితరణతో అదనంగా కొన్ని వసతులు ఏర్పడినవి. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రసూతికి ప్రత్యేక ఏర్పాట్లతో ఒక గది, శస్త్ర చికిత్సలకు థియేటరుతోపాటు, 8 గదులు, 6 పడకలతో ఒక వార్డు కలిగి, నూతనంగా తీర్చిదిద్దినారు. ప్రతిరోజూ 40 నుండి 65 మంది రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. త్వరలో ఇక్కడ శస్త్రచికిత్సలు గూడా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆసుపత్రి ఈ గ్రామీణ ప్రాంతంలో పేదలకు వైద్యసేవలందించడంలో ముందంజలో నడుస్తున్నది. ఈ కేంద్రం పరిధిలో కొమరోలు ఉపకేంద్రం ఉంది. [1]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

వ్యవసాయ అవసరాలకు నీరు పుష్కలంగా లభిస్తుంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ వల్లభనేని వెంకటరత్నం, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు, వైశాఖపౌర్ణమి సందర్భంగా, 2016,మే-19వ తేదీ గురువారంనుండి 22వ తేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించెదరు. [3]

శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]

పురాతనమైన ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో, 1960 లో మొదటిసారి పునర్నిర్మించారు. తదుపరి ఈ అలయం ఒకవైపునకు ఒరిగిపోవడంతో, ప్రస్తుతం మరియొకసారి, దాతలు, గ్రామస్థుల ఆర్థిక సహకారంతో 9 లక్షల రూపాయలకు పైగా వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మించారు. దీనికిగాను ప్రధానదాత శ్రీ పెద్ది రాజగోపాలరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు, ప్రవాసాంధ్రుడు శ్రీ రమణకుమార్, మూడున్నర లక్షల రూపాయల విరాళం అందజేసినారు. ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని, 2017,జూన్-14వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ప్రజలు ముఖ్యంగా వ్యవసాయం మీదనే జీవిస్తున్నారు.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన శ్రీ లింగమనేని సూర్యనారాయణరావు, 4 సంవత్సరాలనుండి సేంద్రియ వ్యవసాయంచేయుచూ సత్ఫలితాలు సాంధించుచున్నందుకు, జిల్లాలోనే ఉత్తమ రైతుగా ఎంపికైనారు. వీరికి ఈ పురస్కారాన్ని, 2016,జనవరి-13న విజయవాడలోని సిద్ధార్ధ ఆర్ట్స్ కళాశాలలో జరిగిన సంక్రాంతి సంబరాల సందర్భంగా, రాష్ట్ర మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావుగారి చేతులమీదుగా అందజేసినారు. [1]

రాష్ట్ర నీటిపారుదలశాఖ ముఖ్య సలహాదారు శ్రీ చెరుకూరి వీరయ్య, ఈ గ్రామాన్ని అదర్శగ్రామం (స్మార్ట్ విలేజ్) ఈ తీర్చిదిద్దటానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,545 - పురుషుల సంఖ్య 1,252 - స్త్రీల సంఖ్య 1,293 - గృహాల సంఖ్య 813
జనాభా (2001) -మొత్తం 2817 -పురుషులు 1414 -స్త్రీలు 1403 -గృహాలు 797 -హెక్టార్లు 417

మూలాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Zamigolvepalli". Retrieved 29 June 2016. External link in |title= (help)

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2016,జనవరి-18; 23వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2016,జనవరి-23; 29వపేజీ. [3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-17; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,జూన్-15; 2వపేజీ.