కొమరవోలు (పామర్రు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమరవోలు (పామర్రు)
—  రెవిన్యూ గ్రామం  —
కొమరవోలు (పామర్రు) is located in Andhra Pradesh
కొమరవోలు (పామర్రు)
కొమరవోలు (పామర్రు)
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°22′06″N 80°58′56″E / 16.368401°N 80.982272°E / 16.368401; 80.982272
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,230
 - పురుషులు 1,098
 - స్త్రీలు 1,132
 - గృహాల సంఖ్య 675
పిన్ కోడ్ 521322
ఎస్.టి.డి కోడ్ 08674

కొమరవోలు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.521 322., ఎస్.టి,డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు[మార్చు]

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలం[మార్చు]

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామ భౌగోళికం[మార్చు]

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, పామర్రు, గుడ్లవల్లేరు, నందివాడ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  2. గ్రామ శివారు గాంధీ ఆశ్రమం, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.
  3. ఆర్.సి.ఎం.ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పామర్రు, గుడివాడ నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 45 కి.మీ

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

  1. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం:- ఈ కేంద్రం జమిగొల్వేపల్లి ప్రాథమీక అరోగ్య కేంద్రం పరిధిలో ఉంది.
  2. వీధిదీపాలు:- ఈ గ్రామంలో ఉన్న మొత్తం 210 విద్యుత్తు స్తంభాలకు ఎల్.ఇ.డి.దీపాల ఏర్పాటు ప్రారంభించారు.
  1. పారిశుధ్యం:- ఈ గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయినది.
  2. విద్యుత్తు:- 3,000 మంది గృహ వినియోగదారులు, 400 మంది వ్యవసాయ వినియోదారులు ఉన్న ఈ గ్రామంలో, 1.2 కోట్ల రూపాయలతో ఒక 33/11 కె.వి విద్యుత్తు ఉపకేంద్రం దీనివలన ఈ గ్రామంతోపాటు, చుట్టుప్రక్కల గ్రామాలకు గూడా నాణ్యమైన విద్యుత్తు, నిరంతరాయంగా సరఫరా అవుతుంది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, కూరగాయలు, పండ్లతోటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అమరలింగేశ్వర,దుర్గానాగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం)[మార్చు]

ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, ముఖమండపం ఏర్పాటు, వాహనశాల, వాహనశాల ప్రదర్శన సప్త, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ నిర్మాణం జరిగింది.

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక జాతరను నిర్వహించారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,230 - పురుషుల సంఖ్య 1,098 - స్త్రీల సంఖ్య 1,132 - గృహాల సంఖ్య 675;

2001వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2585.[3] ఇందులో పురుషుల సంఖ్య 1302, స్త్రీల సంఖ్య 1283,గ్రామంలో నివాస గృహాలు 675 ఉన్నాయి.

గ్రామ ప్రముఖులు[మార్చు]

యెర్నేని సుబ్రహ్మణ్యం (1898 - 1974) సాధు సుబ్రహ్మణ్యం గా ప్రసిద్ది చెందిన భారత స్వతంత్ర సమరయోధుడు. గాంధేయవాధి.మహాత్మా గాంధీ గారితో కలసి దండి ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొన్న ఏకైక తెలుగు వ్యక్తి . కొమరవోలులో గాంధీ ఆశ్రమాన్ని స్థాపించారు. వినోభాభావే భూదాన ఉద్యమంలో పాల్గోన్న వ్యక్తి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో పొట్టి శ్రీరాములు గారికి చివరివరకు తోడుండి పోరాడిన వ్యక్టి.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Komaravolu". Archived from the original on 24 ఆగస్టు 2016. Retrieved 29 June 2016. External link in |title= (help)
  3. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.