నిభానుపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిభానుపూడి
—  రెవిన్యూ గ్రామం  —
నిభానుపూడి is located in Andhra Pradesh
నిభానుపూడి
నిభానుపూడి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°17′51″N 80°58′44″E / 16.297559°N 80.978819°E / 16.297559; 80.978819
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 928
 - పురుషులు 463
 - స్త్రీలు 465
 - గృహాల సంఖ్య 249
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

నిభానుపూడి , కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ 521 157., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర[మార్చు]

17వ శతాబ్దంలో, డక్కన్ పరిపాలనా కాలంలో, విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్ళే ఆనాటి ముస్లిం సేనాధిపతి నిభాన్ సాహెబ్, విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిలోని ఈ గ్రామానికి అప్పట్లో గుర్రాలపై వచ్చి, విడిది ఏర్పాటుచేసుకొని చుట్టుప్రక్కల గ్రామాల భూములనుండి పన్నులు వసూలుచేసేవారని చెబుతారు. కాలక్రమేణా ఈ గ్రామం పేరు నిభానుపూడిగా మారినది. నిభాన్ ఇక్కడ ఒక మసీదు కట్టించగా, అతడి సహాయకుడు సఫ్దర్ ఖాన్, అతడి బంధువుల కుటుంబాలు ఇక్కడ స్థిరపడినవి. ఇలా ముస్లిం కుటుంబాలతోపాటు, వ్యవసాయ కూలీలుగా వలస వచ్చిన ఎస్.సి.లు గూడా ఈ గ్రామంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఇలా రూపుదిద్దుకున్న ఈ గ్రామంలో రెండవ ప్రపంచయుద్ధం సమయంలో, మిలిటరీ అధికారులు ఈ గ్రామానికి వచ్చి, ఎత్తుగా బలంగా ఉన్న కొందరు యువకులను సైన్యంలోనికి తీసుకొని వెళ్ళటంతో, దేశ రక్షణ దళాలలోకి ఈ గ్రామస్తుల ప్రవేశం మొదలైనదని భావించవచ్చు. కాలక్రమేణా ఎక్కడ దేశసైనికుల కొరకు ఎంపిక ప్రక్రియ నిర్వహించినా ఈ గ్రామస్థులు వెళ్ళటం పరిపాటిగా మరినది. 1939లో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధం, 1962లో జరిగిన చైనాతో యుద్ధం, 1965లోని పాకిస్థానుతో యుద్ధం, అనంతరం జరిగిన కార్గిల్ యుద్ధంలో పాలుపంచుకున్నవారు ఇక్కడివారే కావటం గమనార్హం. దేశరక్షణదళంలో నాటినుండి నేటి వరకు, సుమారు 40 నుండి 80 మంది వరకు పనిచేయగా, వీరిలో ఖలీల్ రెహమాన్, లెఫ్టినెంటు కల్నలుగా హోదానుపొంది, రాష్ట్రపతి నుండి సన్మానం పొంది గ్రామానికే గర్వకారణంగా నిలిచారు. సుబేదర్ మేజర్ దాసి వెంకటేశ్వరరావు హ్యారీ కెప్టెనుగా, అబ్దుల్ హమీద్, ఎం.డి.అన్సారీలు సుబేదార్లుగా పనిచేసారు. 1947లో స్వాతంత్ర్య ఉద్యమంలో గ్రామానికి చెందిన అబ్దుల్ అజీజ్ (తండ్రి=జియ ఉల్ రెహమాన్), అబ్దుల్ సమద్, అబ్దుల్ అజీజ్ లు పాల్గొనడం గమనార్హం. 1939 లో జరిగిన యుద్ధంలో అబ్దుల్ అజీజ్ వీరమరణం పొందినారు. వెరిని ఆదర్శంగ తీసికొని మరికొందరు ఇప్పటికీ సైన్యంలో ఉద్యోగాలు చేస్తుండగా, మరికొందరు పోలీసుశాఖలో ఎస్.ఐ. కానిస్టేబుల్స్ గా సుమారుగా 20 మంది పనిచేయుచూ, ప్రజాసేవకు అంకితమవడం విశేషం. అందుకే ఈ గ్రామంలో ఏ ఇంటిలో చూసినా, దేశమాత సేవలో మ వంశం నుండి ఒకరున్నారని గర్వంగా చెబుతారు. [2]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, మచిలీపట్నం, తెనాలి

సమీప మండలాలు[మార్చు]

పమిడిముక్కల, గుడ్లవల్లేరు, పెదపారుపూడి, మొవ్వ

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పామర్రు, కూచిపూడి నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 47 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

మండల పరిష;త్తు ప్రాథమిక పాఠశాల.

మండల పరిష;త్తు ఉర్దూ ప్రాథమిక పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలోలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి దాసరి నిర్మల సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ అరిశే రామారావు ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 928 - పురుషుల సంఖ్య 463 - స్త్రీల సంఖ్య 465 - గృహాల సంఖ్య 249

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 932.[2] ఇందులో పురుషుల సంఖ్య 469, స్త్రీల సంఖ్య 463, గ్రామంలో నివాస గృహాలు 249 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Nibhanupudi". Archived from the original on 30 సెప్టెంబర్ 2017. Retrieved 30 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-11.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-1; 23వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2016, జనవరి-27; 24వపేజీ.


నిభాను పూడి చాల అందమైన ఊరు. మా ఇంటి పేరు అరిశే; నాపేరు విజయశ్రీ.