భారతీయ స్టేట్ బ్యాంకు

వికీపీడియా నుండి
(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారతీయ స్టేట్ బ్యాంకు
Typeపబ్లిక్
ISINUS8565522039 Edit this on Wikidata
పరిశ్రమబ్యాంకింగ్, ఆర్థిక సేవలు
స్థాపన
  • 2 జూన్ 1806, బ్యాంక్ ఆఫ్ కలకత్తా పేరుతో స్థాపన
  • 27 జనవరి 1921, ఇంపీరియల్ బ్యాంకు అఫ్ ఇండియా
  • 1 జులై 1955, భారతీయ స్టేట్ బ్యాంకు
  • 2 జూన్ 1956, జాతీయం
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం ముంబై, భారతదేశం
Areas served
ప్రపంచవ్యాప్తం
Key people
దినేష్ కుమార్ ఖరా
Productsరీటైల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు, ఫైనాన్స్ , ఇన్సూరెన్స్ సేవలు, పెట్టుబడిల బ్యాంకింగ్ సెవలు, లోన్స్ , ప్రైవేట్ బ్యాంకింగ్ & ఈక్విటీ, సేవింగ్స్ & సెక్యూరిటీస్, క్రెడిట్ , డెబిట్ కార్డ్స్
Revenue
  • Increase 2,98,640.45 crore (US$37 billion) (2017)
  • 2,73,461.13 crore (US$34 billion) (2016)
Increase 50,847.90 crore (US$6.4 billion) (2017)
  • Increase 10,484.10 crore (US$1.3 billion) (2017)
  • 9,950.65 crore (US$1.2 billion) (2016)
Total assetsIncrease 27,05,966.30 crore (US$340 billion) (2017)
Total equityIncrease 1,44,274.65 (US$1,800) (2016)
Number of employees
  • Increase 264,041 (2018)
  • 209,567 (2017)
  • 207,739 (2016)
Capital ratio13.12% (2016)
Websitewww.sbi.co.in Edit this on Wikidata
Footnotes / references
[1][2][3][4]

'భారతీయ స్టేట్ బ్యాంకు లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంకు. బ్రాంచీల సంఖ్య, పనిచేయు సిబ్బంది ప్రకారం చూస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకు. 1806లో కోల్‌కతలో స్థాపించబడిన ఈ బ్యాంకు భారత ఉపఖండంలోనే అతి పురాతనమైన బ్యాంకులలో ఒకటి. ఈ బ్యాంకు దేశీయ, అంతర్జాతీయ, ప్రవాస భారతీయ సేవలను అందిస్తుంది. 1955లో భారత ప్రభుత్వము ఈ బ్యాంకును జాతీయం చేసి తన అధీనం లోకి తీసుకుంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంకు రెండు ప్రధాన చర్యలను చేపట్టింది. మొదటిది పనిచేయు సిబ్బంది సంఖ్యను కుదించడం కాగా రెండవది కంప్యూటరీకరణ.‬

ప్రారంభ బీజాలు

19 వ శతాబ్దంలోనే దీని స్థాపనకు బీజాలు ఏర్పడ్డాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్‌గా పేరు మార్చబడింది. పేరు మార్చుకున్న బ్యాంక్ ఆఫ్ కలకత్తా 2 జూన్, 1806 న స్థాపించబడింది. తరువాత బ్యాంక్ ఆఫ్ బెంగాల్, రెండు ఇతర ప్రెసిడెన్సి బ్యాంకులు [బ్యాంక్ ఆఫ్ బాంబే (1840 లో స్థాపన), బ్యాంక్ ఆఫ్ మద్రాస్ (1921 లో స్థాపన) ] కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా ప్రభుత్వం మార్చివేసింది. ప్రెసిడెన్సీ బ్యాంకుల మాదిరిగానే ఇంపీరియల్ బ్యాంకు కూడా జాయింట్ స్టాక్ కంపెనిగా కార్యకలాపాలు నిర్వహించింది. దేశంలో రిజర్వు బ్యాంకు స్థాపించేవరకు ఈ బ్యాంకు దేశ కేంద్ర బ్యాంకుగా నోట్ల ముద్రణ విధులను కూడా నిర్వహించింది.

భారతీయ స్టేట్ బ్యాంక్ చట్టం, 1955 ప్రకారం దేశంలో కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారము 30 ఏప్రిల్, 1955 నాడు ఇంపీరియల్ బ్యాంకుకు ఉన్న అధీకృత మూలధనం మొత్తం నూతనంగా ఏర్పాటు చేయబడిన భారతీయ స్టేట్ బ్యాంకుకు మార్చబడింది.

కాలగమనంలో స్టేట్ బ్యాంకు

  • 21 జూన్, 1806: కలకత్తా బ్యాంకు స్థాపన.
  • 21 జనవరి, 1809: దీనిని బ్యాంక్ ఆఫ్ బెంగాల్ గా .
  • 15 ఏప్రిల్, 1840: బ్యాంక్ ఆఫ్ బాంబే స్థాపన .
  • 11 జూలై, 1843: బ్యాంక్ ఆఫ్ మద్రాస్ స్థాపన .
  • 1861: పేపర్ కరెన్సీ చట్టం జారీ .
  • 27 జనవరి, 1921: మూడు బ్యాంకులను కలిపి ఇంపీరియల్ బ్యాంకుగా మార్పు .
  • 11 జూలై, 1955: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపన (జాతీయం చేయబడిన తొలి బ్యాంకు) .
  • 1959: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ బ్యాంకుల చట్టం జారీ, దీనితో 8 పూర్వపు రాష్ట్ర అనుబంధ బ్యాంకులను వాటి శాఖలను తన అధీనంలోకి తెచ్చుకుంది .
  • 1980 కేరళలో బ్యాంక్ ఆఫ్ కొచ్చిన్ ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు దానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. .
  • 29 జూన్, 2007: స్టేట్ బాంకులో ఉన్న మొత్తం రిజర్వ్ బ్యాంకు షేర్ హోల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది.

మునుపటి అనుబంధ బ్యాంకులు

భారతీయ స్టేట్ బ్యాంకుకు గతంలో 7 అనుబంధ బ్యాంకులు ఉండేవి. అవన్నీ సాధారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ... అనే పేరుతో ప్రారంభమై చివరన ఆయా బ్యాంకుల ప్రధాన స్థావరం ఉన్న నగరాల పేర్లతో అంతమౌతుంది. ఇవి 1959లో జాతీయం చేయడానికి ముందు ఆయా సంస్థాన రాజ్యాలకు చెందినవి. మొదటి పంచవర్ష ప్రణాళికలో గ్రామీణాభివృద్ధి లక్ష్యాన్ని సాధించుటకు ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటినీ కల్పి స్టేట్ బ్యాంక్ గా మార్పు చేసింది. ఈ బ్యాంకులన్నింటికీ కల్పి ఒకే లోగో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ను ఇవన్నీ మాతృ సంస్థగా పరిగణిస్తాయి. 2008 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, 2009 లో స్టేట్ బ్యాంక్ ఇండోర్ మాతృసంస్థ లో విలీనం అయ్యాయి. మిగిలిన 5 అనుబంధ బ్యాంకులు 2016 లో విలీనం అయ్యాయి.

విదేశాలలో శాఖలు

మూలాలు

  1. "Annual Report [2016-17] of State Bank of India" (PDF). Archived from the original (PDF) on 2017-07-28. Retrieved 2017-07-12.
  2. "State Bank of India Consolidated Yearly Results, State Bank of India Financial Statement & Accounts". www.moneycontrol.com. Retrieved 2017-06-26.
  3. "State Bank of India Yearly Results, State Bank of India Financial Statement & Accounts". www.moneycontrol.com. Retrieved 2017-06-26.
  4. "From Imperial Bank to State Bank" (PDF). Retrieved 28 June 2017.

బయటి లింకులు