Jump to content

కెనరా బ్యాంకు

వికీపీడియా నుండి
కెనరా బ్యాంకు వ్యవస్థాపకుడు ఎ.సుబ్బారావు పాయ్
కెనరా బ్యాంకు
తరహాపబ్లిక్ బి.ఎస్.ఇ: 532483
స్థాపనకెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్ (1906)
కెనరా బ్యాంకు లిమిటెడ్ (1910)
కెనరా బ్యాంకు (1969)
ప్రధానకేంద్రము బెంగుళూరు, భారతదేశం
పరిశ్రమఫైనాన్స్
వాణిజ్య బ్యాంకులు
ఉద్యోగులు58,853 (2018 నాటికి)
వెబ్ సైటుకెనరా బ్యాంకు అధికారిక వెబ్‌సైట్

భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో కెనరా బ్యాంకు (Canara Bank) ఒకటి. ఈ బ్యాంకును 1906లో కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో స్థాపించారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు పేరు కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. దీని స్థాపకుడు ప్రముఖ న్యాయవాది అమ్మెంబాల్‌ సుబ్బారావు పాయ్. ఈ బాంకు భారత్‌లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. 1910లో ఈ బాంకు పేరు కెనరా బ్యాంకు లిమిటెడ్‌గా మార్చబడినది. జూలై 19, 1969లో మొదటిసారి జాతీయము చేయబడిన 14 బాంకులలో కెనరా బాంకు ఒకటి.

కెనరా బ్యాంకు సమాచారం

[మార్చు]
కెనరా బాంకు చరిత్ర-రచన ఎమ్.వి.కామత్
ప్రధాన కార్యాలయం బ్యాంకు శాఖలు ఖాతాదారులు ఉద్యోగులు విస్తరణ విదేశాలలో శాఖలు
బెంగుళూరు 6639(2019) 31 మిలియన్లు 58,350(2019) 25 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు బ్రిటన్లోని లండన్, చైనాలోని షాంఘయి, హాంకాగ్

గుర్తింపులు

[మార్చు]
  • 2006లో ఫోర్బెస్ గ్లోబల్ 2000 ర్యాంకింగ్‌లో 1299 స్థానం పొందినది.
  • 2005-06లో ఉత్తమ ప్రభుత్వరంగ బ్యాంకు అవార్డు స్వీకరించినది.
  • 2007 వ సంవత్సర బ్యాంకర్ పత్రిక అతి పెద్ద వెయ్యి బాంకులలో 280వ స్థానం

ఈ బాంకు పరిధిలోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు

[మార్చు]
  • శ్రేయాస్ గ్రామీణ బ్యాంకు
  • సౌత్ మలబార్ గ్రామీణ బ్యాంకు
  • ప్రగతి గ్రామీణ బ్యాంకు

బయటి లింకులు

[మార్చు]